తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

13 October 2024, 16:33 IST

google News
    • Oviya Video Leaked: తమిళ నటి ఓవియాకు సంబంధించిన ఓ వీడియో అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది. ఓవియా ప్రైవేట్ వీడియో అంటూ వైరల్ అవుతోంది. దీనిపై ఆమెనే స్పందించారు.
Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి
Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

బిగ్‍బాస్ తమిళ్ ఫేమ్, నటి ఓవియాకు సంబంధించిన శృంగార ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ క్లిప్ కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే, అది ఒరిజినల్ వీడియోనా.. లేకపోతే డీప్‍ఫేక్ చేసిన మార్ఫింగ్ వీడియోనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కూడా వాదనలు చేసుకున్నారు. మొత్తంగా ఈ లీకైన ప్రైవేట్ వీడియోపై ఓవియానే స్పందించారు.

లాంగ్ వీడియో అడిగిన నెటిజన్.. రియాక్షన్ ఇదే

ఓవియా తాజాగా తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటో కింద వైరల్ వీడియో గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. లీకైన క్లిప్‍కు సంబంధించిన లాంగ్ వీడియో కావాలని ఓ నెటిజన్ అడిగారు. దీనికి ఆగ్రహించకుండా కూల్‍గా సమాధానం చెప్పారు ఓవియా. “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ రిప్లే ఇచ్చారు. అంటే తర్వాతి సారి అంటూ రియాక్ట్ అయ్యారు.

“మీకు సంబంధించిన 17 సెకన్ల వీడియో లీకైంది మేడమ్” అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‍కు కూడా ఓవియా రియాక్ట్ అయ్యారు. “ఎంజాయ్” అంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో.. ఆ వీడియో తనకు సంబంధించిందే అని ఓవియా చెప్పేశారంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోను ఆమె ఖంచించకపోవడమే అందుకు కారణమని అంటున్నారు.  

కెరీర్ ఇలా..

ఓవియా ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలు చేశారు. తెలుగులోనూ ఇది నా లవ్ స్టోరీ (2018) చిత్రంలో నటించారు. 2007లో కంగారూ అనే మలయాళం చిత్రంతో తెరంగేట్రం చేశారు ఓవియా. మరో రెండు మలయాళ చిత్రాల తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తమిళ సినిమాలే ఎక్కువగా చేశారు. మరీనా, కళావాణి, కలకలప్పు, మధయానై కొట్టం సహా మరిన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవియాకు హెలెన్ నెల్సన్ అనే పేరు కూడా ఉంది.

బిగ్‍బాస్‍లోనూ వివాదం

బిగ్‍బాస్ తమిళ 1వ సీజన్‍లో ఓవియా కంటెస్టెంట్‍గా పాల్గొన్నారు. అయితే, ఓ దశలో ఆరవ్‍తో గొడవ పడ్డాక.. హౌస్‍లోని స్విమ్మింగ్ పూల్‍లో దూకేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఇది అప్పట్లో దుమారం రేగింది. బిగ్‍బాస్‍ నిర్వాహకులపై కేసు నమోదైంది. మొత్తంగా మానసిక ఆరోగ్యం కారణంగా షో నుంచి ఓవియా స్వయంగా ఎలిమినేట్ అయిపోయారు.

ఓవియా చివరగా యోగిబాబు మూవీ ‘బూమర్ అంకుల్’లో కనిపించారు. ప్రస్తుతం సంభవం, రాజా భీమా అనే రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం