Brahmamudi July 10th Episode : రాజ్ గుండెల్లో ప్రేమ గంట.. కొంపదీసి.. కల్యాణ్, అప్పు పెళ్లి చేసుకుంటారా ఏంటి?
10 July 2023, 9:39 IST
- Brahmamudi Today Episode : అప్పును పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిన కల్యాణ్ కనకం ఇంటికి వస్తాడు. మరోవైపు కావ్య కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని బ్యాంకువాళ్లను ఇంటికి రప్పిస్తాడు రాజ్. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..?
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్
అప్పును పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిన కల్యాణ్ కనకం ఇంటికి వస్తాడు. అప్పును కనకం పిలుస్తుంది. టీ తీసుకెళ్లి.. అబ్బాయికి ఇవ్వు అని కనకం అంటుంది. నా ఫేస్ కి సూట్ కాదే.. ఇవ్వను అంటుంది. ఆ అబ్బాయి లేకుంటే.. పోలీస్ స్టేషన్ నుంచి విడుదల అయ్యేదానివే కాదు అని కనకం అనగా.. టీ తీసుకెళ్తుంది అప్పు. కల్యాణ్ అప్పు వంక అలానే చూస్తూ ఉంటాడు.., ఆశ్చర్యపోతాడు(అప్పు వైపు కల్యాణ్ చూసిన చూపు, వెనకలా వచ్చిన మ్యూజిక్ చూస్తుంటే.. సీరియల్ లో వీళ్లిద్దరకి పెళ్లి చేసేలా ఉన్నారు.). నీ చేతితో టీ తెస్తుంటే.. నీకు అస్సలు సూట్ కాలేదు అప్పు అంటాడు. తర్వాత.. అసలు ఒక మనిషి తల పగలగొట్టాలని నీకు ఎలా అనిపించిందని అడుగుతాడు.
రాకేశ్ అన్న మాటల గుర్తు చేసుకుని, వాడు అన్న మాటలకు కొట్టాల్సిందేనని కల్యాణ్ తో అంటుంది అప్పు. ఇప్పుడు నీ బాధ ఏంటి.. నీకు థాంక్స్ చెబితే.. గానీ ఇంటికి వెళ్లవా అని వెటకారం చేస్తుంది. ఛీ ఛీ నేను అలాంటివేమీ ఎక్స్ పెక్ట్ చేయట్లేదని కల్యాణ్ చెబుతాడు. నేను కూడా అలాంటివేమీ చెప్పను అంటుంది. ఇక బయల్దేరమని చెబుతుంది. కనకం ఇంటి నుంచి వెళ్తాడు కల్యాణ్.
మరోవైపు గదిలోకి కావ్య వచ్చేసరికి.. చేతిలో డబ్బుతో ఉంటాడు రాజ్. చూసిచూడనట్టుగానే తన పని తాను చేసుకుంటుంది కావ్య. అన్ని హక్కులు కావాలంటుంది కానీ.. ఈ ఇంట్లో ఆర్థిక స్వతంత్రం కావాలని అడగదు ఏంటీ? ఇదో తింగరి బుచ్చి అంటాడు రాజ్. హా.. ఏంటి అని కావ్య ప్రశ్నిస్తుంది. మనసులో ఏదో తిట్టుకుంటున్నట్టుగా ఉన్నారు ఏంటని అడుగుతుంది. చేతిలో ఆ నోట్ల కట్టలు ఏంటని ప్రశ్నిస్తుంది. ఓహో మీ అమ్మగారు థాంక్స్ చెప్పారు, మీరు నోట్లు ఇచ్చి థాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇవి నేను లెక్కపెట్టుకుంటున్నాను అని రాజ్ సమాధానమిస్తాడు. డబ్బు ఇచ్చేందుకు కూడా లేకుండా నా నోరు కట్టిపడేసిందని మనసులో అనుకుంటాడు రాజ్. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తాడు.
ఫోన్లో మాట్లాడినట్టుగా నటిస్తాడు రాజ్. బాబాయ్.. ఇక్కడ చాలా డబ్బు ఉంది, ఎవరో తీసి వాడుకుంటున్నారనే బాధ లేదు. అవసరానికి తీసి వాడుకోవచ్చని మాట్లాడుతాడు. ఈ చేష్టలను కావ్య గనిస్తూనే ఉంటుంది. మన ఇంట్లో అందరికీ ఫ్రీడమ్ ఉంది కదా బాబాయ్ అని, వింటున్నారా? అని ఫోన్ల్ కావాలనే అంటాడు. ఇదే సమయంలో రాజ్ బాబాయ్ ప్రకాశం వచ్చి.. హా వింటున్నాను రా అంటాడు. కావ్య, రాజ్ ఆశ్చర్యపోయి చూస్తారు. రేయ్.. బాబాయ్ ని నేను ఇక్కడ ఉండగా.. నువ్ ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తాడు ప్రకాశం. కాసేపు రాజ్, ప్రకాశం ఫన్నీగా మాట్లాడుకుంటారు. ఏదో సొల్లు చెప్పి ప్రకాశాన్ని పంపిస్తాడు రాజ్. కావ్య ఆలోచిస్తుంది. నిజంగా ఆ డబ్బు నా కోసమే పెడుతున్నానని చెప్పలేక.. ఇబ్బంది పడుతున్నారా అని అనుకుంటుంది. బయటకు వచ్చి.. ఈ పిచ్చి లచ్చికి ఎలా చెబితే అర్థమవుతుందని రాజ్ ఆలోచిస్తాడు. ఇలా కాదు.. తనకంటూ కొంత అమౌంట్ బ్యాంకులో వేయాలని, బ్యాంకుకు కాల్ చేస్తాడు. ఎవరైనా ఎగ్జిక్యూటివ్ ను ఇంటికి పంపించమని అంటాడు.
సీన్ కట్ చేస్తే.. అప్పుకు ఓ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. హాలో అప్పు నన్ను కొట్టారు అని చెబుతాడు. ఎవడు వాడు, ఇవ్వాళ అయిపోయాడు నా చేతిలో వాడు, అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది అప్పు. నువ్ కాలు బయటపడితే నీ సంగతి చెబుతానని కనకం బెదిరిస్తుంది. ఎవరో ఎవరినో కొడితే నీకు ఎందుకు, రెండు రోజులు మాకు తిండితిప్పలు లేకుండా చేశావ్ గుర్తుందా అని అడుగుతంది. దీంతో అప్పు ఆలోచల్లో పడుతుంది. నువ్ ఆడపిల్లవని నీకు గుర్తుందా? అని ప్రశ్నిస్తుంది. మనం గుర్తు పెట్టుకున్నామా అని అప్పు పెద్దమ్మ కనకంతో అంటుంది. నన్ను చేసుకునేది ఎవడే.. అని అప్పు అంటుంది. అప్పును వెళ్లకుండా ఆపుతుంది కనకం. చీరకట్టి, జడ వేస్తే.. అప్పు అందంగా ఉంటుందని అప్పు పెద్దమ్మ అంటుంది. అయినా లక్షణంగా తయారయ్యేది.. ఇదో, పెద్దదో కాదు.. కావ్యనే అంటుంది కనకం. కనకం అని మూర్తి అంటాడు. మనం పోలీస్ స్టేషన్ విషయంలో పడి, కావ్యను వాళ్ల అత్తగారు ఎందుకు తిట్టారో అడగడమే మరిచిపోయామని గుర్తుచేస్తాడు.
వెంటనే కనకం కల్యాణ్ కు కాల్ చేసి.., కావ్యకు ఫోన్ ఇవ్వమని అంటుంది. కావ్య ఎలా ఉన్నావే అని అడుగుతుంది కనకం. అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగిందని తెలిసిందని అంటుంది. నీకు ఎలా తెలుసు అని కావ్య ప్రశ్నిస్తుంది. నేను నీ అమ్మను నాకు అన్ని తెలుస్తాయని కనకం సమాధానమిస్తుంది. అవును మా అత్తగారికి నా మీద కోపం వచ్చిందని కావ్య అంటుంది. కానీ మా ఆయన నన్ను ఏం అనకుండా చూసుకున్నారని చెబుతుంది. నువ్ బాగుంటే చాలు అని అంటుంది కనకం. స్వప్న గురించి కూడా ఆరా తీస్తుంది. మూర్తికి ఈ విషయాలు అన్ని చెబుతుంది.
కల్యాణ్ కు ఫోన్ తీసుకొచ్చి ఇస్తూ.. కొత్త కవిత రాస్తున్నావా కవిగారు అని అడుగుతుంది కావ్య. అవును వదినా.. తుది మెరుగులు దిద్దుతున్నాను అని అంటాడు కల్యాణ్. ఒక్కసారి చదవమని కావ్య అడుగుతుంది. ఇక కల్యాణ్.. తన కవిత్వాని వినిపిస్తాడు. కావ్య వింటూ ఆశ్చర్యపోతుంది.. చాలా బాగుందని కవిత్వాన్ని తీసుకుంటుంది. తన కవిత్వాన్ని తీసుకున్నందుకు కల్యాణ్ సంతోషపడిపోతాడు. కావ్య గదిలోకి వెళ్లి దాస్తుండగా.. రాజ్ చూస్తాడు. ఏంటీ ఈ కాగితం అని అడుగుతాడు రాజ్. కాగితం కాదు.. కవిత్వమని చెబుతుంది కావ్య. కల్యాణ్ ఒక్కడు చాలదా.. నువ్ కూడా తయారయ్యావా అని ప్రశ్నిస్తాడు రాజ్. కవిత్వం ఆస్వాదించాలంటే.. రస హృదయం ఉండాలని కావ్య అనగా.., అంటే నాకు లేదా అని రాజ్ అడుగుతాడు.
ఇంట్లో అందరూ.. హాలులో కూర్చుంటారు. ఇదే సమయంలో బ్యాంకు అతను వస్తాడు. కళావతికి మాత్రమే.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయిస్తానని అంటే.. వీళ్లకు అనుమానం వస్తుందని ఆలోచిస్తాడు రాజ్. అందరికీ ఉన్నాయి కదా.. అంటారు అందరు. ఈ బ్యాంకులో ఆఫర్స్ బాగుంటాయని చెబుతాడు. ఇంత సడెన్ గా అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేయించడమని అపర్ణ అంటుంది. లేకపోతే.. ఆ కళావతి ఒక్కదానికే ఓపెన్ చేయించడానికి అనుకుంటున్నారా అని అనేస్తాడు రాజ్. దీంతో అందరూ రాజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంత వరకూ అనుకోనే లేదు.. ఇప్పుడు అర్థమైందిలే.. అని ధాన్యలక్ష్మి అంటుంది.
ముందు ఇందిరా దేవితో అకౌంట్ ఓపెన్ చేయడం మెుదలుపెడతారు. బ్యాంకు అతను మీ భర్త పేరు చెప్పమనగా.. ఇందిరా దేవి సిగ్గుపడిపోతుంది. బావా అంటుంది. అదే రాసుకోమంటారా అని బ్యాంకు ఎంప్లాయి అంటాడు. ఇన్నిరోజులు అయినా.. మీ నానన్న నా పేరు ఎప్పుడూ చెప్పలేదు, ఇప్పుడేం చెబుతుందని రాజ్ తో సీతారామయ్య అంటాడు. తన పేను తానే చెబుతాడు. ఇలా ఒక్కొక్కరు తమ పేర్లు బ్యాంకు ఎంప్లాయితో చెబుతారు. అసలు కళావతి కోసమే.. అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తే.., తను కనిపించడం లేదేంటని చూస్తాడు రాజ్. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.