Extra-ordinary Man Trailer: ఫుల్ ఎంటర్‌టైన్మెంట్.. నితిన్ ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది
27 November 2023, 17:15 IST
- Extra-ordinary Man Trailer: నితిన్ నటిస్తున్న ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం (నవంబర్ 27) రిలీజైన ఈ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా సాగింది.
ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో నితిన్
Extra-ordinary Man Trailer: వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ట్రైలర్ సోమవారం (నవంబర్ 27) రిలీజైంది. శ్రీలీల ఫిమేల్ లీడ్ గా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ మొత్తం మంచి వినోదాన్ని పంచింది. ట్రైలర్ లో చాలా వరకూ కామెడీతోనే నింపేయగా.. మధ్యలో కాస్త యాక్షన్ జోడించి ఇంట్రెస్టింగ్ గా మలిచారు.
ఈ ఎక్ట్రా-ఆర్డినరీ మ్యాన్ మూవీలో నితిన్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్దామని అడుగుపెట్టి.. ప్రతిసారీ ఎక్కడో వెనక్కి వెళ్లిపోయే పాత్రలో నితిన్ మంచి వినోదాన్ని పంచాడు. ట్రైలర్ మొత్తం తన కామెడీ టైమింగ్ తో అతడు అలరించాడు. ఇక నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా కామెడీ పండించాడు.
ట్రైలర్ లో ఈ తండ్రీ కొడుకుల మధ్య సీన్లు బాగా నవ్వించాయి. ఇక ట్రైలర్ చివర్లో రాజశేఖర్ స్పెషల్ అప్పియరెన్స్ ఆకట్టుకుంది. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు నితిన్ తో మాట్లాడే డైలాగులు నవ్వు తెప్పించాయి. "జీవితం చెప్పేది తప్ప.. జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను" అని అంటాడు రాజశేఖర్. దానికి జీవితా సార్ అని నితిన్ అడుగుతాడు.
నాకు రెండూ ఒకటే అంటూ తన రియల్ లైఫ్ వైఫ్ జీవిత గురించి చెబుతాడు. ఇక ట్రైలర్ కామెడీతో మొదలై కామెడీతో ముగియగా.. మధ్యలో కాస్త యాక్షన్ కూడా కనిపించింది. ట్రైలర్ లో సినిమా స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు. అదే సమయంలో ఫిమేల్ లీడ్ శ్రీలీల కూడా ఇందులో ఎక్కువగా కనిపించలేదు. మొత్తానికి సినిమా సరదాగా సాగిపోయే ఓ ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు. సుధాకర్ రెడ్డి సినిమాను నిర్మించాడు. ఈ ఎక్ట్స్రా ఆర్డినరీ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.