తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu : అశ్వినీపై గీతూ ప్రశ్నల వర్షం.. ఇక్కడా తట్టుకోలేక పోయిన బ్యూటీ

Bigg Boss 7 Telugu : అశ్వినీపై గీతూ ప్రశ్నల వర్షం.. ఇక్కడా తట్టుకోలేక పోయిన బ్యూటీ

Anand Sai HT Telugu

27 November 2023, 6:48 IST

google News
    • Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు చివరి దశకు వచ్చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్‍లో అశ్వినీ, రతిక బయటకు వచ్చేశారు.
అశ్వినీ
అశ్వినీ (Star Maa)

అశ్వినీ

బిగ్ బాస్ 7 తెలుగు(Bigg Boss 7 Telugu) తాజా ఎపిసోడ్లో అశ్వినీ, రతిక బయటకు వచ్చారు. వెళ్తూ వెళ్తూ.. హౌస్ మేట్స్ మీద తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ అయినా కూడా అంత ఆసక్తిగా మాత్రం లేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రోమోల్లోనే అసలు విషయం చెప్పేస్తుండటం కూడా దీనికి ఓ కారణం. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో లీకులు కూడా వస్తుండటంతో షో ఆసక్తిగా సాగడం లేదు.

తాజా ఎపిసోడ్లో అశ్వినీ, రతిక బయటకు వచ్చేయడం, చిన్న చిన్న టాస్కులు పెట్టడం మాత్రమే జరిగింది. పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్‍లో పాల్గొన్నారు రతిక, అశ్వినీ. ఈ సందర్భంగా గీతూ కొన్ని ప్రశ్నలు సూటిగా అడిగింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టింది అశ్వినీ. ఆమె పెద్దగా ఆటపై మాత్రం దృష్టి పెట్టలేదు. అందంగా కనిపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా ఏడుపులు మాత్రమే వినిపించాయి. చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయ్యేది. దీంతో ప్రేక్షకులకు విసుగు వచ్చింది.. బయటకు పంపించేశారు. మెుదట్లో ప్రశాంత్‍కు దగ్గరగా ఉండేది.. చివరికి వచ్చేసరికి దూరమైంది.

మిమ్మల్ని మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసుకున్నారా అని గీతూ అడిగింది. బిగ్ బాస్ హౌస్ లో రెండు గ్రూపులు ఉన్నాయని, తాను ఒక్కదాన్ని అయిపోయానని ఇక్కడ నుంచి వెళ్లిపోతే బాగుండు అనిపించిందని చెప్పుకొచ్చింది అశ్వినీ. ఏం చేసినా టార్గెట్ చేస్తున్నారని చెప్పగా.. మీరు ఏమైనా సెంటర్ ఆఫ్ యూనివర్స్ అనుకుంటున్నారా అని సెటైర్ వేసింది గీతూ.

మీరు సింపతీ గేమ్ ఆడేందుకు ట్రై చేస్తారని ప్రేక్షకులకు అనిపించిందని చెప్పగా.. నేను ప్రతీ దానికి ఏడ్చే రకాన్ని కాదని సమాధానమిచ్చింది. కానీ మాకు మీరు ఆడిన ఆట చూస్తే అలాగే అనిపించిందని గీతూ కౌంటర్ ఇచ్చింది. మీరు ఏం చేశారో అదే బయటకు వచ్చిందని చెప్పింది.

తర్వాత అశ్వినీ మీద సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూపించింది. అశ్వినీ పల్లవి ప్రశాంత్‍కు సపోర్ట్ చేయలేదు, భజన చేసిందనే కామెంట్ చూపించగా.. ఏం భజన చేశానని అశ్వినీ అడిగింది. ప్రశాంత్ తోపు అంటూ చేసిన కామెంట్స్ గీతూ గుర్తు చేసింది. అసలు అశ్వినీ బిగ్ బాస్ కు ఎందుకు వచ్చిందోనని మరో కామెంట్ కూడా చూపించింది. దీంతో ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానని చెప్పింది అశ్వినీ. ఈ చిన్న విషయాన్ని తట్టుకోలేకపోతే.. బిగ్ బాస్ కు ఎందుకు వచ్చారని అడిగింది గీతు. ఏం చేస్తున్నాననో వాళ్లకు ఎందుకు అని అడగ్గా.. వాళ్లే కదా ఓటు వేసేది అని గీతు కౌంటర్ ఇచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం