Bigg Boss 7 Telugu Elimination: మొదటి వారంలోనే ఆ హీరోయిన్ ఎలిమినేట్.. టాప్‍లో కామన్ మ్యాన్
10 September 2023, 6:13 IST
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మొదటి రోజు నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ ప్రారంభమై మొదటి వారం పూర్తి కావొస్తుంది. ఇక వీకెండ్ వచ్చిందంటే.. కంటెస్టెంట్లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. మరి ఈ మొదటి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే..
బిగ్ బాస్ 7 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారందరూ ప్రస్తుతానికి ఇంటి సభ్యులు కాదని, కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని ఇది వరకే బిగ్ బాస్ చెప్పారు. ఇక బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్‍లో నాగార్జున వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేశారు. కంటెస్టెంట్స్ తమకు తాము ఇచ్చుకున్న పర్ఫామెన్స్ స్కోరు.. ఆడియెన్స్ ఇచ్చిన మార్కులకు ఎంత తేడా ఉంది వంటి విషయాలను చర్చించారు. హౌజ్‍లో జరిగిన అంశాలపై మాట్లాడారు.
ఇక బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 9 తేది ఎపిసోడ్‍లో ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారని నాగార్జున చెప్పారు. ఇప్పుడు ఆ విషయం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‍లో ముగిసిన నామినేషన్లలో మొత్తం 8 మంది ఉన్నారు. నామినేషన్స్ లో రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల ఉన్నారు. వీరందరికీ అదే రోజు నుంచి ఆడియెన్స్ ఓటింగ్ వేయడం ప్రారంభించారు. వారిలో రైతు బిడ్డగా, కామన్ మ్యాన్‍గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ అధిక ఓట్లతో టాప్‍లో ఉన్నాడు.
ఆడియెన్స్ నుంచి నమోదైన ఓట్ల ప్రకారం రెండో స్థానంలో రతిక రోజ్, మూడో స్థానంలో శోభా శెట్టి, నాలుగో ప్లేసులో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో షకీలా, ఆరో స్థానంలో ప్రిన్స్ యావర్, 7వ స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా అందరికంటే చివరిగా 8వ ప్లేసులో కిరణ్ రాథోడ్ ఉంది. అంటే ప్రస్తుతానికి ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్‍లో ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ 7 తెలుగు మొదటి వారంలో ఎలిమినేషన్ ఉంటే.. చివరిగా ఉన్న కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‍గా చేసిన కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ హౌజ్‍లో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుగు నేర్చుకుంటుంది. కానీ, ఈ వారం మొత్తం ఆమె అంతగా ఆకట్టుకోలేదు. టాస్కుల్లో కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అందుకే ఆమెకు ఆడియెన్స్ అతి తక్కువగా ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి.. ఎలిమినేషన్ లేకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంది.