తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lokesh Kanagaraj Bmw Car: కాస్ట్‌లీ బీఎమ్‌డ‌బ్ల్యూ కారు కొన్న లోకేష్ క‌న‌క‌రాజ్ - ధ‌ర‌ ఎంతో తెలుసా?

Lokesh Kanagaraj Bmw Car: కాస్ట్‌లీ బీఎమ్‌డ‌బ్ల్యూ కారు కొన్న లోకేష్ క‌న‌క‌రాజ్ - ధ‌ర‌ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

17 August 2023, 14:04 IST

google News
  • Lokesh Kanagaraj Bmw Car: డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ కాస్ట్‌లీ బీఎమ్‌డ‌బ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. ఈ కారుతో లోకేష్ కన‌క‌రాజ్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

లోకేష్ క‌న‌క‌రాజ్‌
లోకేష్ క‌న‌క‌రాజ్‌

లోకేష్ క‌న‌క‌రాజ్‌

Lokesh Kanagaraj Bmw Car: ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డిగా చెలామ‌ణి అవుతోన్నాడు లోకేష్ క‌న‌క‌రాజ్‌. ఖైదీ, మాస్ట‌ర్‌, విక్ర‌మ్ సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అత‌డితో సినిమాలు చేసేందుకు సౌత్ స్టార్స్ అంద‌రూ ఆస‌క్తిని చూపుతోన్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన‌ విక్ర‌మ్ సినిమా నాలుగు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో లియో సినిమా చేస్తున్నాడు లోకేష్ క‌న‌క‌రాజ్‌. ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న లోకేష్ క‌న‌క‌రాజ్ తాజాగా ఓ ఖ‌రీదైన బీఎమ్‌డ‌బ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. బీఎమ్‌డ‌బ్ల్యూ సెవ‌న్ సిరీస్ మోడ‌ల్‌కు చెందిన ఈ కారు ఖ‌రీదు రెండు కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. బీఎమ్‌డ‌బ్ల్యూ కారుతో లోకేష్ క‌న‌క‌రాజ్‌ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ప్ర‌స్తుతం లొకేష్ క‌న‌క‌రాజ్ ఒక్కో సినిమాకు యాభై కోట్ల‌కుపైనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. లియో సినిమా కోసంకెరీర్‌లో అత్య‌ధికంగా 70 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న లియో సినిమా అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో పాటు సంజ‌య్‌దేత్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తదుపరి వ్యాసం