తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Box Office: పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్.. భారీగా టార్గెట్.. హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Family Star Box Office: పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్.. భారీగా టార్గెట్.. హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Sanjiv Kumar HT Telugu

11 April 2024, 13:39 IST

  • Family Star 6 Days Box Office: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తుంది. ఏప్రిల్ 5న రిలీజైన ఈ సినిమాకు వసూళ్లు కూడా హెచ్చుతగ్గులతో వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే..

పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్.. భారీగా టార్గెట్.. హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్.. భారీగా టార్గెట్.. హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్.. భారీగా టార్గెట్.. హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Family Star 6 Days Collection: ద విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో రెండోసారి వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమానకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే, ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆరో రోజున తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 42 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. గత ఐదు రోజులుగా చూస్తే ఆరో రోజున కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

తెలుగు స్టేట్స్ కలెక్షన్స్

ఈ మూవీకి ఐదో రోజున రూ. 1.12 కోట్లు రాగా నాలుగో రోజున రూ. 45 లక్షలు వచ్చాయి. ఇప్పుడు 6వ రోజున 42 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు 6 రోజులకు రూ. 8.67 కోట్ల షేర్ కలెక్షన్స్‌తోపాటు రూ. 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఏరియాలా వారీగా వసూళ్లు

ఈ కలెక్షన్ల నుంచి వాటిలో నైజాం నుంచి 4.40 కోట్లు, సీడెడ్‌లో 82 లక్షలు, ఉత్తరాంధ్రలో 93 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 54 లక్షలు, వెస్ట్‌లో 46 లక్షలు, గుంటూరులో 57 లక్షలు, కృష్ణా నుంచి 50 లక్షలు, నెల్లూరు నుంచి 45 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా నుంచి కలుపుకుని రూ. 1.10 కోటి దాకా కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

వరల్డ్ వైడ్‌గా వచ్చింది

అలాగే ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆరు రోజుల్లో ఓవర్సీస్ నుంచి 4.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు రూ. 14.42 కోట్ల షేర్ కలెక్షన్స్, 27.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం.

ఇంకా రావాల్సింది

ఇదిలా ఉంటే, ఫ్యామిలీ స్టార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లు అయింది. ఇప్పటికీ సినిమాకు 14.42 కోట్లు వచ్చాయి. కాబట్టి, ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇంకా 29.58 కోట్లు రావాల్సి ఉంది. ఇలా అయితేనే సినిమా ఫ్లాప్‌గా కాకుండా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. అప్పుడే నిర్మాతలకు నష్టం రాకుండా ఉంటుంది.

హిట్ పడుతుందా?

అయితే, ఈ టార్గెట్ సినిమాకు పెద్దగానే కనిపిస్తోంది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమా కూడా గట్టి పోటీ ఇస్తుంది. మరి ఆ సినిమా పోటీని తట్టుకుని ఫ్యామిలీ స్టార్ 29 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అన్నికోట్లు కలెక్ట్ కాకుంటే విజయ్ దేవరకొండకు మరోసారి ఫ్లాప్ పడినట్లే అని తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం