Brahmamudi August 31st Episode: కావ్యకు సీతారామయ్య గిఫ్ట్ - స్వప్న సేఫ్ - కళ్యాణ్‌కు అనామిక సర్‌ప్రైజ్
31 August 2023, 8:31 IST
Brahmamudi Today Episode: రెగ్యులర్ చెకప్ కోసం స్వప్నను తీసుకొని హాస్పిటల్‌కు వస్తారు రాహుల్, రుద్రాణి. తన ప్రెగ్నెన్సీ నాటకం ఎక్కడ వారికి తెలిసిపోతుందో అని స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi Today Episode: దుగ్గిరాల కుటుంబసభ్యులు ఇంటి కోడలికి ఇస్తోన్న స్వేచ్ఛను స్త్రీ సంక్షేమ సభ్యులు ప్రశంసిస్తారు. భార్యను ప్రోత్సహిస్తున్న రాజ్‌ను మెచ్చుకుంటారు. రాజ్, కావ్యకు కలిపి సన్మానం చేయాలని అనుకుంటున్నారు. కావ్యపై సంక్షేమ సంఘం వారు కురిపిస్తోన్న ప్రశంసలు చూసి అపర్ణ తట్టుకోలేకపోతుంది. తల్లికి భయపడి రాజ్ కూడా ఏం మాట్లాడడు. సన్మానం సమయంలో రాజ్ అసహనంగా కనిపిస్తాడు. కావ్యకు దూరంగా నిలబడుతాడు.
వారికి అనుమానం రాకూడదని కావ్య చొరవ తీసుకొని రాజ్ చేయిపట్టుకుంటుంది. సంక్షేమ సంఘం వారు వెళ్లిపోయిన తర్వాత తమ ఇంటి పేరు నిలబెట్టిన కావ్యకు ఏ బహుమానం కావాలో కోరుకోమని సీతారామయ్య అడుగుతాడు. ఇంట్లో అందరూ తనను వెలివేసినట్లు చూస్తున్నారని, ఈరోజు నుంచి నాతో అందరూ మాట్లాడితే చాలని బదులిస్తుంది కావ్య. అంతకుమించి నాకు కావాల్సిన బహుమానం ఏది అక్కరలేదని, తనను ఈ కుటుంబంలో ఓ సభ్యురాలిగా గుర్తిస్తే చాలు అని కావ్య అంటుంది.
అనామిక అబద్ధం...
అజ్ఞాత ప్రేమికురాలు అనామిక ఆచూకీ కనిపెట్టేందుకు కళ్యాణ్ తెగ ట్రై చేస్తుంటాడు. తనకు పెళ్లైందని అనామిక అబద్ధం చెప్పడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయపడతాడు. తాను అబద్ధం చెప్పానని కళ్యాణ్‌ను ఆటపట్టిస్తుంది అనామిక. కళ్యాణ్ ను కలిసిన అనామిక అతడికి తన కారులోనే లిఫ్ట్ ఇస్తుంది. కానీ కళ్యాణ్ ఆమెను గుర్తించలేకపోతాడు. ఆ విషయాన్ని గుర్తుచేసి కళ్యాణ్‌ను ఉడికిస్తుంది.
స్వప్న సేఫ్...
రెగ్యులర్ చెకప్ కోసం స్వప్న వెంట రాహుల్, రుద్రాణి హాస్పిటల్‌కు వస్తారు. తన ప్రెగ్నెన్సీ నాటకం ఎక్కడ బయటపడుతుందో అని స్వప్న కంగారు పడుతుంటుంది. ఆ గండం నుంచి బయటపడేందుకు స్వప్న ఎన్ని ప్లాన్‌లు వేసిన రివర్స్ అవుతాయి. డాక్టర్ రావడం ఆలస్యం కావడంతో నా కోసం మీరు ఇలా వెయిట్ చేయడం నచ్చడం లేదని డైలాగ్స్ కొట్టి హాస్పిటల్ నుంచి వెళ్లిపోవడానికి కష్టపడి రుద్రాణిని ఒప్పిస్తుంది స్వప్న.
హాస్పిటల్ నుంచి ముగ్గురు బయలుదేరబోతుండగా డాక్టర్ వచ్చాడని అసిస్టెంట్ వచ్చి చెబుతాడు. వెళ్లిపోతున్నామని డాక్టర్‌కు చెప్పమని అసిస్టెంట్‌పై సీరియస్ అవుతుంది స్వప్న. కానీ టెస్ట్‌లు పూర్తిచేసుకొనే వెళ్దామని రుద్రాణి అంటుంది. చెప్పడమే కాకుండా డాక్టర్ దగ్గరకు స్వప్నను తీసుకెళుతుంది. కానీ లోపల తన ప్రెగ్నెన్సీ నాటకం తెలిసిన డాక్టర్ ఉండటంతో స్వప్న రిలీఫ్‌గా ఫీలవుతుంది.
రుద్రాణి చూడకుండా తన ప్రెగ్నెన్సీ గురించి ఆమెకు చెప్పొద్దని డాక్టర్‌ను రిక్వెస్ట్ చేస్తుంది స్వప్న. ఈ ఒక్కసారికి నన్ను కాపాడమనిమని డాక్టర్‌ను వేడుకుంటుంది. స్వప్న బలవంతంతోడాక్టర్ తన అబద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. స్వప్నకు అంత బాగానే ఉందని అంటుంది. డాక్టర్ మాటలను రాహుల్, రుద్రాణి నమ్ముతారు.
కళ్యాణ్ కవితలు బుక్‌గా...
అజ్ఞాత ప్రేమికురాలు అనామిక తనకు పంపించిన గిఫ్ట్ కోసం కళ్యాణ్ ఇళ్లంతా వెతుకుతాడు. ఆ గిఫ్ట్‌ను కావ్య వెతికి పెట్టి ఇస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్‌లో కళ్యాణ్ రాసిన కవితల్ని బుక్‌గా ప్రింట్ చేసి అతడికి గిఫ్ట్ పంపిస్తుంది అనామిక. ఆ బుక్ చూసి కళ్యాణ్ తో పాటు మిగిలిన దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ సంతోషపడతారు. కళ్యాణ్‌లోని ప్రతిభను మొదట కావ్యనే గుర్తించిందని సీతారామయ్య అంటాడు.
నీకు తెలియకుండా నీ కవితల్ని బుక్‌గా ప్రింట్ చేయించింది ఎవరని అపర్ణ అనుమానం వ్యక్తం చేస్తుంది.
అతడి అజ్ఞాత పాఠకురాలని కావ్య అనగానే కళ్యాణ్ సిగ్గుపడతాడు. అనామిక తన అడ్రెస్‌ను ఓ ఫజిల్ లా పార్సిల్‌పై రాస్తుంది . ఆమె ఏం రాసిందో ఎవరూ కనుక్కోలేకపోతుంది. చివరకు కావ్య ఆ ఫజిల్‌ను రివీల్ చేస్తుంది. రెయిన్‌బో కేఫ్‌లో అనామిక టీ పార్టీ ఇస్తానని అందులో రాసిందని చెబుతుంది. ఆ ఫజిల్‌ను డీకోడ్ చేసిన కావ్యను ఇందిరాదేవి మెచ్చుకుంటుంది. నీ కోడలు చాలా టాలెంటెడ్ అని, కానీ ఆమె ప్రతిభను కొందరు గుర్తించడం లేదని అపర్ణపై సెటైర్ వేస్తుంది.
వ్రతం నువు చెయ్...
కావ్య కిచెన్‌లో ఉండగా ఆమెకు అపర్ణ ఎదురుపడుతుంది. ఈ ఇళ్లు నీకు అశ్రయం ఇచ్చింది. ఇంటి పెద్దలు నిన్ను మనిషిలా ఆదరిస్తున్నారు. కానీ నువ్వు ఇంట్లో తిరగడం నేను సహించలేకపోతున్నానని కావ్యతో అంటుంది అపర్ణ.
మీ అబ్బాయి మీ మనసు మార్చవచ్చేమో అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యకు ఎదురుపడిన రాజ్...వ్రతం నువ్వు చేయ్ ఫలితం నేను ఇస్తానని అంటాడు. ఏం చేస్తారని రాజ్‌ను అడుగుతుంది కావ్య. వెయిట్ అండ్ సీ అని సమాధానం చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.