తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Collections: ఆరు రోజుల్లోనే చిరు సినిమా బ్రేక్ ఈవెన్ - 2023లో టాలీవుడ్ ఫస్ట్ హిట్‌గా వాల్తేర్ వీర‌య్య‌

Waltair Veerayya Collections: ఆరు రోజుల్లోనే చిరు సినిమా బ్రేక్ ఈవెన్ - 2023లో టాలీవుడ్ ఫస్ట్ హిట్‌గా వాల్తేర్ వీర‌య్య‌

20 January 2023, 12:27 IST

  • Waltair Veerayya Collections: 2023లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా నిలిచింది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Waltair Veerayya Collections: 2023లో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నాడు. వాల్తేర్ వీర‌య్య సినిమా కేవ‌లం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమా 165 కోట్ల గ్రాస్‌ను, 95 కోట్ల షేర్‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

గురువారం రోజు ఈ సినిమా దాదాపు ఎనిమిది కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఫ‌స్ట్ వీక్‌లో ఒక్క నైజాం ఏరియాలోనే వాల్తేర్ వీర‌య్య‌కు 30 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సీడెడ్‌లో ప‌దిహేను కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 12 కోట్ల వ‌ర‌కు చిరంజీవి సినిమా క‌లెక్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఓవ‌ర్‌సీస్‌లో వారం రోజుల్లో ఈ సినిమా 11 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా తొలి వారంలోనే 165 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకొని వాల్తేర్ వీర‌య్య సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ క్రియేట్ చేసింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. గురువారం నాటి వ‌సూళ్ల‌తో వాల్తేర్ వీర‌య్య బ్రేక్ ఈవెన్‌లోకి ఎంట‌రైన‌ట్లు చెబుతున్నారు. శ‌ని, ఆదివారాల్లో వాల్తేర్ వీర‌య్య క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిరంజీవి సినిమాగా వాల్తేర్ వీర‌య్య నిలిచింది. అంతేకాకుండా 2023లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా వాల్తేర్ వీర‌య్య నిలిచింది. ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన వాల్తేర్ వీర‌య్య సినిమాలో శృతిహాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం