తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 26th Episode: రాజ్‌పై రివేంజ్ తీర్చుకున్న కావ్య - స్వ‌ప్న‌ను ఇంటి నుంచి గెంటేయ‌డం ఖాయ‌మేనా?

Brahmamudi July 26th Episode: రాజ్‌పై రివేంజ్ తీర్చుకున్న కావ్య - స్వ‌ప్న‌ను ఇంటి నుంచి గెంటేయ‌డం ఖాయ‌మేనా?

HT Telugu Desk HT Telugu

26 July 2023, 8:57 IST

google News
  • Brahmamudi July 26th Episode: రాజ్ త‌న‌ను భార్య‌గా కాకుండా సాటి మ‌నిషిగానే భావించ‌డం కావ్య స‌హించ‌లేక‌పోతుంది. ఆ ప‌దాన్ని ప‌దే ప‌దే ఉప‌యోగిస్తూ అత‌డిపై రివేంజ్ తీర్చుకుంటుంది.ఆ త‌ర్వాత‌ నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi July 26th Episode: కావ్యను ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ త‌న భార్య‌గా అంగీక‌రించేది లేద‌ని, ఆమెకు సాటి మ‌నిషిగానే సాయం చేస్తున్న‌ట్లు త‌ల్లి అప‌ర్ణ‌తో చెబుతాడు రాజ్‌. అత‌డి మాట‌ల్ని చాటుగా విన్న కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. దేవుడితో త‌న ఆవేద‌న‌ను చెప్పుకుంటుంది. ఇంత‌లోనే ఆమెను వెతుక్కుంటూ ధాన్య‌ల‌క్ష్మి వ‌స్తుంది. ధాన్య‌ల‌క్ష్మిని చూడ‌గానే త‌న క‌న్నీళ్ల‌ను తుడిచివేసుకుంటుంది కావ్య‌.

రాజ్ నిన్ను వెన‌కేసుకురావ‌డం ఆనందంగా అనిపించింద‌ని, నువ్వు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నావో ఆ ఆనందాన్ని క‌ళ్లారా చూద్ధామ‌ని వ‌చ్చాన‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. . నీ ఆనందాన్ని లోలోప‌లే మురిసిపోతున్న‌ట్లునావు అని కావ్య‌ను ఆట‌ప‌ట్టిస్తుంది. అవును. చాలా మురిసిపోతున్నాను. బ‌హుశా చ‌రిత్ర‌లో ఇంత అదృష్టం ఏ భార్య‌కు ద‌క్కి ఉండ‌దేమో అని ఎమోష‌న‌ల్‌ అవుతుంది కావ్య.

ఇందిరాదేవి ఓదార్పు...

ఇన్నాళ్ల‌కు రాజ్ నిన్ను అర్థం చేసుకున్నాడ‌ని,రాజ్‌లో మంచి మార్పు వ‌చ్చింద‌ని ధాన్య‌ల‌క్ష్మి సంతోష‌ప‌డుతుంది. మార్పు అని మీరు అనుకుంటున్నారు. ఓదార్పు అని ఆయ‌న అనుకుంటున్నార‌ని మ‌న‌సులో అనుకుంటుంది. ధాన్య‌ల‌క్ష్మి గ‌ల‌గ‌ల మాట్లాడుతోన్న కావ్య మాత్రం సైలెంట్‌గా ఉంటుంది.ఏమైంద‌ని ధాన్య‌ల‌క్ష్మి అడ‌గ్గానే...ఏం మాట్లాడ‌మంటారు..

