Chandramukhi 2 OTT Release: రేపే ఓటీటీలోకి ‘చంద్రముఖి 2’ సినిమా: స్ట్రీమింగ్ వివరాలివే-chandramukhi 2 ott release date know when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Ott Release: రేపే ఓటీటీలోకి ‘చంద్రముఖి 2’ సినిమా: స్ట్రీమింగ్ వివరాలివే

Chandramukhi 2 OTT Release: రేపే ఓటీటీలోకి ‘చంద్రముఖి 2’ సినిమా: స్ట్రీమింగ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 25, 2023 05:22 PM IST

Chandramukhi 2 OTT Release: చంద్రముఖి 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. రాఘవ లారెన్స్, కంగన రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

చంద్రముఖి 2 పోస్టర్
చంద్రముఖి 2 పోస్టర్

Chandramukhi 2 OTT Release: రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. సెప్టెంబర్ 28న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. హర్రర్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ కావటంతో అంచనాలు మరింత ఎక్కువగా ఏర్పడ్డాయి. అయితే, చంద్రముఖి 2 మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో నెల తిరగకుండానే ఓ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. చంద్రముఖి 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

చంద్రముఖి 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (అక్టోబర్ 26) స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 26 అర్ధరాత్రి 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ప్రకటించింది.

2005లో వచ్చి భారీ విజయం సాధించిన చంద్రముఖి సినిమాకు ఇప్పుడు 23ఏళ్ల తర్వాత సీక్వెల్‍గా చంద్రముఖి 2 తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. లక్ష్మీ మీనన్, వడివేలు, రాధిక శరత్ కుమార్, మహిమా నంబియార్, విఘ్నేష్, రవి మరియా ఈ చిత్రంలోక కీలకపాత్రలు చేశారు.

చంద్రముఖి 2లో కంగన, లారెన్స్ నటనకు ప్రశంసలు వచ్చినా.. మొత్తంగా సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఏ అంశంలోనూ ఈ సినిమా ఆకట్టుకోలేదని, ఔడేటెడ్ నరేషన్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్టే కలెక్షన్లు కూడా ఈ చిత్రానికి పేలవంగానే వచ్చాయి.

చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబంలో సమస్యలు సృష్టిస్తుంది. గుడిలో పూజ కోసం వేటయ్యపాలెంలోని ప్యాలెస్‍లో దిగే ఆ కుటుంబాన్ని చంద్రముఖి ఆత్మ తిప్పలు పెడుతుంది. ఆ కుటుంబానికే చెందిన మదన్ (రాఘవ) ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అసలు చంద్రముఖి ఎందుకు మళ్లీ తిరిగి వచ్చింది? ఈ సమస్యను మదన్ ఎలా పరిష్కరించారు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథగా ఉంది.

మరోవైపు, నయనతార, జయం రవి నటించిన ఇరైవన్ సినిమా కూడా అక్టోబర్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనుంది.

IPL_Entry_Point