తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 24th Episode: బ్రహ్మముడి- పనిమనిషి ముందు రాజ్ నవ్వులపాలు- కావ్యకు భర్త ఛాలెంజ్- కల్యాణ్‌కు అవమానం

Brahmamudi October 24th Episode: బ్రహ్మముడి- పనిమనిషి ముందు రాజ్ నవ్వులపాలు- కావ్యకు భర్త ఛాలెంజ్- కల్యాణ్‌కు అవమానం

Sanjiv Kumar HT Telugu

24 October 2024, 10:55 IST

google News
  • Brahmamudi Serial October 24th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో ఇంట్లో గల్ల లుంగీ కట్టుకుని గెటప్ మారుస్తాడు రాజ్. ఇంట్లో ఖాళీగా ఉంటుంటే అపర్ణ, ఇందిరాదేవి పరువు తీస్తారు. అది చూసి ఏం చేయలేక ఉండిపోతాడు రాజ్. మరోవైపు కంప్యూటర్ పాస్ వర్డ్ కనిపెట్టమని కావ్యకు ఛాలెంజ్ విసురుతాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 24 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 24 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 24 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అనామిక మనిషిని సెక్యూరిటీ గార్డ్‌గా ఇచ్చి పనిష్‌మెంట్ ఇస్తుంది. ఇంకోసారి అన్నం పెట్టిన చేయికి ఇలాంటివి చేయరని, తప్పు చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తు ఉంటుందని కావ్య అంటుంది. సెక్యూరిటీ గార్డ్ అతన్ని తీసుకుని వెళ్తుంటే వద్దని అతను బతిమిలాడుకుంటాడు.

రాజ్ సరే గుర్తుకు వచ్చారు

ఇలా ఎవరైనా కంపెనీలో ఫ్రాడ్ చేయాలని చూస్తే సెక్యురిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉండవు కాబట్టి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పాల్సి ఉంటుంది అని అందరికీ వార్నింగ్ ఇస్తుంది కావ్య. దాంతో శ్రుతి షాక్ అయి అలా చూస్తుంటే ఏంటీ అలా చూస్తున్నావని కావ్య అడుగుతుంది. రాజ్ సర్‌కు మీకు పెళ్లయి ఆరు నెలలు అవుతుందా. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని అంటారు కదా. మీరిచ్చిన పనిష్‌మెంట్ చూస్తే నాకు రాజ్ సరే గుర్తుకు వచ్చారు అని శ్రుతి అంటుంది.

మాకు పెళ్లి అయి మూడు ఆరు నెలలు అయిందని కావ్య అంటుంది. అయితే మీరు రాజ్ సర్‌కు మూడు రెట్లు అన్నమాట అని శ్రుతి అంటుంది. సెక్యూరిటీ అని కావ్య పిలవగానే వద్దు మేడమ్. ఇంకెప్పుడు ఓవరాక్షన్ చేయను అని వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు రాజ్ ఆఫీస్‌కు వెళ్లడని అన్నాడని మాట్లాడుకుంటారు ఇందిరాదేవి, అపర్ణ. ఏంటీ అత్తా కోడళ్లు ఏదో గుసగుసలు పెడుతున్నారు అని రుద్రాణి అంటుంది. ఏం లేదు మీ ఆయన్ను కనిపెట్టడానికి సెర్చింగ్ టీమ్ బయలుదేరింది. కనిపెట్టి నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిస్తాం అని అపర్ణ అంటుంది.

అప్పుడు ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అని ఇందిరాదేవి అంటుంది. దాంతో నేను చచ్చినా వెళ్లను అని రుద్రాణి సైలెంట్‌గా కూర్చుంటుంది. ఇంతలో రాజ్ లుంగీ, టీ షర్ట్ వేసుకుని మరి మాస్‌గా వస్తాడు రాజ్. ఏంట్రా ఈ అవతారం అని రుద్రాణి అంటే.. ఇది నా ఫ్రీడమ్‌కు ప్రతీక. ఇక ఎవరు ముందు పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ చూసుకోనవసరం లేదు అని శాంతను పిలుస్తాడు రాజ్. ఓ లిస్ట్ ఇచ్చి ఆ ఐటమ్స్ చేయమని చెబుతాడు.

అల్లకల్లోలం అయినట్లుంది

వారం రోజులకు సరిపడా చెప్పారు అని శాంత వెళ్లిపోతుంది. ఇందాక ఈ అత్తాకోడళ్లు కావ్యను సీఈఓను చేసి ఘనకార్యం సాధించినట్లు హైఫై ఇచ్చుకుంటున్నారు. కానీ, నువ్ మాత్రం తలొంచకుండా నిరసన వ్యక్తం చేస్తున్నావు అని రుద్రాణి అంటుంది. తర్వాత రాజ్ రుద్రాణి సపోర్టింగ్‌గా మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్‌కు కావ్య కాల్ చేస్తుంది. దాంతో నేను లేకుంటే ఆఫీస్‌కు రాకపోతే అల్లకల్లోలం అయినట్లు ఉంది. అందుకే నన్ను ఆఫీస్‌కు రమ్మని బతిమాలుడుకుంటుంది అనుకుంటా అని రాజ్ అంటాడు.

స్పీకర్ ఆన్ చేసి రాజ్ మాట్లాడుతాడు. ఇంట్లో లుంగీ కట్టుకుని బిందాస్‌గా కూర్చున్నారా. నా మీద అలిగి ఇంట్లో కూర్చుంటే పనులు ఆగిపోతాయా. అంతకంటే స్పీడ్‌గా జరుగుతున్నాయి. పాస్ వర్డ్ చెప్పండి అని కావ్య అంటే.. చెప్పను అని రాజ్ అంటాడు. తీసివేయబడ్డ ఎంప్లాయ్ అన్ని హ్యాండోవర్ చేయాలి అని కావ్య అంటుంది. నేను చెప్పా. కారణాలు కూడా చెప్పను. నీకు దమ్ముంటే నువ్వే కనుక్కో అని కాల్ కట్ చేస్తాడు రాజ్.

పాస్ వర్డ్ చెప్పొచ్చుగా అని అపర్ణ అంటే.. సీఈఓ చేశారుగా తెలుసుకోని అని రాజ్ అంటాడు. మంచిపని చేశావ్‌ రాజ్ అని రుద్రాణి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు టెక్నికల్ టీమ్‌ను పిలిచి యాక్సెస్ చేయించమంటారా అని శ్రుతి అంటే.. అవసరం లేదు. కంత్రీ కళావతి అని పెట్టి ఉంటారు. నేనే కనుక్కుంటా అని కనిపెడుతుంది కావ్య. ఐ హేట్ కళావతి ఉందని, పాస్ వర్డ్ మార్చినట్లుగా శ్రుతికి చెబుతుంది కావ్య. మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్‌ ఇంటికి కల్యాణ్ వెళ్తాడు.

కల్యాణ్‌కు అవమానం

సెక్యూరిటీ గార్డ్ పంపించకుండా రైటర్ తెలుసని కల్యాణ్ వాదిస్తుంటాడు. ఇంతలో లక్ష్మీ కాంత్ వస్తే కల్యాణ్ పిలిచి ఆటో ఎక్కింది, తాను లిరిక్స్ రాసింది చెప్పి గుర్తు చేస్తాడు. దాంతో కల్యాణ్‌ను రమ్మన్న లక్ష్మీకాంత్ ఫైర్ అవుతాడు. ఇలాగే అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నావా అని అంటాడు. దానికి లేదని, అందరూ మీరు రాశారని చెబితే సంతోషపడ్డానే చెప్పాను తప్పా నేను రాసినట్లు చెప్పలేదని అని కల్యాణ్ అంటాడు.

నాకు ఫేవర్ చేసినట్లు చెబుతున్నావ్. శంఖంలో నీళ్లు పోస్తే తీర్థం అయినట్లు నా దగ్గర చేరితేనే నీ పదాలకు విలువ అని లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ అంటాడు. దాంతో అర్థమైంది సార్ మీ దగ్గర అసిస్టెంట్‌గా పనికిరానని అవమానంగా ఫీల్ అయి వెళ్లిపోతాడు కల్యాణ్. మరోవైపు అపర్ణ ఇంట్లో వంట చేస్తుంది. ఏంటీ వంటలు చేస్తున్నారా అని రాజ్ వచ్చి అంటే.. లేదు పంటలు వేస్తున్నామని అపర్ణ అంటుంది. మరి కోతలు ఎప్పుడో అని రాజ్ అడిగితే.. దానిసంగతి తెలియదు కానీ వాతలు పెడతానని అపర్ణ అంటుంది.

