తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 5th Episode: బ్రహ్మముడి- బిడ్డకు లాగే రాజ్‌కు మచ్చ- ధాన్యలక్ష్మీకి ఇచ్చిపడేసిన కనకం- అనామికకు వార్నింగ్

Brahmamudi April 5th Episode: బ్రహ్మముడి- బిడ్డకు లాగే రాజ్‌కు మచ్చ- ధాన్యలక్ష్మీకి ఇచ్చిపడేసిన కనకం- అనామికకు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu

05 April 2024, 8:41 IST

google News
  • Brahmamudi Serial April 5th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ నుంచి వెన్నెల గురించి అడిగి తెలుసుకున్న కావ్య స్కూల్‌కు వెళ్తుంది. అక్కడ వెన్నెల ఫొటో అడ్రస్ చూసి దొరికేసావ్ అని కావ్య అంటుంది. అప్పు కోసం బ్రోకర్‌ను కొడతాడు కల్యాణ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 5వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పును గెస్ట్ హౌజ్‌కు రమ్మన్న బ్రోకర్‌ను పోలీసులు, మీడియా ముందు కొడతాడు కల్యాణ్. అప్పును పోలీస్ ట్రైనింగ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు, ఇవాళ గెస్ట్ హౌజ్‌కు రమ్మన్నాడని చెబుతాడు. ఇలాంటి వాళ్ల వల్లే నాలుగు అడుగులు ముందుకు వేసి బయటకు వస్తున్న అమ్మాయిలు అలాగే వెనుకబడిపోతున్నారు అని కల్యాణ్ అంటాడు.

ఎంత నరకం చూశారో

దానికి మీరు కొట్టడం ఎందుకు సార్.. పోలీసులకు చెప్పొచ్చు కదా అని మీడియా అడిగితే.. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు ఏం చేయేలేరన్న పొగరు వీడికి. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని కల్యాణ్ అంటాడు. ఏవమ్మా ఇతను నిన్ను నిజంగా ఇబ్బంది పెట్టాడా అని పోలీస్ అడిగితే.. పెట్టాడు కాబట్టే ఇలా అందరిముందుకు వచ్చి చెబుతున్నా. ఇతర అమ్మాయిలు వీడి వల్ల ఎంత నరకం చూశారో. ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదనే ఇలా ముందుకు వచ్చి చెబుతున్నా అని అప్పు అంటుంది.

సరే నేను వీన్ని అరెస్ట్ చేస్తాను, కంప్లైంట్ ఇవ్వండని పోలీస్ అంటాడు. దాంతో అప్పు సరే అంటుంది. మీలాంటి వాళ్లు అండగా ఉంటే ఏ అమ్మాయికైనా చాలా ధైర్యంగా ఉంటుంది సార్ అని మీడియా అంటే.. మీరు మళ్లీ తప్పుగా ఆలోచిస్తున్నారు. నాలాంటి వాళ్ల అవసరం అమ్మాయిలకు ఎందుకు రావాలి. ఎలాంటి తోడు లేకుండా వాళ్లు ధైర్యంగా ఉండాలని కోరుకోవాలి అని కల్యాణ్ అంటే.. అక్కడున్నవారంతా చప్పట్లు కొడతారు. అప్పును కల్యాణ్ తీసుకెళ్తాడు.

రొడ్డెక్కి గొడవలు

ఇదంతా న్యూస్‌లో వస్తుంటే.. రుద్రాణి చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. కవితలే అనుకున్నా బాగానే ఫైట్ చేస్తున్నాడు. ఇది చాలు. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టేందుకు అని తన దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. అప్పుడు కల్యాణ్ రోడ్డెక్కి గొడవ పడుతున్నాడని బ్రోకర్‌ను కల్యాణ్ కొట్టే వీడియో చూపిస్తుంది. ఇందులో కల్యాణ్ తప్పు లేదు. ఇదంతా అప్పు వల్లే. దాంతో తిరగడం వల్లే కల్యాణ్ రోడ్డెక్కి గొడవలు పడుతున్నాడు అని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది.

ఇక చూస్తూ ఉంటే లాభం లేదు. ఆ కనకాన్ని కడిగేస్తా. నేను అక్కడికి వెళ్లడం ఏంటీ.. ఇక్కడికీ పిలిచి మరి అందరిముందు దులిపేస్తేనా కదా నేనేంటో తెలిసేది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి షభాష్ ధాన్యలక్ష్మీ అని రుద్రాణి రెచ్చగొడుతుంది. తర్వాత కనకంకు కాల్ చేసి అప్పుని తీసుకుని ఇంటికి రమ్మని చెబుతుంది ధాన్యలక్ష్మీ. అప్పు ఎందుకు.. రేపు వస్తాం అని కనకం అంటే.. ఇప్పుడే వచ్చేయండి అని ధాన్యలక్ష్మీ కాల్ కట్ చేస్తుంది. దాంతో కనకం టెన్షన్ పడుతుంటే.. ఏమైందో తెలియకుండా ఎందుకు టెన్షన్ అని కృష్ణమూర్తి అంటాడు.

ఇటు నుంచే వస్తాం

జరిగింది తల్చుకుంటూ చాలా మారిపోయావ్ అని కల్యాణ్‌ను అంటుంది అప్పు. ఒకప్పుడు నేను ఆవేశంగా ఉండేదాన్ని. నువ్ ఆలోచించేదానివి. ఇప్పుడు నువ్ నాలా తయారయ్యావ్ అని అప్పు అంటుంది. ఆరు నెల్లు సావాసం చేస్తే.. వాళ్లు వీళ్లు అవుతారంటకదా అని కల్యాణ్ అంటాడు. ఇంతలో కనకం కాల్ చేసి ధాన్యలక్ష్మీ రమ్మన్నారు అని అప్పుకు చెబుతుంది. నువ్ వచ్చేయి.. మేము ఇటు నుంచే వస్తామని చెబుతుంది అప్పు. ఇందాకా వీడియో ఏమైనా వచ్చిందా అని కల్యాణ్, అప్పు డౌట్ పడతారు.

ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను. ఇంటికి వెళ్లి మరి గొడవ పడి మరి చెప్పాను. అయినా కానీ ఆ అప్పు నా కొడుకుతో తిరుగుతుంది. ఇవాళ తిరగడం కాదు. నా కొడుకును వీధి రౌడీని చేసి ఇతరులను కొట్టేలా చేసింది. ఈ వార్త అంతా అందరికీ తెలిసింది అని ధాన్యలక్ష్మీ అంటుండగా.. కనకం, కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు. దాంతో మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఆ వీడియో చూపిస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంత జరిగినా నా కొడుకుతో అప్పు ఎందుకు బరి తెగించి తిరుగుతుంది. దానికి సిగ్గు లేదు. ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చా. మీకు బుద్ధి జ్ఞానం లేవా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మిస్ బిహేవ్ చేస్తే

చిన్నత్తయ్యా కొంచెం సంస్కారంతో మాట్లాడండి అని కావ్య అంటుంది. అబ్బో సంస్కారం మీ నుంచే నేర్చుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటే.. సంస్కారం లేదు కాబట్టే నేర్చుకోవాలి అని స్వప్న అంటుంది. ఆ గొడవ ఏంటో మాకు తెలియదు అని కృష్ణమూర్తి అంటాడు. నేను చెబుతాను అని వచ్చిన కల్యాణ్ అప్పుతో మిస్ బిహేవ్ చేస్తే వాన్ని కొట్టాను తప్పా అని కల్యాణ్ అంటాడు. తప్పే.. మిస్ బిహేవ్ చేస్తో పోలీసులకు చెప్పాలి. కానీ నువ్ వీధి రౌడీలా కొడతావా. ఇప్పుడు ఆ అమ్మాయి పరువు కూడా పోయినట్లే కదా అని అపర్ణ అంటుంది.

అది కాదు పెద్దమ్మ అని కల్యాణ్ అంటే.. ఆపు కల్యాణ్.. సిగ్గు లేకుండా నీతో అప్పు తిరుగుతుంది. మీ బాగోతానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెడుతుంది అని అప్పును అంటుంది అనామిక. షటప్ అనామిక.. అప్పును ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అని కల్యాణ్ అంటాడు. నోర్మూయ్.. తన కోసం నీ భార్యను అంటావా అని ధాన్యలక్ష్మీ అంటుండగా.. వ్యవహారం చూస్తే చాలా దూరం పోయినట్లుంది. రాజ్ లాగే ఏదో ఒక రోజు కల్యాణ్ కూడా బిడ్డను తీసుకొస్తాడేమో అని రుద్రాణి అంటుంది.

ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు

దాంతో అంతా షాక్ అవుతారు. పళ్లు రాలుతాయ్ అని స్వప్న అంటుంది. ఏంటీ అని రుద్రాణి అంటే.. అదే పళ్లు రాలుతాయ్ మా చెల్లి అలాంటి తప్పు చేస్తే అని కవర్ చేస్తుంది స్వప్న. ఇదంతా కాదు. మీరు ఈ ఇంటితో సంబంధం తెంచేసుకేవాలి. శాశ్వతంగా ఈ ఇంటి గడపకు దూరంగా ఉండాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏ ఇంటి గడప. ఈ ఇంటి గడప లోపల నా ఇద్దరూ కూతుర్లు ఉన్నారు. ఏంటీ సంబంధం తంచేసుకోవాలా. నా కూతుర్లను నేను అమ్మేశానా. ఆర్డర్లు వేస్తున్నావ్ అని కనకం ఫైర్ అవుతుంది.

కచ్చితంగా ఇంటికి వస్తాను. ఓ కూతురు కడుపుతో ఉంది. ఇంకో కూతురు కష్టాల్లో ఉంది. యోగా క్షేమాల కోసం కచ్చితంగా వస్తాను. మీరు ఈ దుగ్గిరాల కుటుంబానికి మూలస్తంభాలు అయినట్లు, స్థాపించినట్లు శాసనం వేస్తున్నారేంటీ. మీరేమైనా ఈ ఇంటి రాజమాతలా శాసిస్తున్నావ్. ఇంతకుముందు రోజులు పోయాయి. మీరు ఏది అంటే దానికి కళ్ల నిండా నీళ్లు పెట్టుకునే రోజులు కాదు. కనకం ఇక్కడ అని రివర్స్ అవుతుంది కనకం.

చేసిన తప్పేంటీ

ఈ ఇంటికి పెద్దవాళ్లు వారు. వాళ్లు ఉండగా మీరేంటి.. క్షమించడమ్మా.. మీ ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఓ అల్లుడు ఇప్పటికీ ఇంటికి రాలేదు. మరో అల్లుడు బిడ్డను తీసుకొచ్చి కూతురు భవిష్యత్తు ఎటు కాకుండా చేశాడు. ఇక కల్యాణ్ ఎం చెప్పిన వినకుండా మా ఇంటికి వచ్చి.. అప్పుతో స్నేహం చేస్తూ మాకు ఈ గతి పట్టిస్తున్నాడు. ఇందులో మేము చేసిన తప్పు ఏంటి. నేను ఎందుకు ఇంటికి రాకూడదు. ఆవిడ ఎవరు నన్ను రావొద్దు అనడానికి. ఇందులో తప్పేముంది అని కనకం అంటుంది.

తప్పేం లేదు. మీరు ఇంటికి రావొచ్చు. మిమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు అని సీతారామయ్య అంటాడు. దాంతో ధాన్యలక్ష్మీ ఇకనైనా పరువు కాపాడుకో అని ఇందిరాదేవి అంటుంది. నీ సంగతి ఏంటీ అని అనామికను కల్యాణ్ అంటాడు. చూడండి కల్యాణ్ బాబు.. ఇంకోసారి నా కూతురు గురించి నా భార్య తప్పుగా మాట్లాడితే మాత్రం మీ మొహం కూడా చూడను. ఇంకోసారి తన పేరు అనడానికే భయపడేలా చేస్తాను అని కనకం అంటుంది. నా ఫుల్ సపోర్ట్ మీకే అని కల్యాణ్ అంటాడు. దాంతో అనామిక షాక్ అవుతుంది.

ఎండీ బాధ్యతలు మాత్రమే

నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు. మా కుటుంబం తలెత్తుకునేలా చేస్తుంది అని అప్పును తీసుకెళ్తుంది కనకం. అనంతరం కావ్య ఆలోచిస్తుంటే దగ్గరికి వచ్చిన ఇందిరాదేవి వెళ్లిన పని గురించి అడుగుతుంది. ఆ వెన్నెల పదేళ్ల క్రితమే ఇల్లు ఖాలీ చేసి వెళ్లిపోయిందని కావ్య అంటుంది. ఇప్పుడు ఎలా అని ఇందిరాదేవి అంటే.. నేను హెల్ప్ చేస్తానుగా అని కల్యాణ్ వచ్చి అంటాడు. లేదు కవిగారు.. మీరు ఎండీ బాధ్యతలు, అనామిక గురించి మాత్రమే ఆలోచించండి అని చెబుతుంది కావ్య.

ఇప్పుడు ఆ వెన్నెల దొరికితే ఏం చేస్తావ్. తనను తీసుకొచ్చి బంధం రుజువు చేస్తే నీ స్థానం ఏంటో తెలుసా అని ఇందిరాదేవి అంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో బాబును రెడీ చేస్తుంటే.. నడుముపై పెద్దగా పుట్టు మచ్చ ఉంటుంది. అది చూసిన రుద్రాణి ఇలాంటి మచ్చే రాజ్‌కు ఉన్నట్లు ఉంది అని అంటుంది. దాంతో రాజ్ నడుము చూసేందుకు ప్రయత్నిస్తుంది కావ్య. అది చూసి షాక్ అయిన రాజ్ నువ్ నడుము చూశావ్ అని ఖుషిలో భూమిక డైలాగ్ చెబుతాడు.

తదుపరి వ్యాసం