Ambati Rambabu vs Bro: గాలిమాటలను పట్టించుకోను - అంబటి రాంబాబు వార్నింగ్‌పై బ్రో ప్రొడ్యూసర్ రియాక్షన్
03 August 2023, 8:45 IST
Ambati Rambabu vs Bro: అంబటి రాంబాబువి అన్నీ గాలిమాటలేనని బ్రో మూవీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ అన్నాడు. మినిస్టర్ మాటల్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నాడు.
అంబటి రాంబాబు వర్సెస్ బ్రో
Ambati Rambabu vs Bro: బ్రో మూవీతో పాటు సినీ పరిశ్రమపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను గాలి మాటలుగా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ పేర్కొన్నాడు. బ్రో మూవీలో పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్ర అంబటిరాంబాబును పోలి ఉందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై అంబటి స్పందించారు.
తనను కించపరచాలనే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ...శ్యాంబాబు క్యారెక్టర్‌ను పెట్టాడని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇచ్చిన డబ్బుతోనే విశ్వప్రసాద్ బ్రో సినిమా తీశాడంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తే దర్శకరచయితలకు తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని త్రివిక్రమ్ వార్నింగ్ ఇచ్చాడు అంబటి. అతడి కామెంట్స్‌పై బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యాడు.
అంబటి రాంబాబువి ఉట్టి గాలిమాటలేనని తెలిపాడు. ఆయన మాటల్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నాడు. ఒకవేళ సీరియస్‌గా తీసుకుంటే లీగల్‌గానే అంబటిని ఎదుర్కొనేవాడినని విశ్వప్రసాద్ అన్నాడు. తన మీద ఎక్కడ, ఎవరికి కంప్లైంట్స్ చేసుకున్నా ఇబ్బందిలేదని తన సొంత డబ్బుతోనే ఈ సినిమా తీశానని విశ్వప్రసాద్ పేర్కొన్నాడు. ఈ సినిమా మేకింగ్‌లో తాను ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపాడు.
రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్‌పై అంబలి బురద జల్లుతున్నారని విశ్వప్రసాద్ చెప్పాడు. అంబటిరాంబాబు కామెంట్స్ వల్ల తమ సినిమాకు పబ్లిసిటీ పెరుగుతోందని, అందువల్లే అతడి కామెంట్స్‌ను తాను నెగెటివ్‌గా తీసుకోవడం లేదని విశ్వప్రసాద్ చెప్పాడు.
అంబటిని ఉద్దేశించి శ్యాంబాబు క్యారెక్టర్‌ను తాము సినిమాలో పెట్టలేదని నిర్మాత విశ్వప్రసాద్ అన్నాడు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ జూలై 28న థియేటర్లలో విడుదలైంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు.