Bigg Boss 7 Telugu: రతిక వీడియో లీక్.. బండారం బయటపెట్టిన పెద్దయ్య.. వణికిపోయిన కంటెస్టెంట్లు
20 September 2023, 7:26 IST
Bigg Boss 7 Telugu Rathika Prince: ప్రతి సీజన్‍లో కన్నింగ్ అండ్ కంత్రీలు ఉన్నట్లే ఈ బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో కూడా ఒకరు ఉన్నారని ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు అర్థం అయింది. అయితే తాజాగా ఆ కన్నింగ్ కంటెస్టెంట్‍ను కంటెస్టెంట్లకు చూపించాడు పెద్దయ్య.
బిగ్ బాస్ 7 తెలుగు రతిక వీడియో లీక్.. బండారం బయటపెట్టిన పెద్దయ్య
Bigg Boss 7 Telugu September 19th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో ఆట సందీప్, హీరో శివాజీ ఇద్దరూ పర్మనెంట్ ఇంటి సభ్యులు అయ్యారు. ఐదు వారాల ఇమ్మునిటీతో ఆట సందీప్ మొదటి పవరాస్త్ర గెలుచుకుంటే.. 4 వారాల ఇమ్యునిటీతో శివాజీ రెండో పవరాస్త్రను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 19వ తేది డే 17 ఎపిసోడ్‍లో మూడు వారాల ఇమ్యునిటీ గల 3వ పవరాస్త్ర గురుంచి చెప్పాడు బిగ్ బాస్. మూడో పవరాస్త్ర కోసం ముగ్గురు కంటెండర్స్ ను స్వయంగా బిగ్ బాసే సెలెక్ట్ చేశాడు.
అనర్హులు ఎవరు?
బిగ్ బాస్ 7 తెలుగు మూడో పవరాస్త్ర కోసం పోటీ పడే ముగ్గురు కంటెస్టెంట్స్ అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ అని పెద్దయ్య తెలిపాడు. దీంతో ఈ ముగ్గురు తెగ సంబరపడిపోయారు. నీకు పవరాస్త్ర వస్తే ఐ ఫీల్ హ్యాపీ అని యావర్‍తో రతిక చెప్పింది. తనను సెలెక్ట్ చేయనందుకు పల్లవి ప్రశాంత్ తెగ ఏడ్చేశాడు. అనంతరం ఒక్కో కంటెస్టంట్‍ను పిలిచి తాను సెలెక్ట్ చేసిన ముగ్గురిలో అర్హులు కానీ వారు ఎవరో చెప్పాల్సిందిగా అడిగాడు బిగ్ బాస్.
వీడియోలు లీక్
శోభా శెట్టి పేర్లను పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ రాయగురు నలుగురు చెప్పారు. అయితే ప్రియాంక జైన్.. అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది. ఇక ప్రిన్స్య యావర్ అనర్హుడు అని టేస్టీ తేజా, సింగర్ దామిని, రతిక రోజ్ చెప్పింది. వాళ్లు కన్ఫెషన్ రూమ్‍లో అనర్హుల గురించి చెప్పిన వీడియోను ఇంటి సభ్యులకు చూపించాడు బిగ్ బాస్. అందులో ప్రిన్స్ యావర్ అనర్హుడు అని చెప్పిన టేస్టీ తేజ, దామిని, రతిక వీడియోలను ప్లే చేశారు.
భయంతో కంటెస్టెంట్స్
అప్పటివరకు తనకు సపోర్ట్ గా నిలిచిన రతిక రోజ్ తనకు వ్యతిరేకంగా చెప్పడంతో ప్రిన్స్ తీసుకోలేకపోయాడు. తనను గుడ్ హార్ట్ అంటూ మెచ్చుకున్న యావర్‍కు రతిక బండారం బయటపెట్టి మబ్బులు తీసేసాడు పెద్దయ్య బిగ్ బాస్. దీంతో తెగ బాధపడుతూ సైకోలా బిహేవ్ చేశాడు ప్రిన్స్. స్మోక్ చేస్తూ.. స్మోకింగ్ యాస్ట్రే, టేబుల్‍ను గట్టిగా కొడుతూ విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో శోభా శెట్టి, ప్రియాంక, దామిని, తేజ ఇతర కంటెస్టెంట్స్ భయంతో వణికిపోయారు. ఇదంతా చూసి నేనేమైనా తప్పు చేశానా అని రతిక మళ్లీ ప్లేట్ తిప్పాలని చూసింది.
నువ్ చేసిందే బాధగా ఉంది
అంతకుముదు కూడా హౌజ్‍లో రతిక.. రతిక.. అంటూ తనను అనర్హుడు అందని గట్టిగా అరిచాడు. ప్రిన్స్ చేసే పనులుకు ఒక్కసారిగా హడలిపోయారు. ఇందుకే అనర్హులం అన్నామని దామిని చెప్పుకొచ్చింది. తర్వాత గ్లాస్ పగిలిపోతుంది అని శోభా శెట్టి ఆపే ప్రయత్నం చేసింది. దీని తర్వాత నీ నెక్ట్స్ మూవ్ ఏంటీ అనేదే చూస్తారు అని ప్రియాంక నచ్చజెప్పింది. అనంతరం కొద్దిగా కోలుకున్న ప్రిన్స్ కిచెన్‍లో.. మీ ఇద్దరూ చేసిందానికి బాధలేదు.. కానీ, రతిక.. నువ్ చేసింది చాలా హర్ట్ గా ఉంది అని మరోసారి బాధను వ్యక్తం చేశాడు.