Jogi Trailer released: 1984 సిక్కుల ఊచకోతపై సినిమా.. రక్తపాతాన్ని కళ్లకు కట్టిన ట్రైలర్
30 August 2022, 14:40 IST
- Jogi Trailer: సిక్కుల ఊచకోత ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
జోగి ట్రైలర్ విడుదల
Jogi Trailer: 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగిన విషయం తెలిసిందే. సిక్కులపై జరిగిన మారణహోమాన్ని చరిత్ర ఎన్నటికీ మరువదు. ఎంతోమంది అమాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రక్తపాతాన్ని, విధ్వంసకాండను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. ఆయన దర్శకత్వంలో దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలో రూపొందిన చిత్రం జోగి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన నేపథ్యంలో దిల్లీ, పంజాబ్‌ల్లోని సిక్కులను అల్లరి మూకలు దారుణంగా హత్య చేశాయి. ఇళ్లకు నిప్పుపెట్టి సజీవ దహనం చేసిన ఘటనలను కోకొల్లలు, ఈ క్రమంలో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో మంది భార్యబిడ్డలతో ఇతర ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు.
ఇలాంటి హృదయవిదారకర ఘటనల ఆధారంగా జోగి సినిమా తెరకెక్కించారు అలీ అబ్బాస్ జాఫర్. సెప్టెంబరు 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు స్నేహితులు.. మూడు రోజుల పాటు తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారనేది చిత్ర కథాశం.
ఈ సినిమాలో దిల్జత్ దోసాంజ్‌తో పాటు జీషన్ ఆయూబ్, కుముద్ మిశ్రా, హిటేన్ తేజ్వానీ, అమైర దస్తూర్, పరేశ్ పహుజా తదితరులు నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
టాపిక్