తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Tv Premiere: టీవీలోకి వచ్చేస్తున్న చంద్రముఖి-2 మూవీ: టెలికాస్ట్ ఎప్పుడంటే!

Chandramukhi 2 TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న చంద్రముఖి-2 మూవీ: టెలికాస్ట్ ఎప్పుడంటే!

25 December 2023, 22:58 IST

    • Chandramukhi 2 TV Premiere: చంద్రముఖి-2 చిత్రం టెలివిజన్ ఛానెల్‍లో ప్రసారం అయ్యేందుకు వచ్చేస్తోంది. ఈ విషయంపై ప్రకటన వచ్చింది. వివరాలివే..
చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్
చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్

చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్

Chandramukhi 2 TV Premiere: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి-2 చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ హారర్ థ్రిల్లర్‌గా పి.వాసు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్‍గా ఇప్పుడు ఈ చంద్రముఖి-2 వచ్చింది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా హిట్ కాలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన చంద్రముఖి-2 చిత్రం.. ఇప్పుడు టెలివిజన్ (టీవీ) ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Krishnamma OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్ జెమినీ ఛానెల్‍లో డిసెంబర్ 31 తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ తేదీపై ప్రకటన కూడా వచ్చేసింది. మరోవైపు, చంద్రముఖి-2 తమిళ వెర్షన్ సన్ టీవీ ఛానెల్‍లో జనవరి 1 (2024) సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతుంది.

చంద్రముఖి 2 చిత్రం ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

చంద్రముఖి 2 చిత్రంలో కంగన, లారెన్స్ ప్రధాన పాత్రలు చేయగా.. వడివేలు, రాధిక శరత్‍కుమార్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, సృష్టి డంగే, సుభిక్ష కృష్ణన్, సురేశ్ చంద్ర, విఘ్నేష్ కీలకపాత్రలు పోషించారు. పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ అంచనాల మధ్య థియేటర్లలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అడుగుపెట్టిన చంద్రముఖి-2 తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. కేవలం సుమారు రూ.40కోట్ల కలెక్షన్‍లను మాత్రమే ఈ చిత్రం రాబట్టిందని లెక్కలు బయటికి వచ్చాయి.

చంద్రముఖి ఆత్మ తిరిగి రావడంతో వేటయ్యపాలెం ప్యాలెస్‍కు వచ్చే రాధికా శరత్‍కుమార్ కుటుంబంలో సమస్యలు ఎదురవడం, రాఘవ లారెన్స్ ఆ సమస్యను పరిష్కరించడం చుట్టూ చంద్రముఖి-2 చిత్రం కథ తిరుగుతుంది. చంద్రముఖి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది.. చివరికి పరిష్కారం దొరికిందా అన్నదే చంద్రముఖి 2 ప్రధాన కథగా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం