Bigg Boss 7 Telugu : రాహుల్ సిప్లిగంజ్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక బ్రేకప్.. బయటపెట్టిన పెద్దయ్య
08 September 2023, 7:06 IST
Bigg Boss 7 Telugu Rathika Rose: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ రతిక రోజ్. టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‍తో ఆమెకు బ్రేకప్ అయినట్లుగా తాజాగా బయటపెట్టేశాడు పెద్దయ్య.
రాహుల్ సిప్లిగంజ్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక బ్రేకప్
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వారిలో అందమైన ముద్దుగుమ్మ రతిక రోజ్ ఒకరు. పటాస్ ప్రియ అయిన ఈ బ్యూటిఫుల్ బిగ్ బాస్ కోసం రతిక రోజ్‍గా మారింది. హౌజ్‍లోకి అడుగుపెట్టిన రతకి మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్‍గా ఉంటూ అలరిస్తోంది. పాటలు పాడుతూ, పల్లవి ప్రశాంత్‍తో చనువుగా ఉంటూ సందడి చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 7వ తేది ఎపిసోడ్‍లో టీచర్స్ డే సందర్భంగా గురువులపై కాకుండా స్టూడెంట్స్ కోసం పాట పాడాలని చెప్పింది రతిక.
కాఫీ ఎలా ఉంది
రతిక పాట పాడదామన్నందుకు బిగ్ బాస్ సెటైర్లు వేశాడు. అనంతరం కొద్దిసేపటకి ఫన్ యాక్టివిటి గదిలోకి రతికను రమ్మన్నాడు బిగ్ బాస్. దీంతో రూమ్‍లోకి వెళ్లిన రతికకు టేబుల్‍పై కాఫీ కనిపించడంతో తెగ సంబరపడిపోయింది. రతిక రా.. కూర్చో మాట్లాడుకుందాం అని బిగ్ బాస్ అన్నాడు. రతిక కాఫీ తాగింది. కాఫీ ఎలా ఉంది అని బిగ్ బాస్ అంటే.. చాలా బాగుంది పెద్దయ్య (బిగ్ బాస్) అని చెప్పింది. ఎవరినైనా మిస్ అవుతున్నావా అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో కన్నీళ్లతో ఎమోషనల్ అయింది రతిక.
ఏమైనా పాట పాడిండా?
"మిస్ అయ్యావా అని అడిగితే.. ఎవరైనా ఫస్ట్ పెరేంట్స్ అని చెబుతారు. కానీ పేరెంట్స్ దగ్గరున్నప్పుడు కూడా కూడా ఎవర్నైనా మిస్ అవుతాం అంటే ఆ పర్సనే (ఎక్స్ బాయ్ ఫ్రెండ్)" అని కన్నీళ్లు పెట్టుకుంది రతిక. "మీరు ఇప్పటి వరకు చాలా పాటలు వినిపించారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ మీకోసం పాట వినిపించాలనుకుంటున్నారు" అని పెద్దయ్య అన్నాడు. దానికి "ఏమైనా పాట పాడిండా. నాకోసం" అని రతిక అంది. అప్పుడు "ఉడతా ఉడతా ఊచ్" అనే పాటను ప్లే చేశాడు బిగ్ బాస్. కానీ, ఇదే సెప్టెంబర్ 7వ తేది ప్రోమోలో మాత్రం "పిల్లా.. పిల్లా.. ఆ భూలోకం దాదాపు కన్నుమూయు వేళ" పాటను వేసి చూపించారు.
పాట పాడాలా?
ఈ పాటను బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‍లో రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. అప్పట్లో పునర్నవి భూపాలం కోసం రాహుల్ ఈ పాట పాడాడు. ఇలా రతిక లవర్ రాహుల్ సిప్లిగంజ్ అని బిగ్ బాస్ హింట్ ఇచ్చేశాడు. ఇదే కాకుండా రతిక ఎంట్రీ రోజున కూడా "హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చేశావా" అని నాగార్జున అడిగాడు. "హా.. చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో" అని నాగార్జునను రతిక అంది. "నేనేం చేశాను" అని నాగార్జున అంటే.. "మొత్తం మీరే చేశారు" అని రతిక అంది. అంతేకాకుండా నాగార్జున "నువ్ బాగా ఇమిటేట్ చేస్తావట కదా. నీ హార్ట్ బ్రేక్ చేసినవాడిని ఇమిటేట్ చేయని" అంటే.. "ఇప్పుడు పాట పాడాలా" అని రతిక అంది. ఈ కన్వర్జేషన్, ప్రోమోలను బట్టి చూస్తే రతిక మాజీ లవర్ రాహుల్ అని తెలుస్తోంది.