తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Kaushal: బిగ్ బాస్ విన్నర్ కౌశల్ హీరోగా మూవీ.. ఆ హిట్ మూవీకి రీమేక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రైట్'

Bigg Boss Kaushal: బిగ్ బాస్ విన్నర్ కౌశల్ హీరోగా మూవీ.. ఆ హిట్ మూవీకి రీమేక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రైట్'

Sanjiv Kumar HT Telugu

31 December 2023, 10:22 IST

  • Bigg Boss Kaushal Manda Right Movie: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా రైట్. దృశ్యం డైరెక్టర్ జీతూ జేసేఫ్ దర్శకత్వం వహించి మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీకి రీమేక్‌గా రైట్ సినిమాను తీసుకొస్తున్నారు.

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ హీరోగా మూవీ.. ఆ హిట్ మూవీకి రీమేక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రైట్'
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ హీరోగా మూవీ.. ఆ హిట్ మూవీకి రీమేక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రైట్'

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ హీరోగా మూవీ.. ఆ హిట్ మూవీకి రీమేక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రైట్'

Bigg Boss Winner Kaushal Right: బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌తో ఎవరూ అందుకోలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు కౌశల్ మండ. బిగ్ బాస్ తర్వాత అతడు ఆమె ప్రియుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కౌశల్ ఇప్పుడు రైట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కౌశల్ మండా, లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం రైట్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్‌లు సంయుక్తంగా రైట్‌ను రీమేక్ సినిమాగా నిర్మించారు.

డిసెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి మంచు మనోజ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని మంచు మనోజ్ తెలిపాడు.

"స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని" మంచు మనోజ్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే రైట్ మూవీ విడుదల చాలా సైలెంట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకున్న ప్రేక్షకుల్లోకి బాగా ప్రచారం చేయలేకపోయారని అనిపిస్తోంది. సలార్, డెవిల్ సినిమాల మధ్య కౌశల్ మండా రైట్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం