తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 10th Episode: కావ్యను అరిష్టం అన్న ధాన్యలక్ష్మీ.. అప్పుకు యాక్సిడెంట్.. ఇందిరాదేవి ఆర్డర్

Brahmamudi January 10th Episode: కావ్యను అరిష్టం అన్న ధాన్యలక్ష్మీ.. అప్పుకు యాక్సిడెంట్.. ఇందిరాదేవి ఆర్డర్

Sanjiv Kumar HT Telugu

10 January 2024, 7:33 IST

google News
  • Brahmamudi Serial January 10th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్‌‌లో ఇంట్లో పూజకు కావ్య సిద్ధం చేయిస్తుంటే రుద్రాణి వచ్చి దీపపు కుందీని కిందపడేస్తుంది. దాంతో కావ్య కావాలనే చేసిందని ధాన్యలక్ష్మీ అరిష్టం అంటూ మాట్లాడుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్‌‌

బ్రహ్మముడి సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పు పెళ్లి కోసం సంబంధాలు చూస్తారు కృష్ణమూర్తి, కనకం. ఒక అబ్బాయి ఫొటో చూపించి సొంత కంపెనీ పెట్టుకోవడం కోసం చూస్తున్నాడు. అమ్మనాన్నను కూడా ఊరిలో ఉంచాడు. అత్త మామల పోరు ఉండదు అని సంబధాలు చూపించే వ్యక్తి అంటాడు. దాంతో అమ్మ నాన్నను దూరం పెట్టాడంటున్నారు. మంచివాడేనా అని కనకం అంటుంది.

మంచివాడు అయితే చాలు

ఈ మాట మీరు అంటున్నారా. ఇంతకుముందు ఆస్తిపాస్తులు ఉంటే చాలు.. దయ, కరుణ, కనికరం వంటివి ఏమొద్దు అన్నారు. ఇప్పుడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చారు అని అతను అంటాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే తెలుసు కదా. మా కనకం ఆ స్టేజ్ కూడా దాటిపోయిందని పెద్దమ్మ అంటుంది. మా అప్పుకు మంచి వాడు అయితే చాలు అని కనకం అంటుంది. దాంతో ఒక ఫొటో చూపించి.. ఈ అబ్బాయికి కట్నం కూడా వద్దని చెబుతాడు. దాంతో బాగున్నాడు అని అనుకుంటారు.

ఇంతలో అప్పు వచ్చి ఏం జరుగుంతుందని అడుగుతుంది. దాంతో అంతా సైలెంట్‌గా ఉంటారు. ఏంటీ అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఎవరితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అప్పు దగ్గరికి వెళ్లి ఫొటో చూపిస్తూ వివరాలు చెబుతాడు. కట్ చేస్తే అతని వెంట రాడ్ పట్టుకుని అప్పు వెంటపడుతుంది. అమ్మాయికి సంబంధాలు చూడమన్నారు కానీ, పిచ్చి ఉందని చెప్పలేదంటూ అతను పరుగెత్తుతాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అప్పును పెళ్లి చేసుకోవా, ఇలాగే ఉంటావా అని అడుగుతుంది కనకం.

నీ పని అయిపోయినట్లే

అవును, ఇలాగే ఉంటాను. మీకు ఇబ్బంది అయితే చెప్పండి ఇంకో దారి చూసుకుంటాను అని అప్పు వెళ్లిపోతుంది. దాంతో ఆగమని కనకం అంటే.. ఇప్పుడేం వెళ్లట్లేదు.. జాబ్ కోసం వెళ్తున్నా అని అప్పు అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో సత్యనారాయణ పూజకు కావ్య అన్ని సిద్ధం చేస్తుంటుంది. అక్కడికి వచ్చిన రుద్రాణి ఇవాళ నీ పని అయిపోయినట్లే అని దీపపు కుందెను కింద పడేస్తుంది. దాంట్లోని నూనే రుద్రాణి చీరపై పడుతుంది.

ఎవరితో పెట్టుకున్న సరే. దేవుడితో పెట్టుకోవద్దు అని మనసులో అనుకున్న రుద్రాణి ఏంటీ కావ్య ఇలా చేశావ్ అని అంటుంది. దాంతో అప్పుడే వచ్చి ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. దీపపు కుందె కింద పడిందంటే ఎంత అరిష్టం. నీకెందుకు ఇవన్ని. నువ్ కాలు పెడితే అరిష్టం అంటూ నానా మాటలు అంటుంది. నా కొడుకు కోడలు పూజ చేస్తుంటే నీకు ఇష్టం లేదు. వాళ్లు సంతోషంగా ఉండక్కర్లేదు కదా. అందుకే ఇలా చేశావని ఫైర్ అవుతుంది.

గ్లామర్‌గా పూజ

మా అత్తయ్యతో చేయించండి పూజ. ఆమెంత ముత్తైదువు ఈ ప్రపంచంలోనే లేదు. స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని, ఆ మేకప్‌తో గ్లామర్‌గా పూజ చేస్తుంది. ఆమె ఐరన్ హ్యాండ్‌తో పూజా చేస్తే అంతా బాగుంటుందని స్వప్న కౌంటర్స్ వేస్తుంది. దాంతో జస్ట్ షటప్ అని రుద్రాణి అంటుంది.

ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండొచ్చు కదా. పెద్ద ఆరిందలా అన్నింటిల్లో ఎందుకు దూరుతావ్ అని అపర్ణ అంటుంది. ఆపండి. మీరంతా ఇప్పుడు వచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగితే అంతా కావ్యను అంటున్నారు. ఇప్పటిదాకా రెడీ అయి ఇప్పుడు వచ్చి అంటున్నారేంటీ అని సుభాష్ అంటాడు. చిన్న తప్పుకు ఇంతమంది ముందు వదినను అవమానించడం అవసరమా అమ్మ అని కల్యాణ్ అంటాడు. అవసరమేరా.. లేకుంటే మీ అమ్మ కడుపు మంట ఎలా చల్లారుద్ది అని ఇందిరాదేవి అంటుంది.

మూఢనమ్మకాలు లేవు

కావ్య గురించి మీకు తెలియట్లేదు అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఒక చిన్నతప్పు జరిగితే ఆ దేవుడి కటాక్షం ఉండదని ఎవరు చెప్పారు. మీకు నచ్చకుంటే సూటిగా చెప్పండి. అంతేకానీ, అరిష్టం అని మాట్లకండి. మీకు నగలపై ఉన్న శ్రద్ద పూజపై ఎక్కడ ఉంది. నాకు ఇన్నేళ్లు వచ్చాయి. నాకు లేవు మూఢనమ్మకాలు. మీకు ఎక్కడివి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పూజ చేస్తే చాలు. పూజలో రాహుల్ స్వప్న, రాజ్ కావ్య కూడా కూర్చుంటారు అని ఇందిరాదేవి చెబుతుంది.

మరోవైపు పిజ్జా షాప్‌కు ఉద్యోగం కోసం వెళ్తుంది అప్పు. నీకు ఇక్కడ జాబ్ ఉంటే కదా. నీకు నచ్చినప్పుడు వచ్చి చేస్తా అంటే కుదరదు. లేదంటే నీ రిచ్ ఫ్రెండ్‌తో తిరుగుతావ్. అతను తలుచుకుంటే నీకు ఇలాంటి షాపే పెట్టిస్తాడు. అడుగు కదా అని షాప్ ఓనర్ అంటాడు. నేను వాడుకుందామని ఫ్రెండ్‌షిప్ చేయలేదు. వాడు జస్ట్ ఫ్రెండ్ అంతే. ఇకనుంచి కలవడం ఉండదు అని అప్పు అంటుంది. ఆ గోల నాకెందుకు అప్పు. నీలాంటివాళ్లకు నేను జాబ్ ఇవ్వలను. డిస్టర్బ్ చేయకుండా వెళ్లు అంటాడు.

నాకు ఇష్టం లేదు

దాంతో అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లిన అనామిక తనకు కావ్యతో కలిసి పూజ చేయడం ఇష్టం లేదంటుంది. మనసులో అంత కల్మషం పెట్టుకున్నవాళ్లతో మనస్ఫూర్తిగా ఎలా పూజ చేయాలి అంటుంది. కానీ, పెద్దవాళ్లు నిర్ణయం తీసుకున్నారు కదా. నేను కూడా మా అత్తయ్య మాటకు గౌరవం ఇవ్వాలి కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు ఇష్టం లేదని చెప్పాను. మీరు ఏం చెబితే అది చేస్తాను అని అనామిక వెళ్లిపోతుంది.

ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడుకుంటారు. వాళ్ల దగ్గరికి వెళ్లిన ధాన్యలక్ష్మీ అనామికకు కావ్యతో కలిసి పూజలో కూర్చోవడం ఇష్టం లేదంటూ తడబడుతుంది. ఆ మాటలు చాటున ఉండి వింటుంది అనామిక. కావ్యతో కూర్చోవడం అనామికకు ఇష్టం లేదు అంతే కదా. పెళ్లిలో అంత జరిగాక ఎవరికీ ఇష్టం ఉంటుంది అని అపర్ణ అంటుంది. ఇష్టం లేకుంటే నచ్చ జెప్పాలి. అది అత్తలుగా మీ బాధ్యత. మీకు పెళ్లైన కొత్తలో ఒకరంటే ఒకరికి పడేది కాదు. నేను అలాగే ఊరుకుని ఉంటే మీరు ఇలా ఇప్పుడు మాట్లాడుకునేవారా అని ఇందిరాదేవి అంటుంది.

నీకు గౌరవం దక్కాలని

మగవాళ్లు ఎంత తెలివి అయినవారు అయినా సరే.. భార్యల ఒక పుల్లవిరుపు మాట చాలు.. కుటుంబాలు నాశనం అవ్వడానికి. ద్వేషం పెరిగితే చాలు ఇక విడిపోవడమే. అందుకే అనామికకు నచ్చజెప్పు. అందులో అర్థం లేదని, ఇద్దరు కలిసిపోయేలా చేయు. ఇప్పుడు ఉన్న బాధే ద్వేషంగా మారుతుంది. కలిసి ఉండటం అంటే గదుల్లో ఉండటం కాదు. ఒకరిపై ఒకరికి ద్వేషం లేకుండా ఉండటం. ఇది నేనే చెప్పగలను కానీ, అత్తగా నీకు గౌరవం దక్కాలని చెబుతున్నా అని ఇందిరాదేవి అంటుంది.

సరే అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో చాటున విన్న అనామిక వెళ్లిపోతుంది. మరోవైపు చీర కుచ్చులు సరిగా సెట్ కావట్లేదు అని అత్త అంటూ గట్టిగా అరుస్తుంది స్వప్న. దాంతో రుద్రాణి, రాహుల్ వస్తారు. కుచ్చులు పెట్టమని స్వప్న అనడంతో షాక్ అవుతారు రుద్రాణి, రాహుల్. తర్వాతి ఎపిసోడ్‌లో అప్పుకు యాక్సిడంట్ అయినట్లు కావ్యకు కాల్ చేసి చెబుతుంది కనకం.

ఎలాగైనా పూజలో ఉండాల్సిందే

దాంతో నేను వెనుక నుంచి సైలెంట్‌గా వెళ్తాను. వాళ్లతో ఎలాగైనా పూజ చేయించండి అని రాజ్‌తో చెబుతుంది. రాజ్ ఒక్కడే కిందకు వెళ్లి కళావతి బయటకు వెళ్లందంటాడు. దాంతో ఇవాళ ఎలాగైనా పూజలో రాజ్, కావ్య కూర్చోవాల్సిందే ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం