Bigg Boss 6 Telugu 53 Episode: రేవంత్ గీతూ మాటల యుద్ధం - సూర్య అంటే ఇష్టమని చెప్పిన ఇనాయా
27 October 2022, 8:39 IST
Bigg Boss 6 Telugu 53 Episode: చేపల చెరువు టాస్క్ మొత్తం గీతూ, రేవంత్ మాటల యుద్ధంతో ఆసక్తికరంగా సాగింది. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేస్తూ గేమ్‌ను ఇంట్రెస్టింగ్‌గా మార్చారు.
రేవంత్
Bigg Boss 6 Telugu 53 Episode: బిగ్‌బాస్ 53వ ఎపిసోడ్ మొత్తం రేవంత్, గీతూ మాటల యుద్ధంతో ఆసక్తికరంగా సాగింది. గీతూ తనను బూతు మాటలు అనడంతో రేవంత్ కోపంగా కనిపించాడు. తాను ఓడిపోయినా ఫర్వాలేదు కానీ గీతూ మాత్రం గెలవకూడదంటూ ఇనాయాతో చెబుతూ కనిపించాడు. తాను అన్న బూతు మాట విషయంలో రేవంత్‌కు స్వారీ చెప్పానని, కానీ అతడు దానిని పెద్దది చేస్తున్నాడని గీతూ అన్నది. రేవంత్ చేసే తప్పులను ఎత్తిచూపేవాళ్లు హౌజ్‌లో ఎవరూ లేరని అన్నది. రేవంత్ వల్లే తన గేమ్ స్టాప్ అయ్యిందని గీతూ చెప్పింది. ఆ తర్వాత చేపల చెరువు టాస్క్ ను కంటిన్యూ చేసిన బిగ్‌బాస్ గీతూ, ఆదిరెడ్డి సంచాలక్‌గా వ్యవహరించబోతున్నట్లుపేర్కొన్నాడు.
గీతూ కొత్త రూల్స్...
చేపల చెరువు టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్న గీతూ కొత్త రూల్స్ పెట్టడంతో రేవంత్ ఆమెతో వాదనకు దిగాడు. సంచాలక్‌కు రూల్స్ మార్చే ఆధికారం లేదంటూ అన్నాడు
ఒకరి వద్ద ఉన్న చేపలను మరో టీమ్ కొట్టేసేందుకు చాలా కష్టపడ్డారు. కానీ ఈ టాస్క్‌లో రేవంత్, బాలాదిత్య మాత్రమేఎక్కువగా ఇన్‌వాల్వ్ అయ్యి ఆడినట్లుగా కనిపించారు. గీతూ చేపలు ఏరుకోవడంతో రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పడిపోయిన చేపలనే తాను ఎరుకుంటున్నట్లుగా ఆమె చెప్పింది. సంచాలక్‌గా ఉన్న గీతూ కూడా గేమ్ ఆడటంపై ఆదిరెడ్డి కూడా కోపగించుకున్నాడు. ఇద్దరు వాదనలకు దిగారు. మైక్ పెట్టుకొని రేవంత్ పూల్‌లోకి దిగడంతో అతడి నుంచి పది చేపలు తీసుకుంటున్నట్లు గీతూ ప్రకటించింది. చేపల చెరువు టాస్క్‌లో గోల్డ్ కాయిన్ ఫైమాకు దొరికింది
షీల్డ్ వార్ టాస్క్
ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా షీల్ట్ వార్ టాస్క్‌ను హౌజ్‌మేట్స్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో నాలుగు జంటలు పోటీపడతాయని బిగ్‌బాస్ అన్నాడు. ఖాళీ అక్వేరియంలో ఒకరు నీళ్లు నింపగా మరో జంట సభ్యుడు అపోజిట్ టీమ్ వాళ్లను నీళ్లు నింపకుండా అడ్డుకోవాలని బిగ్‌బాస్ అన్నాడు. రేవంత్‌ను సంచాలక్‌గా ఉండగా రాజ్-ఫైమా, సూర్య - వాసంతి, బాలాదిత్య- మరీనా, శ్రీసత్య - శ్రీహాన్ ఈ గేమ్‌లో పోటీపడ్డారు. చివరకు ఇందులో సూర్య- వాసంతి టీమ్ గెలిచారు.
రేవంత్ విన్ కానీ...
ఆ తర్వాత చేపల చెరువు టాస్క్‌లో రేవంత్ - ఇనాయా టీమ్ గెలిచారు. కానీ చేపల చెరువు టాస్క్‌లో ఒక నల్లచేప వచ్చిందని ఆ చేప ఎవరి వద్ద ఉంటే మిగిలిన జంటల బాస్కెట్‌ను వారు స్వాప్ చేసుకోవచ్చునని అన్నాడు. ఆ నల్ల చేప గీతూ వద్ద ఉండటంతో రేవంత్ - ఇనాయా, శ్రీహన్ - శ్రీసత్య బాస్కెట్‌లను తీసుకున్నది. ఆమె ప్వాప్ చేయడంతో హర్ట్ అయిన రేవంత్ ఆడటం చేతకానీ వాళ్లే ఇలా చేస్తారని రేవంత్ అన్నాడు. ఈ టాస్క్ లో బాలాదిత్ - మరీనా జోడి డిస్ క్వాలిఫై అయినట్లుగా బిగ్‌బాస్ పేర్కొన్నాడు.
సూర్య అంటే ఇష్టమని చెప్పిన వాసంతి
మరోవైపు సూర్య అంటే తనకు ఇష్టమని, కానీ శ్రీహాన్‌పై ఎలాంటి ఫీలింగ్ లేదని ఇనాయా అన్నది. సూర్య చాలా తప్పులు చేస్తున్నాడని అన్నది. సూర్య బిహేవియర్ ఫేక్ కాదని అన్నది.