Brahmamudi January 15th Episode:కావ్యపై రాజ్ అనుమానం -కళ్యాణ్‌కు అన్నపూర్ణమ్మ వార్నింగ్ - ధాన్యలక్ష్మి ఫైర్
15 January 2024, 8:36 IST
Brahmamudi January 15th Episode: కళ్యాణ్, అనామిక శోభనం ఏర్పాట్లను కావ్య చేస్తుంటుంది. ఆమెకు ధాన్యలక్ష్మి అడ్డుచెబుతుంది. నీ చేతితో ఏది చేసిన కళ్యాణ్..అనామికలకు అరిష్టంగా మారుతుందని కావ్యను అవమానిస్తుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi January 15th Episode: అప్పు హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో తెలియక కనకం, కృష్ణమూర్తి కంగారు పడతారు. కానీ వారికి తెలియకుండా రాజ్ హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేస్తాడు. రాజ్‌కు థాంక్స్ చెప్పడానికి కనకం ఫోన్ చేస్తుంది. ఒక దేవుడు వచ్చి రక్తదానం చేశాడు. ఇంకో దేవుడు వచ్చి డబ్బు సాయం చేసి కష్టం తీర్చాడని రాజ్‌కు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతుంది. అప్పు క్షేమంగా ఉంది కదా...అది చాలు...నన్ను దేవుడిని చేయోద్దు.
నేనే నేరుగా డబ్బు ఇస్తే మీరు మొహమాటపడి తీసుకోరని మేనేజర్‌ను పంపించి హాస్పిటల్ బిల్ చెల్లించానని కనకంతో అంటాడు రాజ్. భవిష్యత్తులో మీకు ఏ అవసరం వచ్చినా మీ అమ్మాయికి కాదు నాకే చెప్పండి. ఆత్మగౌరవం అంటూ కావ్య నాతో చెప్పకపోవచ్చునని కనకానికి మాటిస్తాడు రాజ్.
కనకంతో రాజ్ మాట్లాడుతుండగా కావ్య వింటుంది. . ప్రతి విషయంలో తనకు సపోర్ట్‌గా ఉంటూ ప్రేమను చూపించే రాజ్‌ను తానే ఓ అమ్మాయి విషయంలో అనవసరంగా అనుమానిస్తానని కావ్య మనసులో పశ్చాత్తాపపడుతుంది.
అన్నపూర్ణమ్మ ఫైర్...
అప్పును హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కనకం, కృష్ణమూర్తి. కొద్ది రోజులు ఎక్కడికి వెళ్లొద్దని చెప్పిన ఎందుకు బయటకు వెళ్లావని అప్పును కన్నీళ్లతో అడుగుతుంది అన్నపూర్ణమ్మ. ఇంట్లో ఒక్కదానినే ఉండలేకపోతున్నానని అప్పు బదులిస్తుంది. నన్ను చూసి మీరు ఏడవడం చూడలేక బయటకు వెళ్లానని చెబుతుంది. నీకు ఏమన్నా అయితే మేమందరం తట్టుకోలేమని అప్పుతో అంటుంది అన్నపూర్ణమ్మ.
కానీ వాళ్ల మాటలను అప్పు అపార్థం చేసుకుంటుంది. నాకు ఏమన్నా అయితే ఎవరూ పెళ్లి చేసుకోరని అనుకుంటున్నారా...ఇప్పటికీ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ అన్నపూర్ణమ్మపై ఫైర్ అవుతుంది. మా ప్రేమను భారం అనుకోవద్దని, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నా జీవితాంతం నిన్ను చూసుకుంటామని అప్పుతో అంటుంది కనకం.
కళ్యాణ్ ఫోన్...
అప్పుడే అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. కనకం చేతిలో నుంచి ఫోన్ లాక్కోని కళ్యాణ్‌కు క్లాస్ ఇస్తుంది అన్నపూర్ణమ్మ. జరిగిన గొడవలు చాలవా...ఇలా ఫోన్ చేసి నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఎందుకు ఇబ్బందిపెడతావని కళ్యాణ్‌ను నిలదీస్తుంది. ఇంకా అప్పును ఎందుకు సాధించాలని అనుకుంటున్నావని గట్టిగా అడుగుతుంది. ఆమె కోపాన్ని కనకం కంట్రోల్ చేస్తుంది. అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అప్పు బాగుందని కళ్యాణ్‌తో చెబుతుంది.
అప్పును హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుందని కళ్యాణ్‌తో అంటుంది కనకం. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అప్పును ఫోన్ చేయమని చెప్పండి అని కనకంతో అంటాడు కళ్యాణ్. కనకంతో కళ్యాణ్ మాట్లాడుతుండటం అనామిక చూస్తుంది. లోలోన కోపం ఉన్నా పైకి మాత్రం అప్పుకు ఎలా ఉందని కళ్యాణ్‌ను అడుగుతుంది. అప్పుకు బాగుందని కళ్యాణ్ చెప్పగానే సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. అప్పుకు కళ్యాణ్ రక్తం ఇచ్చి కాపాడిన విషయం అన్నపూర్ణమ్మతో చెబుతారు కనకం. కృష్ణమూర్తి.
కృష్ణుడితో మాట్లాడిన కావ్య...
ఫోన్‌లో కృష్ణుడి ఫొటో చూస్తూ కళ్యాణ్ మనస్తత్వం గురించి తనలో తానే మాట్లాడుకుంటుంది కావ్య. మా ఆయన నీలాంటి వాడా...శ్రీరామచంద్రుడా అని కృష్ణుడి ఫొటోతో అంటుంది కావ్య. ఈ గోపికి ఒక గోపిక ఉందా. లేదంటే నేనే అపార్థం చేసుకుంటున్నానా...నేను ఎలా తెలుసుకునేది...నువ్వు నాకు తెలిసేలా చేయాలని అంటుంది. అప్పుడే రాజ్ రూమ్‌లోపలికి వస్తాడు.
దాంతో కావ్య మాటలు ఆపేస్తుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని కావ్యను అడుగుతాడు రాజ్. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్...నాకు చాలా సార్లు సాయపడ్డాడని కావ్య అంటుంది. నాకు ఆత్మ బంధువు..ఆప్తుడు అని అంటుంది. ఆ ఫ్రెండ్ ఎవరో నేను చూడాల్సిందేనని కావ్య చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కుంటాడు రాజ్. కృష్ణుడి ఫొటో కనిపిస్తుంది. మీరు నా బాయ్‌ఫ్రెండ్ అనుకున్నారా అని రాజ్‌తో అంటుంది కావ్య. అది నా పాలసీ కాదని రాజ్ బదులిస్తాడు.
ధాన్యలక్ష్మికి మాటిచ్చిన కావ్య...
ఆ తర్వాత కళ్యాణ్ శోభనం గదిని అలంకరించే బాధ్యతను రాజ్, కావ్య తీసుకుంటారు.శోభనం గదిని అలంకరించడంలో మీరు నాకు అసిస్టెంట్‌గా పనిచేయాలని రాజ్‌తో అంటుంది కావ్య. అసిస్టెంట్ అనే మాట వినగానే ఆమెను కొట్టడానికి వస్తాడు రాజ్. భర్తకు దొరక్కుండా కావ్య పారిపోతుంది. కళ్యాణ్ శోభనానికి పూలు తెప్పించే పనిలో ఉంటుంది కావ్య.
ఆమె దగ్గరకు ధాన్యలక్ష్మి. నా కొడుకు, కోడలు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండటం కోసం ఈ శోభనం విషయంలో నువ్వు జోక్యం చేసుకోనని నాకు మాటివ్వమని కావ్యను కోరుతుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య మాటలతో కావ్య షాకవుతుంది. నీ చేతితో వ్రతం మొదలుపెడితే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది నీ కోడలు బతుకు పండించుకునే వేళ. ఇప్పుడు నీ చేతి పడితే వాళ్ల కాపురం ఏమైపోతుందోనని భయపడుతున్నానని ధాన్యలక్ష్మి అంటుంది.
ఒకప్పుడు అదృష్టం...ఇప్పుడు అరిష్టం...
ఒకప్పుడు నా చేతి పడితే అదృష్టం అన్నారు. ఇప్పడు ఆ అదృష్టం అరిష్టంగా మారిందా అని ధాన్యలక్ష్మిని అడుగుతుంది కావ్య. అవును. నా ఒకప్పుడు అందరూ నా అంత స్వచ్చంగా ఉంటారని అనుకున్నా. ఎప్పుడైతే నీ చెల్లెలిని నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావో అప్పుడే నీ స్వార్థం బయటపడింది.
నీ మనసు అసూయతో రగిలిపోతూ ఉంటుందని నాకు తెలుసు. అలాంటి మనస్తత్వంతో నువ్వు ఏ పనిచేసినా అది నా కోడలికి దురదృష్టంగా మారుతుందని కావ్యను అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ సుఖంగా ...సంతోషంగా ఉండటం నాకు కావాలి. ఇకపై అతడి విషయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోనని ధాన్యలక్ష్మికి మాటిస్తుంది కావ్య. ఆమె మాటలతో ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీలవుతుంది.
కళ్యాణ్ రిక్వెస్ట్...
అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. పెళ్లైనా తర్వాత అనామికకు ఫస్ట్ టైమ్ ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని, ఇందుకోసం మన కంపెనీలో రెండు నగలను స్పెషల్‌గా డిజైన్ చేయించానని కావ్యతో అంటాడు కళ్యాణ్. వాటిలో ఏది బాగుందో మీరే సెలక్ట్ చేయాలని కావ్యను కోరుతాడు. మీ చేతితో ఏది మొదలుపెట్టినా సూపర్ సక్సెస్ అవుతుంది.
నా ఫస్ట్ గిఫ్ట్ కూడా మీరు సెలెక్ట్ చేస్తేనే అనామిక హ్యాపీగా ఫీలవుతుందని కళ్యాణ్ అంటాడు. కానీ ధాన్యలక్ష్మికి ఇచ్చిన మాట గుర్తొచ్చి గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి కావ్య సంశయిస్తుంది. ధాన్యలక్ష్మి సలహాను తీసుకొమ్మని అంటుంది. లేదంటే అనామికను అడగమని అంటుంది. నేను మీ సెలెక్షన్ గొప్పదని అంటే మీరు వాళ్లను అడగమని అంటున్నారు. మీరు సెలెక్ట్ చేయాల్సిందేనని పట్టుపడతాడు.
ధాన్యలక్ష్మి కోపం...
అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి...కావ్యను అడిగితే తనేం చెబుతుంది. వాళ్ల ఇంట్లో ఎప్పుడైన వీసమెత్తు బంగారం కొన్నారా...బంగారం గురించి నన్ను అడగమని అంటుంది. కానీ మా అమ్మ మాటలను పట్టించుకోవద్దని, బతికుండగానే రుద్రాణి అత్తయ్య మా అమ్మను పూనిందని కల్యాణ్ అంటాడు.
కళ్యాణ్ బలవంతంతో చివరకు గిఫ్ట్ ఓ నగను సెలెక్ట్ చేసి వెళ్లిపోతుంది కావ్య. అది బాగా లేదని ఇంకో నగను సెలెక్ట్ చేస్తుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి సెలెక్ట్ చేసిన నగను ఆమెకు ఇచ్చి బాగుంది అన్నావు కదా..నువ్వే ఉంచుకోమని తల్లితో అంటాడు కళ్యాణ్. కావ్య సెలెక్ట్ చేసిన నగను అనామికకు ఇవ్వడానికి తీసుకెళతాడు.
తనకు పాయసం కావాలని రుద్రాణికి అర్డర్ వేస్తుంది స్వప్న. పాయసం చేయడం కుదరదని రుద్రాణి అనడంతో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. దాంతో స్వప్న కోసం పాయసం చేయడానికి రుద్రాణి కిచెన్‌లోకి వెళుతుంది.
అనామిక అనుమానం...
నీ కోసం కావ్య నగను సెలెక్ట్ చేసిందని అనామికకు చెబుతాడు కళ్యాణ్. ఆ మాట వినగానే అనామిక ఫైర్ అవుతుంది. మన మధ్యలోకి అప్పు, కావ్య ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావని కళ్యాణ్‌తో గొడవ పెట్టుకుంటుంది. శోభనం గదిలో నుంచి బయటకు వచ్చి హాల్‌లో పడుకుంటుంది. అది చూసి కావ్య వల్లే అనామిక, కళ్యాణ్‌లా శోభనం ఆగిపోయిందని ధాన్యలక్ష్మి గొడవ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్