Iraivan OTT Release Date: ఓటీటీలోకి నయనతార యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-iraivan ott release date nayanatara new movie set to stream on netflix platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Iraivan Ott Release Date: ఓటీటీలోకి నయనతార యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Iraivan OTT Release Date: ఓటీటీలోకి నయనతార యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 24, 2023 11:25 AM IST

Iraivan OTT Release Date: ఇరైవన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. వివరాలివే..

Iraivan OTT Release Date: ఓటీటీలోకి నయనతార యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Iraivan OTT Release Date: ఓటీటీలోకి నయనతార యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Iraivan OTT Release Date: లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ హీరో జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఇరైవన్ సినిమా తమిళంలో సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది. సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఐ.అహ్మద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఇరైవన్ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగులోనూ ‘గాడ్’ పేరుతో ఇరైవన్ అక్టోబర్ 13న రిలీజ్ అయింది. ఇక్కడ కూడా పెద్దగా ఆ చిత్రం ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు ఇరైవన్ సినిమా రెడీ అయింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ వివరాలు వెల్లడయ్యాయి.

ఇరైవన్ (గాడ్) సినిమా అక్టోబర్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇరైవన్ సినిమాలో జయంరవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించగా.. వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, నరైన్, ఆశిష్ విద్యార్థి, ఐశ్వర్య సురేశ్, చార్లీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జెరీశ్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదీ ‘ఇరైవన్’ కథ

చట్టంతో సంబంధం లేకుండా తప్పు చేసిన నేరస్థులను చంపేస్తుంటాడు పోలీసు అధికారి ఏసీపీ అర్జున్ (జయం రవి). అతడికి ఆండ్రూ (నరైన్) అనే ప్రాణ స్నేహితుడు ఉంటాడు. బ్రహ్మ (రాహుల్ బోస్) అనే ఓ సైకో కిల్లర్ యువతులను హత్య చేస్తుంటాడు. బ్రహ్మను అర్జున్ పట్టుకుంటాడు. అయితే, ఆ ప్రయత్నంలో ఆండ్రూ చనిపోతాడు. ఆ తర్వాత జైలు నుంచి తప్పించుకున్న బ్రహ్మ మళ్లీ హత్యలు చేస్తుంటాడు. దీంతో అర్జున్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆండ్రూ కుటుంబానికి అండగా ఉంటాడు. ఆండ్రూ చెల్లెలు (నయనతార)తో కలిసి కాఫీ షాప్ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? బ్రహ్మను మళ్లీ పట్టుకున్నారా? అన్ని హత్యలు చేస్తుందని బ్రహ్మనేనా? అనేదే ఇరైవన్ ప్రధాన కథాంశాలుగా ఉన్నాయి.

IPL_Entry_Point