తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bholaa Shankar Trailer: “రామ్‍చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా": భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది”.. అదిరిపోయేలా!

Bholaa Shankar Trailer: “రామ్‍చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా": భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది”.. అదిరిపోయేలా!

27 July 2023, 16:29 IST

google News
    • Bholaa Shankar Trailer: భోళా శంకర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‍మెంట్ అదిరిపోయాయి.
భోళా శంకర్ ట్రైలర్ పోస్టర్
భోళా శంకర్ ట్రైలర్ పోస్టర్

భోళా శంకర్ ట్రైలర్ పోస్టర్

Bholaa Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీజర్ తర్వాతి నుంచి ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగిపోయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో వింటేజ్ చిరూను చూడనున్నామని టీజర్‌లోనే తెలిసిపోయింది. దీంతో మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భోళా శంకర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో భోళా శంకర్ సినిమా ట్రైలర్ నేడు (జూలై 27) రిలీజ్ అయింది. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే..

యాక్షన్, ఎంటర్‌టైన్‍మెంట్, కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్‍లతో భోళా శంకర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. హౌరా బ్రిడ్జి వద్ద కిడ్నాపింగ్ కథతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “పబ్లిక్‍కు గిట్ల ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గరికి పోతారు.. పోలీసులకే ప్రాబ్లం వస్తే భోళా భాయ్ వద్దకు వస్తాడు” అని గెటప్ శ్రీను డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత విలన్ ఎంట్రీ ఉంటుంది. మాన్‍స్టర్, డెస్ట్రాయర్ రావాలంటూ విలన్ డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత మెగాస్టార్ పవర్ ఫుల్ ఎంట్రీ ఉంది. ‘నా వెనుక దునియా ఉంది బే’ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. చిరూకి చెల్లి పాత్ర చేసిన కీర్తి సురేశ్ ఈ ట్రైలర్‌లో మరింత అందంగా కనిపించింది. హీరోయిన్ తమన్నా భాటియా లాయర్‌గా కనిపించింది. వెన్నెల కిశోర్‌, శ్రీముఖి సందడి ఉంది. “రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా” అంటూ చిరంజీవిని చూస్తూ తమన్నా చెప్పిన డైలాగ్ ఉంది. తమన్నాతో మెగాస్టార్ స్టెప్పులు అదిరిపోయాయి. సుశాంత్ కూడా కనిపించాడు. ఆ తర్వాత మెగాస్టార్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. చివరగా భోళా శంకర్ అండర్ కవర్ పోలీస్ అనే డైలాగ్ ఉంది. “మిమ్మల్నందరినీ ఎంటర్‌టైన్‍ చేద్దామని” అని పవన్ కల్యాణ్ స్టైల్‍లో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ చెప్పటంతో ఈ ట్రైలర్ ఎండ్ అయింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ కూడా మరోసారి ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ చూస్తే థియేటర్లలో మెగాస్టార్ అభిమానులకు పూనకాలే అనే కామెంట్లు వస్తున్నాయి. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ తెరకెక్కింది. అయితే, మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా మార్పులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు మెహర్ రమేశ్. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. భోళా శంకర్ చిత్రానికి మహతీ స్వరసాగర్ సంగీతం అందించాడు.

భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ సరసన తమన్నా భాటియా హీరోయిన్‍గా నటించగా.. చిరూ చెల్లెలి పాత్రను స్టార్ నటి కీర్తి సురేశ్ పోషించింది. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, తులసి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రామ్‍బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా.. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సినిమాటోగ్రఫీ చేశారు డూడ్లే.

తదుపరి వ్యాసం