తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్.. A1 నిందితుడిగా రైతుబిడ్డ

Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్.. A1 నిందితుడిగా రైతుబిడ్డ

Sanjiv Kumar HT Telugu

20 December 2023, 6:02 IST

google News
  • Bigg Boss 7 Telugu Pallavi Prashanth: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన న్యూసెన్స్‌కు సంబంధించిన విషయంలో రైతుబిడ్డ ప్రశాంత్‌ను A1 నిందితుడిగా పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్.. A1 నిందితుడిగా రైతుబిడ్డ
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్.. A1 నిందితుడిగా రైతుబిడ్డ

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్.. A1 నిందితుడిగా రైతుబిడ్డ

Bigg Boss 7 Telugu Newsense: బిగ్ బాస్ 7 తెలుగు న్యూసెన్స్ ఇంకా కొనసాగుతోంది. బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. విజేతగా టైటిల్ అందుకున్న తర్వాత హైదారాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద రైతుబిడ్డ ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. రన్నరప్ అమర్ దీప్, కంటెస్టెంట్ అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్‌ కారుపై కూడా దాడి చేశారు.

దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేశాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విజేత ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వారిలో పల్లవి ప్రశాంత్ తమ్ముడు మనోహర్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీ తీసిన అతని తమ్ముడితోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను A1 నిందితుడిగా చేర్చిన పోలీసులు అతని తమ్ముడు మనోహర్‌ను A2గా, మరో స్నేహితుడిని A3గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.

ఈ ఇద్దరు పోలీసులు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసి పల్లవి ప్రశాంత్‌ ఇచ్చిన ఆదేశాలతో అతన్ని రెండోసారి అన్నపూర్ణ స్టూడియో వద్దకు ర్యాలీగా కారు తీసుకొచ్చారు. రోడ్డు మీద కార్లను ఆపడంతో అభిమానులు రెచ్చిపోయారు. దీంతో ఈ కేసులో వారిని కూడా నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇక విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇదివరకే పల్లవి ప్రశాంత్‌పై పలు కేసులు నమోదు చేస్తూ నోటీసులు పంపారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 147, 148, 149, 290, 353, 427 కింద పబ్లిక్ న్యూసెన్స్, లా అండ్ కంట్రోల్ కి కోపరేట్ చేయకపోవడం, రెచ్చగొట్టడం వంటి కేసులు బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం