తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Calling Sahasra Ott Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ సుడిగాలి సుధీర్ కాలింగ్ స‌హ‌స్ర

Calling Sahasra OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ సుడిగాలి సుధీర్ కాలింగ్ స‌హ‌స్ర

Hari Prasad S HT Telugu

01 January 2024, 10:54 IST

google News
    • Calling Sahasra OTT Streaming: సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన స‌రిగ్గా నెల రోజుల త‌ర్వాత సోమ‌వారం (జ‌న‌వ‌రి 1) ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.
సుడిగాలి సుధీర్ కాలింగ్ స‌హ‌స్ర
సుడిగాలి సుధీర్ కాలింగ్ స‌హ‌స్ర

సుడిగాలి సుధీర్ కాలింగ్ స‌హ‌స్ర

Calling Sahasra OTT Streaming: జ‌బ‌ర్ద‌స్త్‌తో పేరు సంపాదించి త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చిన క‌మెడియ‌న్‌ సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా సోమ‌వారం (జ‌న‌వ‌రి 1) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా వ‌చ్చింది.

కాలింగ్ స‌హ‌స్ర మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమాకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అయితే టీవీ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన సుడిగాలి సుధీర్ ఓటీటీలో మాత్రం మ్యాజిక్ చేస్తాడ‌ని భావిస్తున్నారు. అంత‌కుముందు గాలోడు సినిమాతో సుధీర్ ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

కాలింగ్ స‌హస్ర మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా న‌టించింది. షాడో మీడియా ప్రొడ‌క్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌లో విజేష్ తాయ‌ల్‌, చిరంజీవి పామిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను తెర‌కెక్కించారు. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమాలో అజ‌య్ శ్రీవాత్స‌వ అనే యువ‌కుడిగా సుడిగాలి సుధీర్ క‌నిపించాడు. ఓ సిమ్ ద్వారా అజ‌య్ లైఫ్‌లోకి స‌హ‌స్ర వ‌స్తుంది. అస‌లు ఆమె ఎవ‌రు? స‌హ‌స్ర గురించిన అన్వేష‌ణ‌లో అజ‌య్ తెలుసుకున్ననిజాలేమిట‌న్న‌ది, త‌న సోద‌రి మ‌ర‌ణానికి సంబంధించిన మిస్ట‌రీని అజ‌య్ ఎలా ఛేదించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

కాలింగ్ స‌హ‌స్ర మూవీ క‌థ‌లో పెద్ద‌గా కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, అదేరోజు యానిమ‌ల్ మూవీ రిలీజ్ కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. తొలి రోజు నుంచే నెగ‌టివ్ రివ్యూలు వ‌చ్చాయి. దీంతో సుధీర్‌కు నిరాశ తప్ప‌లేదు. బ్రేక్ ఈవెన్ అందుకోలేక కాలింగ్ స‌హ‌స్ర ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం