తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 First Episode: ఫస్ట్ డే రేవంత్, మరీనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ - ఫైమాకు శ్రీసత్య స్వీట్ వార్నింగ్

Bigg Boss 6 First Episode: ఫస్ట్ డే రేవంత్, మరీనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ - ఫైమాకు శ్రీసత్య స్వీట్ వార్నింగ్

HT Telugu Desk HT Telugu

05 September 2022, 6:25 IST

  • Bigg Boss 6 First Episode: బిగ్‌బాస్ తొలిరోజు గేమ్ లో రేవంత్, మరీనా హైలైట్ గా నిలిచారు. హౌజ్ లో అడుగుపెట్టడమే ఆలస్యం అందరితో కలిసిపోయి సరదాగా కనిపించారు. తొలిరోజు ఫైమాకు శ్రీసత్య సున్నితంగా వార్నింగ్ ఇస్తూ కనిపించింది. 

ఆదిరెడ్డి
ఆదిరెడ్డి (Twitter)

ఆదిరెడ్డి

Bigg Boss 6 First Episode: బిగ్‌బాస్ హౌజ్‌లో తొలిరోజు కంటెస్టెంట్స్ అంద‌రూ ఉత్సాహంగా క‌నిపించారు. హౌజ్‌కు అల‌వాటుప‌డ‌టానికి ఆదిరెడ్డి, ఫైమాతో పాటు మ‌రికొంద‌రు కంటెస్టెంట్స్ ఇబ్బందులు ప‌డ్డారు. కానీ రేవంత్‌, మ‌రీనా మాత్రం హౌజ్‌లో అడుగుపెట్ట‌డ‌మే ఆల‌స్యం అంద‌రితో క‌లిసిపోయారు. ముఖ్యంగా రేవంత్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రితో క‌లివిడిగా క‌నిపించారు.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

తొలిరోజు వంట బాధ్య‌త‌ను రేవంత్‌, మ‌రీనా తీసుకున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ‌రూ సాయం చేయ‌లేక‌పోయినా వారు మాత్రం త‌మ వంట ప‌నుల‌ను ఆప‌లేదు. వంట పూర్త‌య్యే త‌రుణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంద‌రికి బిర్యానీ పంపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. కంటెస్టెంట్స్ అంద‌రూ త‌మ ల‌గేజీ, బెడ్‌ల‌ను స‌ర్ధుకుంటూ క‌నిపిస్తే ఆదిరెడ్డి మాత్రం చాలా స‌మ‌యం పాటు సైలెంట్‌గానే కూర్చొని క‌నిపించాడు. అత‌డిని రేవంత్ రెండు, మూడు సార్లు ప‌ల‌క‌రించాడు.

సెకండ్ డే నుంచి గేమ్ మొద‌లుపెడ‌తాన‌ని, తానంటే ఏమిటో చూపిస్తానంటూ బిగ్‌బాస్ కెమెరాతో ఆదిరెడ్డి ముచ్చ‌టించాడు. అదే విష‌యాన్ని రేవంత్‌తో చెప్పాడు. తిథి, ముహుర్తాలు చూసుకొని మొద‌లుపెడ‌తావా అంటూ అత‌డిపై రేవంత్ సెటైర్స్ వేయ‌డం న‌వ్వుల‌ను పూయించింది. మొద‌టిరోజు ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా బిగ్‌బాస్ హౌజ్ ప్ర‌శాంతంగా గ‌డిచిపోయింది. శ్రీస‌త్య‌ను ఫైమా అక్కా అని పిలిచింది. త‌న‌ను పేరు పెట్టి పిల‌వాల‌ని, అక్కా అంటూ పిలిచి పెద్ద‌దాన్ని చేయోద్దంటూ ఫైమాను శ్రీస‌త్య సున్నితంగా హెచ్చ‌రించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం