తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Happy Birthday Mahesh Babu: చిరంజీవి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు.. మహేష్‌కు విషెస్‌

Happy Birthday Mahesh Babu: చిరంజీవి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు.. మహేష్‌కు విషెస్‌

HT Telugu Desk HT Telugu

09 August 2022, 15:19 IST

    • Happy Birthday Mahesh Babu: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మంగళవారం (ఆగస్ట్‌ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకూ ప్రముఖులు అతనికి విషెస్‌ చెప్పారు.
చిరంజీవితో మహేష్ బాబు
చిరంజీవితో మహేష్ బాబు (Chiranjeevi Twitter)

చిరంజీవితో మహేష్ బాబు

మహేష్‌.. ఆ పేరులోనే ఉంది వైబ్రేషన్‌ అంటుంది ఓ సినిమాలో హీరోయిన్‌. నిజానికి హీరోయిన్ల పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ అభిమానులు అతన్ని చూస్తే ఇక ఆగలేరు. 47 ఏళ్ల వయసు వచ్చినా తరగని అందంతో ఇప్పటికీ మిల్కీ బాయ్‌లా ఉండే ప్రిన్స్‌కు లేడీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారంటే పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. సిల్వర్‌ స్క్రీన్‌పై అతడు ఓ నవ్వు నవ్వితే బయట లేడీ ఫ్యాన్స్‌ అలా పడిపోతారంటే మహేష్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ఈ హ్యాండ్సమ్‌ హీరో మంగళవారం (ఆగస్ట్‌ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ చెప్పారు. హ్యాపీ బర్త్‌డే మహేష్‌ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశాడు. మహేష్‌ అన్నా హ్యాపీ బర్త్‌ డే! ఎప్పటిలాగే నీకు మరిన్ని సంతోషాలు, విజయాలు దక్కాలని కోరుకుంటున్నా అని జూనియర్‌ ఎన్టీఆర్‌ విషెస్‌ చెప్పడం విశేషం.

నా డియర్‌ ఫ్రెండ్‌ మహేష్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ మాస్‌ మహారాజ రవితేజ ట్వీట్‌ చేశాడు. ఫరెవర్‌ ఛార్మింగ్‌ మహేష్‌కు హ్యాపీ హ్యాపీ బర్త్‌డే అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విష్‌ చేసింది. ఇక మరో స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా ట్వీట్‌ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మహేష్‌ సర్‌ అని రాసింది. రామ్‌ పోతినేని, సుధీర్‌ బాబు, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని, అడివి శేష్‌లాంటి వాళ్లు కూడా మహేష్‌కు ట్విటర్‌ ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పారు.

ఇక అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని బర్త్‌డేకు ఒక రోజు ముందు నుంచే ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్స్‌లో హ్యాపీ బర్త్‌డే మహేష్‌ ఉందంటే ఏ రేంజ్‌లో ట్వీట్లు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అతని 47వ బర్త్‌డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోకిరి స్పెషల్‌ షోలు కూడా వేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, ఇండియాతోపాటు ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 175 స్పెషల్‌ షోలు వేస్తుండటం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.