Brahmamudi May 19th Episode: స్వప్నను ఇంట్లోకి రానివ్వని కృష్ణమూర్తి - కావ్యకు అపర్ణ క్లాస్
19 May 2023, 10:46 IST
Brahmamudi May 19th Episode: రాహుల్‌తో తన పెళ్లి జరగకుండా కావ్యనే అడ్డుపడుతుందని భ్రమపడుతుంది స్వప్న. ఆమెను నానా మాటలు ఉంటుంది. మరోవైపు కావ్య చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో ఆమెకు అపర్ణ, రుద్రాణి క్లాస్ ఇస్తారు.
బ్రహ్మముడి
Brahmamudi May 19th Episode: స్వప్నను వదిలించుకోవడానికి కావ్య పేరును అడ్డం పెట్టుకుంటాడు రాహుల్. మన పెళ్లి జరగకుండా కావ్యనే అడ్డుకుంటుందని అబద్దాలు చెబుతాడు. మన ప్రేమకు కావ్యనే విలన్‌గా మారిందని స్వప్నతో అంటాడు రాహుల్. తనను మర్చిపోమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాహుల్‌తో తన పెళ్లి జరగకపోవడానికి కావ్యనే కారణం అనుకొని భ్రమపడిన స్వప్న ఆమెపై కోపంతో రగిలిపోతుంటుంది. పైకి అమాయకంగా నటిస్తూ మనసులో తనపై ఇంత ద్వేషం పెంచుకుందా అంటూ చెల్లిలిపై మండిపోతుంది.
కావ్యపై స్వప్న ఫైర్
రాజ్ ఆఫీస్ నుంచి ఆటోలో ఇంటికి వెళుతోన్న కావ్య...స్వప్న రోడ్‌పై కనిపించడంతో వెళ్లి పలకరిస్తుంది. కావ్యను చూడగానే స్వప్న కోపంతో ఎగిరిపడుతుంది. రాహుల్‌కు తనకు పెళ్లి కాకుండా ప్లాన్స్ వేస్తున్నావంటూ నానా మాటలు అంటుంది. నన్ను అపార్థం చేసుకుంటున్నావని కావ్య నచ్చజెప్పినా ఆమె మాటలు వినదు. నేను ఆ ఇంటికి కోడలిగా వస్తే నిన్ను ఎవరు లెక్కచేయరు.
అందరూ నాకే పట్టం కడతారు. అందుకే రాహుల్‌తో నా పెళ్లికి అడ్డం పడుతున్నావని కావ్యపై అరుస్తుంది. నేను దుగ్గిరాల వారి ఇంటికి కోడలిగా వస్తా, నీపై పెత్తనం చెలాయిస్తానని కావ్యతో ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది. స్వప్న అలా మాట్లాడటానికి రాహుల్ కారణమని కావ్యకు అర్థమవుతుంది.
స్వప్నను ఇంట్లోకి రానివ్వని...
మరోవైపు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన స్వప్నపై కోపంతో రగిలిపోతుంటారు కృష్ణమూర్తి, కనకం. ఆమె లగేజీని ఇంట్లో నుంచి బయటపడేస్తాడు కృష్ణమూర్తి. స్వప్నను ఇంట్లోకి రావద్దని అంటాడు. నా దృష్టిలో కూతురు చచ్చిపోయిందని చెబుతాడు. కనకం కూడా భర్త మాటలకే వత్తాసు పలుకుతుంది. నేను ఏ తప్పు చేయలేదని స్వప్నచెప్పిన మాటలను వారు పట్టించుకోరు.
మీలో లోపం పెట్టుకొని స్వప్న తప్పు చేసిందని అనడం కరెక్ట్ కాదని స్వప్న పెద్దమ్మ వారికి నచ్చజెపుతుంది. కోపాన్ని పక్కనపెట్టి ఆలోచించమని ఇద్దరితో అంటుంది. కన్నవాళ్లే కాదంటే లోకం స్వప్నను ఆదరించదని, సమాజం స్వప్నపై దయతలచదని చెబుతుంది. ఆమె మాటలతో ఆలోచనలో పడ్డ కృష్ణమూర్తి, కనకం స్వప్నను ఇంట్లోకి రానిస్తారు.
స్వప్న బయటకి వెళ్లిపోతే కావ్య కాపురం నిలబడే అవకాశం ఉండదని భావించిన అప్పు కూడా తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. పెద్దమ్మ మాటలపై గౌరవంతో స్వప్నను ఇంట్లోకి రానివ్వడానికి అంగీకరిస్తాడు కృష్ణమూర్తి.
స్వప్న చెంప చెల్లుమనిపించిన కనకం...
ఇంట్లోకి రావడమే ఆలస్యం కావ్యపై ద్వేషాన్ని వెళ్లగక్కుతుంది స్వప్న. తన జీవితం తలక్రిందులు కావడానికి కావ్యనే కారణమని అంటుంది. ఆమె మాటలకు కోపంతో రగిలిపోయిన కనకం స్వప్న చెంపను చెల్లుమనిపిస్తుంది. స్వప్నకు పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయాలని డిసైడ్ అవుతుంది. అక్కయ్య మీనాక్షికి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేయమని చెబుతుంది కనకం.
కావ్యపై సెటైర్స్...
కావ్య కోసం అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి ఎదురుచూస్తుంటారు. కావ్య పుట్టింటికి వెళ్లి ఉండొచ్చని కళ్యాణ్ అంటాడు. తాను ఫోన్ చేస్తానని చెబుతాడు. కావ్య వాళ్ల ఇంటి నంబర్ కళ్యాణ్ దగ్గర ఎలా ఉందని అపర్ణ అడుగుతుంది. ఆమె మాటలకు కళ్యాణ్ తడబడిపోతాడు. కళ్యాణ్‌పై సెటైర్స్ వేస్తుంది అపర్ణ. ధాన్యలక్ష్మి సర్ధిచెప్పబోతే ఆమె మాటలను లెక్కచేయదు.
అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరు గొడవపడుతుండటంతో ఇందిరాదేవి కల్పించుకొని సర్ధిచెబుతుంది. ఇంతలోనే కావ్య ఇంట్లో అడుగుపెట్టడంతో అందరూఆమెపై ప్రశ్నలు కురిపిస్తారు. సమాధానం చెప్పకుండా అడ్డుకుంటారు. రాజ్‌కు టిఫిన్ చేసి తీసుకెళ్లిన విషయాన్ని చెబుతుంది.
భర్త దగ్గరకు వెళ్లడం మంచిదే కానీ చెప్పి వెళితే బాగుండేదని ఇందిరాదేవి అంటుంది. దొరికిందే ఛాన్స్‌గా అపర్ణ, రుద్రాణి కలిసి కావ్యకు క్లాస్ ఇస్తారు. కానీ ఇందిరాదేవి కావ్యను సపోర్ట్ చేస్తుంది.
నిజం బయటపడుతుందని భయపడ్డ కనకం...
స్వప్న జీవితం ఏమైపోతుందోనని కనకం, కృష్ణమూర్తి ఆలోచనలో పడతారు. స్వప్న మారుతుందన్న నమ్మకం లేదని, కావ్యకు స్వప్న ఎలాంటి ఆపద తలపెడుతుందో అని భయపడతారు. ఆమెకు ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఇళ్లు తాకట్టు పెట్టైనా స్వప్నను పెళ్లి చేస్తానని కృష్ణమూర్తి అంటాడు.
మరోవైపు స్వప్న పెళ్లి కోసమే అప్పటికే ఇళ్లు తాకట్టు పెట్టిన విషయం భర్తకు తెలిస్తే ఏం జరుగుతుందోనని కనకం భయపడుతుంది. రాజ్ పెట్టే గురకను ఫోన్‌లో రికార్డ్ చేసిన కావ్య అతడిని ఆటపట్టించడంతో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.