Sivaji: బిగ్ బాస్ శివాజీ హీరోగా ఓటీటీ సిరీస్ #90s.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్.. ఆసక్తిగా ట్రైలర్-hero shivaji 90s a middle class biopic web series trailer released and streaming on etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivaji: బిగ్ బాస్ శివాజీ హీరోగా ఓటీటీ సిరీస్ #90s.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్.. ఆసక్తిగా ట్రైలర్

Sivaji: బిగ్ బాస్ శివాజీ హీరోగా ఓటీటీ సిరీస్ #90s.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్.. ఆసక్తిగా ట్రైలర్

Sanjiv Kumar HT Telugu

Sivaji #90s Web Series Trailer: సీనియర్ హీరో, బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓటీటీ సిరీస్ #90s. తాజాగా #90s వెబ్ సిరీస్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో #90s ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.

బిగ్ బాస్ శివాజీ హీరోగా ఓటీటీ సిరీస్ #90s.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్.. ఆసక్తిగా ట్రైలర్

Bigg Boss 7 Telugu Sivaji #90s Web Series: చాలా కాలం గ్యాప్ తర్వాత ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శివాజీ. బిగ్ బాస్ 7 తెలుగు ద్వారా మొన్నటివరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన శివాజీ త్వరలో వెబ్ సిరీస్ #90s ద్వారా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్‌ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం #90s వెబ్ సిరీస్ ట్రైలర్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్.

#90s ట్రైలర్‌లో శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో ఆరంభమై ఆద్యంతం నవ్వులు పంచింది. శివాజీ లెక్కల మాస్టర్‌ చంద్రశేఖర్‌‌గా అలరించారు. శివాజీ కుటుంబం, ఇల్లు, స్కూల్‌లో పిల్లల అల్లరి .. ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ట్రైలర్‌లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి శివాజీని పలకరిస్తూ, ‘నేను సుచిత డేవిడ్‌ పాల్‌’ అంటే, కాస్త ఆలోచించిన శివాజీ ‘నాకు కేఏ పాల్ తెలుసు’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటూ శివాజీ చెప్పిన డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. అమ్మ పాత్రలో వాసుకి (పవన్ కల్యాణ్ తొలిప్రేమ ఫేమ్) ఆకట్టుకున్నారు. కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుని హత్తుకునేలా ట్రైలర్‌లో చూపించారు దర్శకుడు ఆదిత్య హాసన్.

90వ దశకం నాటి పరిస్థితులను ప్రతింబించేలా సినిమాటోగ్రఫీ, సెట్స్‌ను తీర్చిదిద్దిన విధానం, సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక #90s వెబ్ సిరీస్‌ను ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈటీవీ విన్ సిరీస్‌గా #90s రానుంది.