Bigg Boss Telugu 7 Grand Finale TRP: అదరగొట్టిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. ఆల్ టైమ్ రికార్డ్!
29 December 2023, 23:24 IST
- Bigg Boss Telugu 7 Grand Finale TRP: బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. షో చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. ఆ వివరాలివే..
Bigg Boss Telugu 7 Grand Finale TRP: అదరగొట్టిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. ఆల్ టైమ్ రికార్డ్!
Bigg Boss Telugu 7 Grand Finale TRP: బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరిగింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ ఫినాలేను ఈ ఏడాది డిసెంబర్ 17న కళ్లు చెదిరేలా స్టార్ మా ఛానెల్ నిర్వహించింది. చాలా మంది గెస్టుల ఎంట్రీలు, సినీ భామల డ్యాన్స్ పర్ఫార్మెన్సులు, కంటెస్టెంట్ల కోలాహలం సహా చాలా స్పెషాలిటీలతో ఈ గ్రాండ్ ఫినాలే జరిగింది. చివరికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. కాగా, బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే టీఆర్పీ విషయంలో రికార్డు సృష్టించింది.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 21.7 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. బిగ్‌బాస్ తెలుగు హిస్టరీలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. గత ఆరు సీజన్లలో ఎప్పుడూ ఇంత టీఆర్పీ నమోదు కాలేదు. ఈ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కొత్త రికార్డు సృష్టించింది. గతం కంటే అత్యధిక ప్రేక్షకులు ఈ గ్రాండ్ ఫినాలే చూశారు. ఈ విషయాన్ని స్టార్ మా ట్వీట్ చేసింది.
“బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అద్భుతమైన 21.7 టీఆర్వీ పాయింట్లను సాధించింది. తిరుగులేని సక్సెస్ అయింది. గ్రాండెస్ట్ సెలెబ్రేషన్‌గా మార్చిన ప్రతీ ఒక్కరికి థాంక్యూ” అని స్టార్ మా పోస్ట్ చేసింది. హోస్ట్ నాగార్జున ఉన్న గ్రాండ్ ఫినాలే రికార్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజ్ రవితేజ, కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ప్రముఖ యాంకర్ సుమ సహా మరికొందరు గెస్టులుగా వచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్సులు అదిరిపోయాయి. చాలా ఎంటర్టైనింగ్ గ్రాండ్ ఫినాలే సాగింది. దీంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ ఫైనల్ టైటిల్‌ను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా అమర్ దీప్ చౌదరి నిలిచాడు. మూడో స్థానంలో శివాజీ, నాలుగో స్థానంలో యావర్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో స్థానంలో అంబటి అర్జున్ నిలిచారు.
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ సహా కంటెస్టెంట్లు బయటికి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. కంటెస్టెంట్ల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
పోలీసుల సూచనలు పాటించకుండా గొడవ పెరిగేందుకు కారణమయ్యాడన్న ఆరోపణలతో విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏకంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు బెయిల్‌పై బయటికి వచ్చారు.
టాపిక్