Extra Ordinary Man Teaser: జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్.. అదిరిపోయిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్: చూసేయండి
08 January 2024, 18:23 IST
- Extra Ordinary Man Teaser: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ వచ్చేసింది. నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఈ టీజర్ ఆద్యంతం కామెడీతో అదిరిపోయింది.
Extra Ordinary Man Teaser: జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్.. అదిరిపోయిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్: చూసేయండి
Extra Ordinary Man Teaser: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్ నుంచే ఈ మూవీపై మంచి బజ్ నెలకొంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. చాలా బ్లాక్‍బాస్టర్లకు రచయితగా చేసిన వక్కంతం వంశీ ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తుండడం కూడా ఈ చిత్రానికి మరో హైలైట్‍గా ఉంది. కాగా, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా టీజర్ నేడు (అక్టోబర్ 30) వచ్చేసింది.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ ఆసాంతం కామెడీ ప్రధానంగానే సాగింది. విభిన్నమైన గెటప్‍ల్లో నితిన్ కనిపించారు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసే యువకుడి పాత్రను నితిన్ ఈ చిత్రంలో పోషించారు నితిన్. “నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావ్ కదా” అంటూ హీరోయిన్ శ్రీలీల.. నితిన్‍తో అంటారు. నితిన్ తండ్రిగా నటించిన రావు రమేశ్ కూడా ఈ టీజర్లో హైలైట్‍గా నిలిచారు. ఆయన మార్క్ వెటకారం బాగా పండింది. “బాహుబలి సినిమాలోని దండాలయ్య పాటలో జనాల్లో ఆరో లైన్లో ఏడో వాడు ఎవరో తెలుసా” అంటూ సంపత్‍తో నితిన్ డైలాగ్ ఉంది. నితిన్ ఫేస్ ప్యాక్ చేసుకుంటుంటే.. "ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు” అని రావు రమేశ్ పంచ్ వేస్తారు. విడివిడిగా కాకుండా ఎక్స్‌ట్రార్డినరీ అనాలని నితిన్ చెబుతారు. దీంతో “కొడుడు.. చెత్త.. చెత్త నా కొడుకు” అంటూ చెత్తబుట్టను రావు రమేశ్ తన్నడంతో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ ముగిసింది.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ మొత్తం దాదాపు ఫన్నీగా సాగింది. నితిన్, రావు రమేశ్ హైలైట్ అయ్యారు. హ్యారిస్ జైరాజ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సూటైంది. దర్శకుడు వక్కంతం వంశీ.. ఈ చిత్రంలో పంచ్‍లను గట్టిగానే నింపినట్టు అర్థమవుతోంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, టీజర్లో మాత్రం ఆయన కనిపించలేదు. కాగా, ఈ చిత్రంలో సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది, రవివర్మ కీలకపాత్రలు చేశారు.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. యువరాజ్, అర్థర్ విల్సన్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు.