Neha Dhupia Comments on Love: 'వేగంగా ప్రేమలో పడ్డాను.. ఒకే వ్యక్తిని పదే పదే ప్రేమించాను'.. నేహా షాకింగ్ కామెంట్స్
24 September 2022, 9:41 IST
- Neha Dhupial Fall in Love Again and Again: బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తను యంగేజ్‌లో ఉన్నప్పుడు వేగంగా ప్రేమలో పడేదాన్నని, ఒకే వ్యక్తిని మూర్ఖంగా పదే పదే ప్రేమించానని చెప్పుకొచ్చింది.
నేహా దూపియా
Neha Dhupia Comments on love: బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా నటించిన షార్ట్ ఫిల్మ్ గుడ్ మార్నింగ్. జ్యోతి కపూర్ దర్శకత్వం వహించిన ఈ లఘుచిత్రం అమెజాన్ మినీ టీవీ వేదికగా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నేహా పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా ఈ సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబం, సినిమాలు రెండింటినీ మేనెజ్ చేసుకుంటుందో వివరించింది. అంతేకాకుండా పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో స్పష్టం చేసింది.
"తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడం, వారి జీవితాలను నియంత్రించడం మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించాలి. ఎందుకంటే మీ కలలను వారిపై రుద్దే ప్రయత్నం చేసినప్పుడు అంచనాలు పెరిగిపోతాయి. వీటిని తగ్గించుకోవాలి. పిల్లలు కూడా తమ సొంత కలలను కలిగి ఉండేలా ప్రోత్సహించాలి. పిల్లలను పెంచేటప్పుడు వారికి గొప్ప విలువలను అందించడం చాలా ముఖ్యం. నేను నా పిల్లలైన మెహర్, గురిక్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నాను" అంటూ నేహా దుపియా స్పష్టం చేసింది.
" పిల్లల పెంపెకం విషయంలో తల్లిదండ్రులకు ఉచిత సలహాలు ఇవ్వదలచుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ వంతూ బాధ్యతతో ఉంటున్నారు. కానీ విద్య విషయంలో అత్యుత్తమ పాఠశాలలకు పంపడం మనపై ఉంటుంది. అలాగే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వారిపై ఉంటుంది. మంచి పిల్లలను కనాలనే ఆశయం తప్ప మనకు ఏ ఆశయం ఉండదు." అని స్పష్టం చేసింది.
ప్రేమలో రెండో ఛాన్స్ ఉంటుందా అనే విషయంపై నేహా మాట్లాడుతూ.. గత అనుభవాల ద్వారా రెండో ఛాన్స్ ఉంటుందని, తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పింది. "నేను యంగేజ్‌లో ఉన్నప్పుడు ఇది జరిగింది. యవ్వనంలో ఉండటంలో గొప్ప విషయం ఏంటంటే మీరు కొన్నిసార్లు చాలా వేగంగా వ్యక్తులతో ప్రేమలో పడతారు. అంతేకాకుండా యంగేజ్‌లో ఉన్నప్పుడు పదే పదే అదే వ్యక్తిని మూర్ఖంగా ప్రేమిస్తారు. నేను ఈ రెండు పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 38 ఏళ్ల వయస్సులో అంగద్‌ను కలిశాను. అప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమంటే ఏంటో. అతడితో జీవితం అనుకుని వెంటనే వివాహం చేసుకున్నాను." అని నేహా దూపియా తెలిపింది.
టాపిక్