తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Olympic Committee On Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం లేదు

Olympic Committee On Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం లేదు

Anand Sai HT Telugu

21 January 2023, 10:40 IST

    • Los Angeles Olympics 2028 : ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో క్రికెట్ ఒక్కసారి మాత్రమే ఆడారు. 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అయితే ఆ తర్వాత నుంచి క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కావడంలో విఫలమైంది. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి ఒలంపిక్ కమిటీ స్పష్టం చేసింది.
ఒలంపిక్స్
ఒలంపిక్స్ (twitter)

ఒలంపిక్స్

లాస్ ఏంజెల్స్ 2028(los angeles olympics 2028) ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్ చూడాలనే కలతో ఎదురుచూస్తున్న చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చలేమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి తెలియజేసింది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ తర్వాత, 2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతాయి. కనీసం 2032 ఒలింపిక్స్‌లోనైనా క్రికెట్ ఆటను వీక్షించగలరా అనేది అందరి ప్రశ్న.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఇప్పటి వరకు ఒలింపిక్స్ చరిత్రలో క్రికెట్(Cricket) ఆడింది ఒక్కసారి మాత్రమే. 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అయితే అప్పటి నుంచి క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కావడంలో విఫలమైంది. పారిస్ 1900 ఒలింపిక్స్‌(Olympics)కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా క్రీడా ఈవెంట్‌లో భాగంగా ఉండేది. ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ మాత్రమే 2 జట్లు పాల్గొన్నాయి.

వాస్తవానికి ఒలింపిక్స్‌లో ఏయే క్రీడలను చేర్చాలనే దానిపై గత ఏడాది ఫిబ్రవరిలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, 28 క్రీడలు ఎంపిక చేశారు. ఈ 28 ఆటలను 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత మరో 8 క్రీడలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. భవిష్యత్తులో ఇతర క్రీడలను చేర్చవచ్చు, అందులో క్రికెట్ కూడా ఒకటి కూడా ఉండచ్చేమో. గత ఏడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో(commonwealth games) దాదాపు 24 ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్‌ను చేర్చారు. దీనికి ముందు 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడేవారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలకు భారత్‌తో సహా ఎనిమిది జట్లు అర్హత సాధించాయి.

ఖర్చు, భద్రత, ఆరోగ్యవంతమైన అథ్లెట్లు, క్రీడలను నిమగ్నం చేయడం, గ్లోబల్ అప్పీల్, హోస్ట్ దేశ ఆసక్తి, లింగ సమానత్వం, క్లీన్ స్పోర్ట్స్‌కు మద్దతు ఇవ్వడంలాంటివి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది ఒలంపిక్ కమిటీ.

టాపిక్

తదుపరి వ్యాసం