తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi On Godfather Vs The Ghost: గాడ్‌ఫాదర్‌ Vs ఘోస్ట్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Chiranjeevi on Godfather vs The Ghost: గాడ్‌ఫాదర్‌ vs ఘోస్ట్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

03 October 2022, 16:18 IST

google News
    • Chiranjeevi on Godfather vs The Ghost: గాడ్‌ఫాదర్‌ vs ఘోస్ట్‌ చర్చపై స్పందించాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు అంటే అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుండటంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.
ఒకే రోజు రిలీజ్ కాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు
ఒకే రోజు రిలీజ్ కాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు

ఒకే రోజు రిలీజ్ కాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు

Chiranjeevi on Godfather vs The Ghost: ఈ ఏడాది దసరా టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఇటు థియేటర్లలో అటు ఓటీటీల్లో పెద్ద సినిమాల జాతర ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. దసరా రోజే ఇద్దరు పెద్ద హీరోలైన చిరంజీవి, నాగార్జున సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. మెగాస్టార్‌ మూవీ గాడ్‌ఫాదర్‌, నాగార్జున మూవీ ది ఘోస్ట్‌ బాక్సాఫీస్‌ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఇలా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో వీటీ మధ్య బాక్సాఫీస్‌ దగ్గర పోటీ ఎలా ఉంటుందో అన్న చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. దీనిపై తాజాగా చిరంజీవి కూడా స్పందించాడు. మలయాళ మూవీ లూసిఫర్‌ రీమేక్‌ అయిన గాడ్‌ఫాదర్‌లో చిరంజీవితోపాటు సల్మాన్‌ఖాన్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నాడు. అటు ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో తొలిసాని నాగార్జున నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌ కూడా ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది.

ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ దగ్గర ఏ మూవీ పైచేయి సాధిస్తుందో అన్న చర్చ జరుగుతోంది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. తనకు నాగార్జునతో ఎలాంటి పోటీ లేదని, తమ ఇద్దరి సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవని అన్నాడు. "నాగర్జునతో నాకు పోటీ లేదు. మా ఇద్దరి సినిమాలు ప్రత్యేకమైనవే. అందులో మా టాలెంట్‌ను చూపించి మమ్మల్ని మేము నిరూపించుకోవాలని అనుకుంటున్నాం" అని న్యూస్‌ 18 ఇంటర్వ్యూలో చిరు అన్నాడు.

అటు నాగార్జున కూడా ఇప్పటికే ఈ గాడ్‌ఫాదర్‌ vs ది ఘోస్ట్‌ చర్చపై స్పందించాడు. అతడు కూడా ఇదే విధంగా స్పందించాడు. చిరు గాడ్‌ఫాదర్‌ కూడా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించాడు. "నా ప్రియమిత్రుడు చిరంజీవి గాడ్‌ఫాదర్‌ మూవీ కూడా ది ఘోస్ట్‌తోపాటు అక్టోబర్‌ 5నే రిలీజ్‌ కాబోతోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద హిట్‌ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని నాగార్జున అన్నాడు.

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ ఇద్దరు హీరోలు ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్‌ సాధించలేకపోయారు. చిరంజీవి సినిమా ఆచార్య టాలీవుడ్‌లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అటు నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని గత రెండు సినిమాలు వైల్డ్‌ డాగ్‌, బంగార్రాజు అంతంతమాత్రంగానే ఆడాయి. దీంతో ఈ ఇద్దరు పెద్ద హీరోలు ఇండస్ట్రీలో తిరిగి తమ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే ఈ రెండు సినిమాలు సక్సెస్‌ కావాల్సిన అవసరం ఉంది.

తదుపరి వ్యాసం