తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kartik Aryan: కార్తీక్ ఆర్యన్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

Kartik Aryan: కార్తీక్ ఆర్యన్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

24 June 2022, 22:48 IST

google News
    • భూల్ భూలయ్యా 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ ఆర్యన్‌కు సదరు నిర్మాత ఓ కారు బహుకరించాడు. మె‌క్‌లారెన్ జీటీ అని పిలిచే ఈ వాహనం ఖరీదు వచ్చే రూ.4.7 కోట్లుగా అంచనా.
కార్తీక్ ఆర్యన్ కు కారు బహుమతి
కార్తీక్ ఆర్యన్ కు కారు బహుమతి (Twitter)

కార్తీక్ ఆర్యన్ కు కారు బహుమతి

వరుసగా బాలీవుడ్ చిత్రాలు ఫ్లాపులు అందుకుంటున్న వేళ.. కమర్షియల్ సినిమాలకు ఊసే ఎత్తని సమయంలో హిందీ దర్శక నిర్మాతలకు నూతన ఆశలను రేకెత్తించిన సినిమా భూల్ భూలాయా2. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.180 కోట్ల పైచిలుకు కలెక్షన్లను రాబట్టింది. సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఇప్పటి వరకు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

మెక్ లారెన్ జీటీ అనే స్పోర్ట్స్ కారును కార్తీక్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు భూషణ్. ఈ కారు ఖరీదు వచ్చేసి రూ.4.7 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా భారత్‌లో ఈ వాహనం సోంతం చేసుకున్న మొదటి యజమానిగా కార్తీక్ నిలిచాడు. తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు ఈ హీరో.

“కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. ప్రస్తుతం నేను ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్ జీటీ వాహనానికి ఓనర్‌ను. నెక్స్ట్ టైం ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి” సర్ అంటూ కారుతో దిగిన ఫొటోలను కార్తీక్ షేర్ చేశాడు.

కార్తీక్ ఆర్యన్ వద్ద కార్లు ఉండటం ఇదే కొత్త కాదు. ఇంతకుముందు మినీ కూపర్, లాంబోర్గినీ ఉరుస్ కార్లు ఉన్నాయి. 2018లో సోనూకీ ట్వీటుకీ స్వీటీ సినిమా ద్వారా భూషణ్ కుమార్, కార్తీక్ ఆర్యన్ మొదలైంది. ప్రస్తుతం వీరిద్దరూ భూల్ భూలయా2 విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ తెలుగులో సూపర్ హిట్టయిన అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్. ఇది కాకుండా షెహజాదా అనే సినిమా కూడా చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం