తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Sivaji: నా రెండో పెళ్లాన్ని వదిలేసి వచ్చా.. భార్యాపిల్లల గురించి నిజం చెప్పిన హీరో శివాజీ

Actor Sivaji: నా రెండో పెళ్లాన్ని వదిలేసి వచ్చా.. భార్యాపిల్లల గురించి నిజం చెప్పిన హీరో శివాజీ

Sanjiv Kumar HT Telugu

07 October 2023, 6:41 IST

google News
  • Bigg Boss 7 Telugu Sivaji: బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 6వ తేది ఎపిసోడ్‌లో ఫైనల్ కంటెండర్ టాస్క్ కొనసాగింది. చిటీ ఆయిరే టాస్కులో సందీప్, అమర్ జోడీ తర్వాత శివాజీ, ప్రశాంత్ పాల్గొన్నారు. అప్పుడే తన భార్యాపిల్లల గురించి చెప్పాడు హీరో శివాజీ.

బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 6వ తేది ఎపిసోడ్‌ హైలెట్స్
బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 6వ తేది ఎపిసోడ్‌ హైలెట్స్

బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 6వ తేది ఎపిసోడ్‌ హైలెట్స్

Bigg Boss 7 Telugu October 6th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే ఇద్దరు సభ్యులతో 5 జంటలు పాల్గొన్నాయి. వారి నుంచి కెప్టెన్సీ చివరి కంటెండర్ టాస్క్ చిటీ ఆయిరే పోటీలో నాలుగు జంటలు పాల్గొన్నాయి. గురువారం నాటి ఎపిసోడ్‌లో శుభ లెటర్ త్యాగం చేసి గౌతమ్‌కి, యావర్ త్యాగం చేసి తేజకు ఇచ్చారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఆట సందీప్-అమర్, శివాజీ-ప్రశాంత్ పెయిర్స్ పాల్గొన్నాయి.

ఒక్కసారిగా ఎనర్జీ

ఆట సందీప్ అమ్మ హెల్త్ బాలేదని చెప్పడంతో తన భార్య నుంచి వచ్చిన లెటర్‌ను త్యాగం చేశాడు అమర్ దీప్. దీంతో సందీప్ కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. వీరి తర్వాత శివాజీ, ప్రశాంత్ యాక్టివిటీ గదిలోకి వెళ్లారు. అక్కడ శివాజీ కోసం కాఫీతోపాటు భార్య పంపిన లెటర్ ఉంది. అలాగే ప్రశాంత్ అమ్మనాన్నల నుంచి వచ్చిన లెటర్ ఉంది. ఎప్పటి నుంచో కాఫీ అడుగుతున్న శివాజీకి అక్కడ అది చూడగానే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చింది.

నాకు ఇది చాలు

అబ్బా ఓరి నీయవ్వా.. థ్యాంక్స్ బిగ్ బాస్ కాఫీ ఇచ్చినందుకు అని చెప్పిన శివాజీ ఒక సిప్ వేశాడు. తర్వాత ఎమోషనల్ డ్రామాలేం వద్దురా. కుల్లా కుల్లా చెబుతున్నా. నీకు కెప్టెన్సీ ఇచ్చేద్దామని అనుకున్నా. చివర్లో మనకు పడితే నీకే ఇచ్చేద్దామనుకున్నా. కామన్ మ్యాన్ ఈడదాకా తీసుకువచ్చాడంటే గెలవాల్సిందే. నీకు అప్పుడే జెప్పినా కదా ఇస్తా అని. నాకు కాఫీ ఇచ్చాడుగా చాలు. కంటెండర్ ఇక ఏం వద్దు. నువ్వు కంటెండర్ అవ్వు అని శివాజీ అన్నాడు.

నా పెళ్లం అర్థం చేసుకుంటది

కామన్ మ్యాన్‌గా వచ్చినవ్. వచ్చినప్పుడు హగ్ ఇచ్చినవ్. నీతోటి ఎవరూ మాట్లాడట్లేదు అన్నవ్. నీకు నేనున్నా బిడ్డా అన్నా. ఆడు.. దున్ను.. కానీ, నీ లైన్‌లో.. లైన్ దాటకుండా ఆడు. నేను నా కొడుకుతో పందెం కట్టి వచ్చాను అంతే. అయినా నాకు గివప్ చేయడం ఇష్టం లేదు. కానీ, గివప్ ఇచ్చి నువ్వు గెలవాలని నీ వెనకాల నిలబడుతున్నాను. నా పెళ్లాం అర్థం చేసుకుంటది. నేను తనను బాగా చూసుకున్నానో లేదో గానీ, తనైతే నన్ను దునియా చూసుకుంది అని శివాజీ చెప్పుకొచ్చాడు.

వదిలేసి వచ్చా

నా పెళ్లాన్ని, కొడుకుని వదిలేసి వచ్చా. ముఖ్యంగా కాఫీని వదిలేసి వచ్చా. ఈ కాఫీ నా రెండో పెళ్లాం. నేను నీకన్నా పెద్దవాన్నిగా. నాకు తెలుసు. ఏం చేయాలో. లెటర్‌లో ఏముంటదో కూడా తెలుసు అని తన భార్యాపిల్లల గురించి తెలిపాడు శివాజీ. తర్వాత తనకు వచ్చిన లెటర్‌ను క్రష్ చేశాడు శివాజీ. ప్రశాంత్‌ను తన లెటర్ చదువుకోమ్మన్నాడు. ఎలాంటి పిచ్చి పనులు (తన లెటర్ కూడా క్రష్ చేయడం) చేయొద్దు. నా మీద ఒట్టే అని శివాజీ చెప్పాడు. తర్వాత ప్రశాంత్ తనకు వచ్చిన లెటర్ చదివి చాలా ఎమోషనల్ అయ్యాడు.

తదుపరి వ్యాసం