తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Role Length In Godfather: గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ లెంగ్త్ రివీల్ చేసిన చిరు

Salman Khan Role Length In Godfather: గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ లెంగ్త్ రివీల్ చేసిన చిరు

26 September 2022, 13:24 IST

google News
  • Salman Khan Character Length In Godfather: చిరంజీవి హీరోగా న‌టిస్తున్న గాడ్‌ఫాద‌ర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి క్యారెక్ట‌ర్ గురించి చిరంజీవి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ క్యారెక్ట‌ర్ లెంగ్త్‌ను వెల్ల‌డించారు.

చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్‌
చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్‌ (twitter)

చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్‌

Salman Khan Role Length In Godfather: చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టిస్తున్న గాడ్‌ఫాద‌ర్ సినిమా ద‌స‌రా సందర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్‌తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నెల 28న అనంత‌పూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. న‌య‌న‌తార‌(Nayanthara), స‌త్య‌దేవ్ (Satyadev) కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మ‌రో ముఖ్య పాత్ర‌లో బాలీవుడ్ అగ్ర న‌టుడు స‌ల్మాన్‌ఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. స‌ల్మాన్‌ఖాన్ తెలుగులో న‌టిస్తున్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. స‌ల్మాన్ క్యారెక్ట‌ర్ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి పలు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. గాడ్‌ఫాధ‌ర్‌లో స‌ల్మాన్‌ఖాన్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ ప‌ది నిమిషాలు ఉంటుంద‌ని చిరంజీవి పేర్కొన్నాడు. రాజుకు ద‌ళ‌ప‌తి లా గాడ్‌ఫాద‌ర్ కోసం ప్రాణాలు ఇచ్చే సోలోమేట్ క్యారెక్ట‌ర్‌లో అత‌డు క‌నిపిస్తాడ‌ని చిరంజీవి అన్నాడు.

ఈ పవర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసే ఇమేజ్ ఉన్న న‌టుడు కావాల‌నే స‌ల్మాన్‌ను తీసుకున్న‌ట్లు తెలిపాడు. తాను, రామ్‌చ‌ర‌ణ్ ఏది అడిగినా స‌ల్మాన్ కాద‌న‌డ‌ని, అంత‌టి అభిమానాన్ని త‌మ‌పై చూపుతుంటాడ‌ని అన్నాడు. రామ్ చ‌ర‌ణ్ వెళ్లి అడ‌గ్గానే స‌ల్మాన్ సినిమాను అంగీక‌రించాడ‌ని చిరంజీవి చెప్పాడు.

మ‌ల‌యాళ సినిమా చూడ‌కుండానే, క‌థ కూడా తెలియ‌కుండా గాడ్‌ఫాద‌ర్ సినిమాను స‌ల్మాన్ ఒప్పుకున్నాడ‌ని చిరంజీవి అన్నాడు. ముఖ్య‌మంత్రి కుటుంబానికి వ‌చ్చే ఆప‌ద‌ను ప‌రిష్క‌రించే గాడ్‌ఫాద‌ర్‌గా ఈ సినిమాలో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాకు మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

తదుపరి వ్యాసం