Bigg Boss 6 Telugu 60 Episode: ఇనాయాకు శ్రీహాన్ వార్నింగ్ - గీతూకు క్షమాపణలు చెప్పిన బాలాదిత్య
03 November 2022, 8:12 IST
Bigg Boss 6 Telugu 60 Episode: బిగ్‌బాస్ 60వ ఎపిసోడ్ హౌజ్‌మేట్స్ గొడవలతో రచ్చరచ్చగా మారింది. శ్రీహాన్‌తో ఇనాయా పదే పదే గొడవపడుతూ కనిపించింది. మరోవైపు బాలాదిత్యను గీతూ ఏడిపించింది.
ఇనాయా
Bigg Boss 6 Telugu 60 Episode: శ్రీహాన్, ఇనాయా గొడవలతో బుధవారం బిగ్‌బాస్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సిగరెట్లు దాచేసి బాలాదిత్యను ఏడిపించింది గీతు. అంతుకుముందు బ్యాటన్ టాస్క్‌లో శ్రీహాన్, రేవంత్, ఫైమా ఒక టీమ్‌గా ఇనాయా, మరీనా, వాసంతి మరో టీమ్ నుంచి పోటీపడ్డారు. ఇందులో రెడ్ టీమ్ విజయాన్ని సాధించింది.
ఈ గేమ్‌లో అగ్రెసివ్‌గా మారిన రేవంత్ బ్యాటన్‌తో మరీనా, వాసంతి ముఖంపై కొడుతూ కనిపించారు. సెకండ్ రౌండ్‌లో బ్లూ టీమ్ గెలిచింది. మూడో రౌండ్‌లో మరోసారి రెడ్ టీమ్ గెలిచింది. బ్లూ టీమ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం రావడంతో రోహిత్ పేరు చెప్పారు రెడ్ టీమ్.
శ్రీహాన్‌ను టార్గెట్ చేసిన ఇనాయా
ఈ టాస్క్‌లో శ్రీహాన్‌ను టార్గెట్ చేసింది ఇనాయా. అతడిని పదే పదే మాటలతో రెచ్చగొడుతూ కనిపించింది. నువ్వు ఏ బెడ్‌లో పడుకుంటున్నావో తెలుసు అంటూ శ్రీహాన్‌ను అన్నది. ఆమె మాటలకు శ్రీహాన్‌తో పాటు శ్రీసత్య సీరియస్ అయ్యింది. ఇనాయాను ఉద్దేశించి నోరా పెంటా అది అన్నాడు శ్రీహాన్.
పర్సనల్ విషయాలు తాను ఏ రోజు మాట్లాడలేదని, లిమిట్ దాటలేదని అన్నాడు శ్రీహాన్. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని శ్రీహాన్ చెప్పాడు. గొడవ తీవ్రంగా మారడంతో ఇనాయా మాట మార్చేసింది. శ్రీసత్యతో తన రిలేషన్‌షిప్ విషయంలో ఓ క్లారిటీ, లిమిట్ ఉందని శ్రీహాన్ అన్నాడు. ఈ సారి తప్పుగా మాట్లాడితే బ్యాట్‌తో ముఖంపై కొడతానని వార్నింగ్ ఇచ్చాడు.
బాలాదిత్యను ఏడిపించిన గీతూ..
మరోవైపు బాలాదిత్యపై గీతూ ఆలిగింది. అతడికి సిగరెట్స్ ఇవ్వకుండా దాచేసి ఆటపట్టించింది. బాలాదిత్య ఎంత రిక్వెస్ట్ చేసినా గీతూ కరగలేదు. గీతూ మాటలకు బాలాదిత్య ఎమోషనల్ అయ్యాడు. అతడిని ఫైమా ఓదార్చింది. సిగ్గులేదా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావని తనను బాలాదిత్య అన్నాడని, అందుకే అతడికి సిగరెట్లు ఇవ్వనని, బాలాదిత్యతో మాట్లాడనని అన్నాడు.
చివరకు ఆవేశంలో నోరు జారానని క్షమించమని గీతూకు చేతులెత్తి దండం పెట్టాడు బాలాదిత్య. అయినా ఆ గొడవను అంతటితో ముగించలేదు గీతూ. మరుసటి రోజు అతడు సిగరెట్ తాగకుండా లైగర్ దాచేసింది. తాను వెధవన్నర వేధవ, దొంగ అని తనను తానే ప్రకటించుకుంది గీతూ.
సూర్యను గుర్తుతెచ్చుకున్న ఇనాయా
గత వారం ఎలిమినేట్ అయిన సూర్యను గుర్తుకుతెచ్చుకొని ఎమోషనల్ అయ్యింది ఇనాయా. పదే పదే సూర్య గుర్తొస్తున్నాడని అన్నది. హౌజ్‌లో కర్రీస్ అయిపోవడంతో భోజనం చేయకుండానే ఇనాయా పడుకుంది. తన క్యారెక్టర్ విషయంలో ఇనాయా మాట్లాడిన మాటల విషయంలో శ్రీసత్య హర్ట్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకున్నది. ఆదిరెడ్డిని కన్ఫేషన్‌రూమ్‌కు పిలిచాడు బిగ్‌బాస్. సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.
బిగ్‌బాస్ 60వ ఎపిసోడ్ హౌజ్‌మేట్స్ గొడవలతో రచ్చరచ్చగా మారింది. శ్రీహాన్‌తో ఇనాయా పదే పదే గొడవపడుతూ కనిపించింది. మరోవైపు బాలాదిత్యను గీతూ ఏడిపించింది.
టాపిక్