తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Strong Weak Contestants: రేవంత్‌, శ్రీహాన్‌కు గ‌ట్టి పోటీ ఇస్తోన్నఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu Strong Weak Contestants: రేవంత్‌, శ్రీహాన్‌కు గ‌ట్టి పోటీ ఇస్తోన్నఆదిరెడ్డి

07 November 2022, 19:37 IST

google News
  • Bigg Boss 6 Telugu Strong Weak Contestants: బిగ్‌బాస్ 6 తెలుగు సీజ‌న్ తొమ్మిది వారాలు పూర్తిచేసుకొని ప‌దో వారంలో అడుగుపెట్టింది. ఆరంభంలో అనాస‌క్తిగా సాగిన ఆట ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న‌వారిలో ఫైన‌ల్ చేరే అవ‌కాశం ఉన్న కంటెస్టెంట్స్ ఎవ‌రంటే...

ఆదిరెడ్డి
ఆదిరెడ్డి

ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu Strong Weak Contestants: బిగ్‌బాస్ 6 తెలుగు తొమ్మిది వారాల‌ను పూర్తి చేసుకొని ప‌దో వారంలోకి ఎంట‌రైంది. ఈ వారం గీతూను ఎలిమినేట్ చేసి కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్‌ షాక్ ఇచ్చాడు. బిగ్‌బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా గీతూ పేరు బ‌లంగా వినిపించింది. ఫైన‌ల్స్‌కు ఆమె చేరుకోవ‌డం ప‌క్కా అనుకున్నారు.

కానీ ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో యాక్టివ్‌గా పాల్గొన‌క‌పోవ‌డం గీతూకు మైన‌స్‌గా మారింది. తొమ్మిదో వారంలో హౌజ్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యింది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో గీతూ కంటే రోహిత్ - మ‌రీనా, కీర్తి, వాసంతి, రాజ్ ఏమంత గొప్ప‌గా గేమ్ ఆడ‌టం లేదు. కానీ వారిని కాద‌ని గీతూను ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్‌. తొలి వారం నుంచి మిగిలిన హౌజ్‌మేట్స్‌కు గ‌ట్టిపోటీ ఇస్తూ వ‌చ్చింది గీతూ. కానీ గ‌త రెండు వారాల్లో మైండ్ గేమ్ ఆడ‌టానికి ట్రై చేసి దెబ్బ‌తిన్న‌ది.

బిగ్‌బాస్ రూల్స్‌కు విరుద్దంగా రాంగ్ గేమ్స్ ఆడుతూ ఫిజిక‌ల్ టాస్క్‌ల‌ను గంద‌ర‌గోళం చేసేసింది. మిష‌న్ ఇంపాజిబుల్‌, ఫిష్ టాస్క్‌ల‌లో ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరుకు నాగార్జున గ‌ట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. చివ‌ర‌కు త‌న త‌ప్పుల‌కు త‌గిన మూల్యం చెల్లించుకొని హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న వారిలో రోహిత్ ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో బాగానే ఆడుతున్నా అత‌డి గేమ్‌లో స్ట్రాట‌జీ ఉండ‌టం లేదు. త‌న బ‌లంతోనే గెల‌వాల‌ని ప్ర‌య‌త్నించి దెబ్బ‌తింటున్నాడు. అత‌డి వైఫ్‌ మ‌రీనా పూర్తిగా తేలిపోతుంది. వారిద్ద‌రు క‌లిసి స‌రిగా ఆడ‌లేదు. దాంతో బిగ్‌బాస్ వారిని వేరు చేశాడు.

రోహిత్‌కు దూర‌మైన త‌ర్వాత మ‌రీనా ఆట మ‌రింద దిగ‌జారింది. కీర్తి, వాసంతి కూడా స్ట్రాట‌జిక్‌గా గేమ్ ఆడ‌టంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌తిసారి ల‌క్‌తో బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఫిమేల్ కంటెస్టెంట్స్‌లో ఇనాయా, శ్రీస‌త్య మాత్ర‌మే గేమ్ ప‌ట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీహాన్‌, శ్రీస‌త్య‌ల‌ను టార్గెట్ చేస్తూ ఇనాయా చేసిన ర‌చ్చ కొన్ని సార్లు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ క్ర‌మంలో కొన్ని సార్లు హ‌ద్దులు దాటింది. బ్యాట‌న్ టాస్క్‌లో నోరు జారి అందుకు మూల్యం చెల్లించుకుంది.

శ్రీస‌త్య ఈ వార‌మే మొద‌టిసారి కెప్టెన్ అయ్యింది. ఆమె బిగ్‌బాస్‌లో కొన‌సాగుతుందా లేదా అన్న‌ది ఈ వారం ఆమె కెప్టెన్సీపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఫైమా అటూ ఫిజిక‌ల్ టాస్క్‌ల‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతోంది. ఇక రేవంత్, శ్రీహాన్ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీ సాగుతోంది.

శ్రీహాన్ మాత్రం తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఎక్క‌డ త‌గ్గాలో, ఎక్క‌డ నెగ్గాలో అత‌డికి బాగా తెలుసు కాబ‌ట్టే అందుకు త‌గ్గ‌ట్లుగా గేమ్‌ను ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ రేవంత్‌లో కోప‌మే అత‌డికి శ‌త్రువుగా మారుతోంది. ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో అత‌డు చాలా అగ్రెసివ్‌గా మారిపోతున్నాడు. తొమ్మిది వారాలైనా అత‌డిలో మార్పు క‌నిపించ‌డం లేదు. అదే అత‌డికి మైన‌స్‌గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మ‌రోవైపు బాలాదిత్య‌, రాజ్ ఆట‌తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మంచిత‌నం అనే ట్యాగ్‌తో తొమ్మిది వారాలు నెట్టుకొచ్చాడు బాలాదిత్య‌. కానీ ఇక‌పై కూడా ఆ ట్యాగ్ అత‌డికి ముందుకు న‌డిపిస్తుందా లేదా చూడాలి. ఎలాంటి అంచ‌నాలు కామ‌న్ మ్యాన్‌గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి కూడా త‌న ఆట‌తీరుతో బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాడు.

త‌ప్పొప్పుల విష‌యంలో నిర్మొహ‌మాటంగా ఉండ‌టం అత‌డికి క‌లిసివ‌స్తోంది. హౌజ్‌లో త‌న క్లోజ్ ఫ్రెండ్ గీతూ త‌ప్పు చేసిన‌ప్పుడు ఆమెను స‌మ‌ర్థించ‌కుండా వ్య‌తిరేకించి బిగ్‌బాస్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. అత‌డు కూడా ఫైన‌ల్‌కు చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తదుపరి వ్యాసం