Nagabhaja Song Release: గాడ్‌ఫాదర్ నుంచి మరో పాట వచ్చేసింది.. బ్యాక్‌గ్రౌండ్ అదిరిపోయింది
27 September 2022, 17:42 IST
- Godfather New Song: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్. ఈ సినిమా నుంచి అదిరిపోయే పాట వచ్చేసింది. నజభజ జజరా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంది. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దుమ్మురేపాడు.
గాడ్ ఫాదర్ మూవీలో నజభజ సాంగ్
Najabhaja Song From Godfather: మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా విడుదలవుతుందంటేనే అభిమానులు హడావిడి మాములుగా ఉండదు. అలాంటిది ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ రోల్‌లో ఆయన నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తార్ మార్ సాంగ్, టీజర్, ట్రైలర్లు విడుదలై అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
నజభజ జజరా అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. మెగాస్టార్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఉండనున్నట్లు సాంగ్ వింటేనే తెలుస్తోంది. స్లో మోషన్‌లో చిరు వస్తుంటే రెండు కళ్లు చాలట్లేదు. అలాంటిది థియేటర్లలో ఆయనకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లలో ఈ పాట బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలే వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ విషయంలో స్పెషలిస్టుగా మారిన తమన్ అదిరిపోయేలా వాయించాడు. రొమాలు నిక్కపొడుచుకునే రీతిలో నేపథ్య సంగీతాన్ని అందించాడు.
ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర అద్భుతంగా ఆలపించారు. వీరి గాత్రానికి తమన్ సంగీతం తోడవ్వడంతో ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే థార్ మార్ అంటూ సాగే పాటలో చిరంజీవి, సల్మాన్ కలిసి దుమ్మురేపారు. మన మెగాస్టార్ తనదైన శైలిలో స్టెప్పులేయగా.. సల్మాన్ ఆయనకు శైలిలో చిరుతో కలిసి కాలు కదిపారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు.
గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.