తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fahadh Fasil: ఫహాద్ 'మాలిక్' తెలుగు ట్రైలర్ చూశారా? ఓ లుక్కేయండి

Fahadh Fasil: ఫహాద్ 'మాలిక్' తెలుగు ట్రైలర్ చూశారా? ఓ లుక్కేయండి

06 August 2022, 17:27 IST

google News
    • మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన మాలిక్ చిత్రం తెలుగులోనూ రాబోతుంది. గతేడాది ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో ఆహా వేదికగా విడుదల చేయనున్నారు.
ఫహాద్ మాలిక్ సినిమా
ఫహాద్ మాలిక్ సినిమా (Twitter)

ఫహాద్ మాలిక్ సినిమా

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్. పుష్ప సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైనప్పటికీ ఓటీటీ ద్వారా అంతకుముందే సుపరిచితులు. కరోనా కాలంలో ఓటీటీల్లో ఆయన సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. గతేడాది ఈ మల్లూ స్టార్ కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మాలిక్. కరోనా కాలంలో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆహా వేదికగా మాలిక్ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఆగస్టు 12 నుంచి మాలిక్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఫహాద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇందులో ఆయన నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.

మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిమిషా సంజయన్, వినయ్ ఫోర్ట్, జోజూ జార్జ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు.

ఈ ఏడాది విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫహాద్.. సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు ఈ నటుడు. ఇవి కాకుండాపుష్ప-2 ది రూల్ సినిమా కూడా చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం