NTR | ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
19 May 2022, 6:11 IST
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. త్వరలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభంకానుంది. అలాగే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయాల్సివుంది. వీటితో పాటు వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఏమన్నారంటే...
ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తో కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత అతడితో పనిచేయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలుసైతం ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్.
ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాల్సివుంది. వీటితో పాటు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎఫ్-3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అనిల్‌రావిపూడి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో సినిమా తప్పకుండా చేస్తానని అనిల్ రావిపూడి అన్నాడు. ఆయన్ని కలిసి ఓ పాయింట్ వినిపించాననని చెప్పాడు. ఎన్టీఆర్ ప్రజెంట్ కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాతే మా ఇద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.
ఎఫ్-3 తర్వాత తాను బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్3 చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
టాపిక్