దాంతో శాంత నవ్వుతుంది. ఏంటీ అలా అంటున్నావ్ అని రాజ్ అంటే.. నీ పెళ్లాం చేసి పెడితే కమ్మటి భోజనం చేసేదాన్ని ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది అని అపర్ణ అంటుంది. ఈ కూరలో ఉప్పులేదేంటీ.. ఈ చారేంటీ నీళ్లలా ఉందని రాజ్ అంటే.. అమ్మగారు అబ్బాయి గారు చాలా ఖాళీగా ఉన్నారు అని శాంత అంటుంది. నీకు బాగా తెలివి ఉందే.. అలిగి ఆఫీస్‌కు వెళ్లట్లేదు. ఇకనుంచి కంపెనీని నా బంగారు కోడలే చూసుకుంటుంది. ఇక నుంచి వీడు కూరలకు వంకలు పెట్టుకుంటూ ఉంటాడు అని అపర్ణ అంటుంది.

ఘోరంగా పరువు తీయాల

దాంతో శాంత గట్టిగా నవ్వేస్తుంది. వెళ్లి కారులు లెక్కపెట్టుకుంటూ ఉండు. కోతలు కాగానే వచ్చి తినిపెడుదువు అని అపర్ణ అంటుంది. తర్వాత కావాలనే ఫోన్‌లో ఇందిరాదేవి నా మనవడు పనిపాట లేకుండా ఉన్నాడు. కంపెనీకి వెళ్లట్లేదు. మనవరాలిని తీసుకెళ్లడానికి ఎవరు లేరా. నా మనవడిని పంపిస్తాను. పనిపాట ఏం లేదులే అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ తద్దినాన్ని నా నెత్తిమీద పెడితే ఇష్టం లేక కంపెనీకి వెళ్లకుంటే ఇంత ఘోరంగా నా పరువు తీయాలా. అమ్మ కూడా ఇలాగే శాంత ముందు నా పరువు తీసింది అని రాజ్ అంటాడు.

నీకు గద్గ తిక్కన్న కథ తెలుసా అని ఓ కథ చెబుతుంది ఇందిరాదేవి అంటుంది. యుద్ధం నుండి పారిపోయి వచ్చిన తిక్కనతో తన భార్య పసుపు ఇచ్చి ఇలా వచ్చినవారు అమ్మాయిలతో సమానం. అందుకే పసుపు రాసుకోండి. నేటి నుంచి ఇంట్లో ముగ్గురం అమ్మాయిలం అని చెప్పింది. తల్లి కూడా విరిగిపోయిన పాలు తాగమని చెప్పింది. పిరికివాడిలా రావడంతో పశువుల మనసు విరిగిపోయింది. అందుకే విరిగిపోయిన పాలు ఇచ్చాయని ఇందిరాదేవి చెబుతుంది.

దాంతో పౌరుషంతో గద్గ తిక్కన యుద్ధానికి వెళ్లి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. దీనివల్ల నీకు అర్థమైంది ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది. పౌరుషానికి పోతే వీరమరణం పొందుతారు అని రాజ్ అంటే.. నీకు ఎంత బుద్ధి చెప్పితే ఏంట్రా. నీ బుద్ధి వక్రంగా ఆలోచిస్తుందని ఇందిరాదేవి అంటుంది. దాంతో మళ్లీ శాంత నవ్వుతుంది. రాజ్‌ను అన్న ప్రతిసారి శాంత నవ్వడంతో రాజ్ పిలిచి కోప్పడతాడు. వెళ్లి ఆవాలు పట్టుకురమ్మంటాడు.

తిరిగి పంచ్ ఇచ్చిన శాంత

దాంతో శాంత ఆవాలు తీసుకొస్తుంది. అరకేజీకి ఎన్ని ఆవాలు వస్తాయో లెక్కపెట్టు అని శాంతకు పనిష్‌మెంట్ ఇస్తాడు. లేకపోతే ప్రతిదానికి నవ్వుతుంది అని రాజ్ అనుకుంటాడు. ఇదేం శాడిజంరా అని ఇందిరాదేవి అంటే.. మీ నుంచే నేర్చుకున్నాను అని రాజ్ అంటాడు. అబ్బాయి గారు ఆఫీస్‌కు వెళ్లేవరకు నేను పని మానేస్తానని అపర్ణకు రాజ్ చేసింది చెబుతుంది శాంత. దాంతో నేను చెప్పింది చేయమని చెప్పు అని అపర్ణ అంటుంది.

రాజ్ దగ్గరికి వెళ్లి ఆవాలు లెక్కపెట్టానని చెప్పి అవి 5 లక్షల 4 వేల 3 వందల 21 అని శాంత అంటుంది. అబ్బ ఛ.. నోటికి వచ్చింది చెబితే నమ్మేస్తానా అని రాజ్ అంటే.. అయితే మీరే లెక్కపెట్టుకోండి. సరిగ్గా ఉంటాయని ఆవాలు ఇచ్చి వెళ్లిపోతుంది శాంత. దాంతో ఇందిరాదేవి నవ్వుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం