Amardeep Chowdary: అమ్మాయిపై అమర్‌దీప్ వేధింపులు.. ఆమె షర్ట్ బలవంతంగా విప్పేస్తూ ఘోరం.. బిగ్ బాస్ హెచ్చరించిన వినకుండా!
12 October 2023, 7:44 IST
Bigg Boss 7 Telugu Amardeep Chowdary: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 2.0లో ఆటగాళ్లు, పోటుగాళ్లకు మధ్య టాస్కులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అమ్మాయితో అమర్ దీప్ ఊహించని విధంగా ప్రవర్తించాడు. బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్ హైలెట్స్
Bigg Boss 7 Telugu Day 38 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ గేమ్ పరంగా చాలా నెగెటివిటీ తెచ్చుకున్నాడు. గత రెండు రోజులుగా అతనిపై కోపం కంటే జాలి వేసేలా మరి ప్రవర్తించాడు. కాని, అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌లో మాత్రం హౌజ్‌మేట్సే కాదు ప్రేక్షకులు సైతం మండిపోయేలా బిహేవ్ చేశాడు. దీంతో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ తెలుగు 7లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. వారిని పోటుగాళ్లుగా, పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్. వారికి టాస్కులు నిర్వహిస్తున్న బిగ్ బాస్ గత ఎపిసోడ్‌లో ఎవరు ఫాస్టెస్ట్ అనే పోటీ పెట్టాడు. దాంట్లో బిగ్ బాస్ చెప్పిన కలర్ వస్తువును రెండు గ్రూపు సభ్యుల నుంచి ముందుగా ఎవరు తీసుకువస్తారో వారికి పాయింట్స్ వస్తాయి. ఈ క్రమంలో ఆటగాళ్ల నుంచి అమర్, పోటుగాళ్ల నుంచి హాట్ బ్యూటి అశ్విని శ్రీ పాల్గొన్నారు.
బిగ్ బాస్ మెరూన్ కలర్ చెప్పాడు. దీంతో ఇద్దరూ హౌజ్ లోపలికి పరిగెత్తారు. అయితే అమర్ వస్తువును వెతికి తీసుకురావడానికి బదులు అశ్విని పట్టుకున్న వస్తువును లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె ఎదో డోర్ మ్యాట్ తీస్తుంటే వెళ్లి అశ్విని మీద పడిపోయాడు. బెడ్‌పై ఆమె అటు ఇటు తిరిగినా ఏమాత్రం ఆగకుండా లాక్కొచ్చి బయట పెట్టాడు. అది మెరూన్ కలర్ కాదనేసరికి మళ్లీ లోపలకి వెళ్లారు. మళ్లీ అశ్వినీ ఏదో తెస్తుంటే బెడ్‌పై ఆమెను తోసేసి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.
అంతేకాకుండా మెరూన్ కలర్ షర్టును అమర్ తీసుకోకుండా అశ్విని వేసుకుంది. అయినా కానీ, దాన్ని బలవంతగా విప్పే ప్రయత్నం చేశాడు అమర్. ఓవైపు అది కరెక్ట్ కాదని గౌతమ్, సందీప్ అరుస్తున్నా పట్టించుకోలేదు. గేట్ నుంచి బయటకు రాకుండా అశ్వినిని అడ్డుకున్నాడు అమర్. అలా ఆపకూడదు అని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన కూడా అమర్ కొంతసేపు అలాగే అశ్వినిని బంధించాడు. అదంతా చూసిన సింగర్ భోలే ఏంటీ ఈ హరాస్ మెంట్ (వేధింపులు) అని అసహనం వ్యక్తం చేశాడు.