King Of Kotha OTT: ఓటీటీలోకి 'సీతా రామం' హీరో కొత్త మూవీ.. 'కింగ్ ఆఫ్ కోత' స్ట్రీమింగ్ ఎందులో అంటే?
27 August 2023, 11:49 IST
King Of Kotha OTT Rights: మలయాళ పాపులర్ హీరో దుల్కర్ సల్మాన్‍కు సీతా రామం సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆయన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన కింగ్ ఆఫ్ కోత మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ప్రస్తుతం దాని ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తికరంగా మారాయి.
Dulquer Salmaan King Of Kotha Movie OTT
King Of Kotha OTT Partner: తెలుగులో అందమైన ప్రేమ కావ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం సీతా రామం. ఈ మూవీతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అయితే దుల్కర్ సల్మాన్ ఎప్పటి నుంచో తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఓకే బంగారం మూవీతో తెలుగులోకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు.
మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రాలన్నీ తెలుగులోకి డబ్ అయ్యాయి. వాటిలో కనులు కనులు దోచాయంటే, కురుప్, చుప్ వంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ఇటీవల మరో సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దుల్కర్ సల్మాన్. గ్యాంగ్‌స్టర్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోత (King Of Kotha). అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా ఆగస్ట్ 24న రిలీజ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కింగ్ ఆఫ్ కోత ఓటీటీ స్ట్రీమింగ్ (King Of Kotha OTT Streaming) వివరాలు హాట్ టాపిక్‍గా మారాయి. కింగ్ ఆఫ్ కోత సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ (Disney Plus Hotstar) చేజిక్కుంచుకుందని టాక్. అలాగే మూవీ థియేటర్ రిలీజుకు 40 రోజుల తర్వాత ఓటీటీలో (King Of Kotha Movie OTT) స్ట్రీమింగ్ చేయనున్నారట. అయితే కింగ్ ఆఫ్ కోత బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రకారం స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే కింగ్ ఆఫ్ కోత సినిమాను వేఫరేర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. దుల్కర్‍కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి చేసింది. అలాగే ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనికా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.