తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmanandam Kick Ott Streaming: మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లే - బ్ర‌హ్మానందం త‌మిళ మూవీపై నెటిజ‌న్ల ట్రోల్స్‌

Brahmanandam Kick OTT Streaming: మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లే - బ్ర‌హ్మానందం త‌మిళ మూవీపై నెటిజ‌న్ల ట్రోల్స్‌

29 September 2023, 13:14 IST

google News
  • Brahmanandam Kick OTT Streaming: బ్ర‌హ్మానందం త‌మిళంలోకి రీఎంట్రీ ఇస్తూ న‌టించిన కిక్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

బ్ర‌హ్మానందం
బ్ర‌హ్మానందం

బ్ర‌హ్మానందం

Brahmanandam Kick OTT Streaming: లాంగ్‌గ్యాప్ త‌ర్వాత బ్ర‌హ్మానందం త‌మిళంలోకి రీ ఎంట్రీ ఇస్తూ న‌టించిన కిక్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంతానం హీరోగా న‌టించిన ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత బ్ర‌హ్మానందం కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో సైంటిస్ట్ వాలి అనేపాత్ర‌లో క‌నిపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈసినిమాలో తాన్య హోప్‌, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా న‌టించారు.

సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఓటీటీలోనూ సేమ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. వ‌ర‌స్ట్ మూవీ అంటూ నెటిజ‌న్లు కిక్‌ను ఉద్దేశించి ఓటీటీ ఆడియెన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. రెండున్న‌ర గంట‌లు టైమ్ వేస్ట్ చేసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటూ చెబుతోన్నారు. కంప్లీట్ డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పోర్న్ మూవీలా ఉందంటూ నెటిజ‌న్లు దారుణంగా ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు.

భ‌విష్య‌త్తులో కామెడీ పేరుతో ఇలాంటి సినిమాలు చేయ‌ద్ద‌ని హీరో సంతానాన్ని అభిమానులు కోరుతున్నారు. కిక్ సినిమాకు ప్ర‌శాంత్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌న్న‌డ మూవీ జూమ్ ఆధారంగా కిక్ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్‌ను కూడా ఓటీటీలో రిలీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

గ‌త కొన్నాళ్లుగా తెలుగులో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు బ్ర‌హ్మానందం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమాలో అతిథి పాత్ర‌లో బ్ర‌హ్మానందం క‌నిపించాడు. మ‌రోవైపు కోలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్‌గా పేరుతెచ్చుకున్న సంతానం కొన్నాళ్లుగా హీరో పాత్ర‌ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నాడు.

తదుపరి వ్యాసం