మీరు అనుకున్నంత‌గా ఆయ‌న‌లో మార్పు రాలేద‌ని, ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని నేను అనుకోవ‌డం లేద‌ని కావ్య స‌మాధాన‌మిస్తుంది. అప్పుడే అక్క‌డ‌కు వ‌చ్చిన ఇందిరాదేవి కూడా రాజ్ ప్ర‌వ‌ర్త‌న‌లో, మాట‌ల్లో మార్పు వ‌చ్చింద‌ని కావ్య‌తో అంటుంది. . భ‌ర్త‌ను మార్చుకోవ‌డానికి నువ్వు ప‌డ్డ క‌ష్టం ఫ‌లించింద‌ని కావ్య‌తో అంటుంది ఇందిరాదేవి. నువ్వు కోరుకున్న రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని కావ్య‌ను ఓదార్చుతుంది ఇందిరాదేవి. భార్య‌గా నువ్వు స‌రిపోవ‌వ‌ని అన్న మ‌నుషుల‌కు స‌మాధానంగా మీరిద్ద‌రు అన్యోన్యంగా ఉంటార‌ని కావ్య‌తో అంటుంది.

అప్పుడు నువ్వు రాజ్ చుట్టూ తిరుగుతూ మ‌మ్మ‌ల్నే కాదు ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోతావ‌ని కావ్య‌పై ధాన్య‌ల‌క్ష్మి ఫ‌న్నీగా సెటైర్ వేస్తుంది. .వారి మాట‌ల‌తో ఈ రోజు నుంచి భార్య‌కు, సాటి మ‌నిషికి ఉన్న తేడా ఏమిటో రాజ్‌కు చూపించాల‌ని కావ్య నిశ్చ‌యించుకుంటుంది.

సాటి మ‌నిషి ప‌దంతో...

రాజ్ భోజ‌నానికి రాగానే అత‌డికి వ‌డ్డిస్తుంది కావ్య‌. మా అంద‌రి కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నావ‌ని, వంట‌లు అదుర్స్ అని కావ్య‌ను మెచ్చుకుంటాడు క‌ళ్యాణ్‌. అత‌డి మాట‌ల‌కు సాటి మ‌నిషిగా క‌ష్ట‌ప‌డ‌క‌పోతే ఎలా అని అంటుంది. నాటి మ‌నిషి అనే ప‌దం విన‌గానే రాజ్‌కు పొల‌మారుతుంది. ఎవ‌రో సాటి మ‌నిషి త‌లుచుకుంటున్నారు అన‌గానే మ‌రోసారి రాజ్ కంగారు ప‌డ‌తాడు. ఆ సాటి మ‌నిషి అనే ప‌దాన్ని క‌ళ్యాణ్ ప‌దే ప‌దే ప్ర‌యోగిస్తూ రాజ్‌ను మ‌రింత ఇబ్బందిపెడ‌తాడు. సాటి మ‌నిషి అనే ప‌దంపై క‌విత చెబుతాడు. ఆ మాట‌లు విని ఇబ్బందిగా ఫీల‌వుతాడు రాజ్‌.

రాహుల్ నాట‌కం...

దుగ్గిరాల ఫ్యామిలీ అంద‌రూ స్వ‌ప్న‌ను తిట్ట‌డంతో ఆమె ఫీల‌వుతంద‌ని రాహుల్ అనుకుంటాడు. ఆమెను ఓదార్చుతున్న‌ట్లుగా నాట‌కం ఆడుతాడు. స్వ‌ప్న మాత్రం అత‌డి మాట‌లు విని న‌వ్వుతుంది. త‌న‌కు ఎలాంటి బాధ లేద‌ని అంటుంది. తాను చేసిన ప‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌ద‌ని, నిజం తెలిసిన త‌ర్వాతే తిట్టిన వారే పొగుడుతార‌ని అంటుంది.

ఎవ‌రు ఎన్ని చెప్పిన యాడ్స్‌లో న‌టించ‌డం మానేయ‌న‌ని రాహుల్‌తో అంటుంది స్వ‌ప్న‌. కావ్య‌నే కాదు మా నాన్న అడ్డువ‌చ్చినా ప‌ట్టించుకోకుండా యాడ్స్ షూటింగ్‌లో పాల్గొంటాన‌ని అంటుంది. అంద‌రూ స్వ‌ప్న గ్రేట్ అని మెచ్చుకుంటార‌ని పొంగిపోతుంది కావ్య‌. గ్రేట్ కాదు గెట‌వుట్ అనే రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ని మ‌న‌సులోనే అనుకుంటాడు రాహుల్‌.

కావ్య ఎమోష‌న‌ల్‌...

సాటి మ‌నిషి అంటూ భార్య‌ గురించి త‌ల్లితో తాను మాట్లాడిన మాట‌ల్ని కావ్య విందా? లేదా? అని రాజ్ ఆలోచిస్తుంటాడు. వింటే కావ్య సైలెంట్‌గా ఉండేది కాద‌ని అనుకుంటాడు. ఇంత‌లోనే కావ్య బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మ‌ళ్లీ సాటి మ‌నిషి అనే ప‌దాన్ని ప‌దే ప‌దే వాడుతూ రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది. బెడ్ ప‌ర‌వ‌డంతో కావ్య‌కుసాయం చేస్తాడు రాజ్‌. సాటి మ‌నిషి సాయం తీసుకోవ‌డం నాకు న‌చ్చ‌ద‌ని అంటుంది.

సాటి మ‌నిషి ఇంటి మ‌నిషి అవుతుందా...ఇంటి మ‌నిషి సొంత మ‌నిషి అవుతుందా త‌న సెటైర్స్ కంటిన్యూ చేస్తుంది. నేను మా అమ్మ‌తో నీ గురించి మాట్లాడింది విన్నావా అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. ఆ మాట మీ నోటి నుంచి వ‌చ్చిన‌ప్పుడు నా గుండె ఎంత విల‌విల‌లాడింతో తెలుసా అంటూ ఎమోష‌న్ అవుతుంది కావ్య‌. అత్త‌గారికి అక్క‌ర‌లేని కొడ‌లిగా, భ‌ర్త‌కు అక్క‌ర‌లేని భార్య‌గా ఇంట్లో ఉండాల్సిరావ‌డం ఎంత న‌ర‌కంగా ఉంటుందో మీకు తెలుసా అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

రాజ్‌కు కావ్య సాయం...

అర్ధ‌రాత్రి రాజ్ ఎక్కిళ్ల‌తో ఇబ్బందిప‌డుతుంటాడు వాట‌ర్ బాటిల్ తీసుకొచ్చి అత‌డికి ఇస్తుంది కావ్య‌. సాటి మ‌నిషిగా జాలేసి ఇస్తున్నావా అని అడుగుతాడు రాజ్‌. భార్య‌ను మీరు సాటి మ‌నిషిగా అనుకున్నంత సులువుగా భార్య‌గా నేను మిమ్మ‌ల్ని సాటి మ‌నిషి అనుకోలేన‌ని రాజ్‌తో చెబుతుంది. కానీ వాట‌ర్ తాగ‌న‌ని మొండికేస్తాడు రాజ్‌. సాటి మ‌నిషిగానే ఇస్తున్నాన‌ని అన‌డంతో తాగుతాడు.

స్వ‌ప్న యాడ్‌...

స్వ‌ప్న న‌టించిన యాడ్ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుంది. ఆ యాడ్ చూసి ఇంట్లో వాళ్లు త‌న‌ను పొగుడుతార‌ని, త‌న‌ను ఓ సెల‌బ్రిటీగా చూస్తార‌ని స్వ‌ప్న క‌ల‌లు కంటుంది. తానో మ‌హారాణి అయిపోయిన‌ట్లు ఊహ‌ల్లో తెలిపోతుంది. రాహుల్ కూడా ఆమెను పొగిడిన‌ట్లుగా నాట‌కం ఆడుతాడు. . దుగ్గిరాల ఫ్యామిలీకి నువ్వే రోల్ మోడ‌ల్ అని రాజ్ మెచ్చుకునే రోజు వ‌స్తుంద‌ని భ‌ర్త‌తో అంటుంది స్వ‌ప్న‌. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది. స్వ‌ప్న యాడ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం చూస్తారు. ఆ యాడ్ వంట‌తో స్వ‌ప్న‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని రుద్రాణి ఫిక్స్ అవుతుంది.

తదుపరి వ్యాసం