Bigg Boss 8 Telugu Bebakka: అందుకు బాధగా ఉంది: ఎలిమినేషన్ తర్వాత బేబక్క.. ఆ నలుగురికి హౌస్‍లో ఉండే అర్హత లేదంటూ..
08 September 2024, 23:40 IST
- Bigg Boss 8 Telugu Bebakka: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ అనుకున్నట్టే బేబక్క హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. అయితే, హౌస్‍లో ఉండేందుకు అనర్హులు ఎవరని నాగార్జున అడిగితే నలుగురు పేర్లు చెప్పారు బేబక్క.
Bigg Boss 8 Telugu Bebakka: అందుకు బాధగా ఉంది: ఎలిమినేషన్ తర్వాత బేబక్క.. ఆ నలుగురికి హౌస్‍లో ఉండే అర్హత లేదంటూ..
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొలి వారం సక్సెస్‍ఫుల్‍గా ముగిసింది. మొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది. ఆదివారం ఎపిసోడ్ కావటంతో నేటి (సెప్టెంబర్ 8) ఎపిసోడ్‍లో కంటెస్టెంట్‍లతో ఫన్ గేమ్స్ ఆడించారు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. బిగ్‍బాస్ తెలుగులో ఫస్ట్ మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే సంప్రదాయం ఈ 8వ సీజన్‍లోనూ కొనసాగింది.
బిగ్‍బాస్ 8వ సీజన్ నుంచి తొలి వారమే యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‍లో ఫస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్‍గా నిలిచారు. ఎలిమినేషన్ తర్వాత బేబక్క మాట్లాడారు. హౌస్‍లో ఉండేదుకు అనర్హులు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగితే.. నలుగురు కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు బేబక్క.
తొలివారం రూ.5లక్షలు.. ముందుగా ఫన్ గేమ్స్
ఈ బిగ్‍బాస్ 8వ సీజన్‍లో సీజన్‍లో ప్రైజ్‍మనీ కాదని.. పేమనీ అని కంటెస్టెంట్లతో చెప్పారు నాగార్జున. ప్రతీవారం కంటెస్టెంట్ల ఆటను బట్టి ఆ మనీ పెరుగుతుందని అన్నారు. జీరోగా ఉన్న ప్రైజ్‍మనీ తొలివారం తర్వాత రూ.5 లక్షలకు చేరిందని తెలిపారు. ఆ తర్వాత ఫస్ట్ వీక్ రౌండప్‍ను కంటెస్టెంట్లకు చూపించారు నాగ్.
నామినేషనల్లో ఉన్న బేబక్క, విష్ణుప్రియ, శేఖర్ బాషా, మణికంఠ, పృథ్విరాజ్‍ను నిలబడాలని నాగార్జున చెప్పారు. ఆ తర్వాత పెట్టిన గేమ్‍లో శేఖర్ బాషా సేవ్ అయ్యారు. అనంతరం యాక్షన్ రూమ్‍లో బాయ్స్, గర్ల్స్‌ను రెండు టీమ్‍లుగా విడదీసి ఆటలు ఆడించారు నాగార్జున. సినిమాలకు సంబంధించిన గేమ్‍తో పాటు మరో గేమ్ కూడా ఆడించారు. ఇవి సరదాగా సాగాయి.
ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో యానిమల్ డెడికేట్ చేసి.. కారణాలు చెప్పాలని కంటెస్టెంట్లతో నాగార్జున చెప్పారు. ఇది కాస్త హీట్‍గానే సాగింది. ఈ క్రమంలో నామినేషన్ల నుంచి పృథ్విరాజ్, విష్ణుప్రియ సేవ్ అయ్యారు.
బేబక్క, మణికంఠ మధ్య ఉత్కంఠ
బేబక్క, మణికంఠ చివర్లో డేంజర్ జోన్‍లో నిలిచారు. పేపర్ ఓపెన్ చేసి ఎవిక్టెడ్ ఉన్న వారు ఎలిమినేట్ అయినట్టు నాగార్జున వారిద్దరికీ చెప్పారు. చివరికి బేబక్క ఎలిమినేట్ అయ్యారు. మరో అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు మణికంఠ. తాను ఇప్పటి నుంచి బెటర్‌గా ఉంటానని అన్నారు.
హౌస్ నుంచి స్టేజీ మీదికి బేబక్క వచ్చేశారు. ఆ తర్వాత బేబక్కను ఎవరు మిస్ అవుతారని నాగ్ కంటెస్టెంట్లను అడిగితే మణికంఠ, యష్మి, సోనియా, పృథ్వి, శేఖర్ బాషా మినహా మిగిలిన వారు చేతులు ఎత్తారు. ఆ తర్వాత హౌస్‍లో బేబక్క జర్నీని నాగార్జున చూపించారు.
ఆ విషయంలో బాధగా ఉంది
బిగ్‍బాస్ ద్వారా తనకు వచ్చిన మంచి అవకాశం మిస్ అయిందనే విషయంలో చాలా బాధగా ఉందని నాగార్జునతో బేబక్క చెప్పారు. ఇది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని అన్నారు. “ఇంత ఫాస్ట్‌గా వచ్చేస్తానని నేనైతే అనుకోలేదు. నాకైతే ఇంకా అవకాశం ఇస్తే ఇంకా బాగా ఆడి నిరూపించుకోగలనని అనిపించింది. అవకాశం మిస్ అయిందనే బాధ ఉంది. ఇది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని అనుకుంటాను” బేబక్క చెప్పారు.
ఆ నలుగురికి అర్హత లేదు
బిగ్‍బాస్ హౌస్‍లో ఉండేందుకు అర్హత లేని వాళ్లు ఎవరని అనుకుంటున్నారని బేబక్కను నాగార్జున అడిగారు. ఓ బోర్డుపై కంటెస్టెంట్ల ఫొటోలు పెట్టి.. అందులో రోడ్‍లా ఉన్నదానిపై వారి ఫొటోలను అతికించాలని నాగ్ చెప్పారు. హౌస్‍లో ఉండేందుకు సోనియా, పృథ్విరాజ్, నిఖిల్, మణికంఠకు అర్హత లేదని బేబక్క చెప్పారు.
నెగెటివ్‍గా ఉన్న సోనియాకు హౌస్‍లో ఉండేందుకు అర్హత లేదని బేబక్క అన్నారు. పృథ్విరాజ్ తనను అన్‍ఫిట్ అన్నారని, అతడికి అతికోపం సమస్య ఉందని చెప్పారు. నిఖిల్ కూడా హౌస్‍లో ఉండేందుకు సరైన వ్యక్తి కాదని బేబక్క అన్నారు. అతడి వల్లే తాను ఫుడ్‍లో కారం ఎక్కువ వేశానని, దానివల్లే సమస్య ఎక్కువైందని చెప్పారు. నమ్మకాన్ని నిఖిల్ వమ్ముచేశారని బేబక్క అన్నారు. మణికంఠ కూడా బిగ్‍బాస్ హౌస్‍లో ఉండేందుకు అర్హుడు కాదని బేబక్క చెప్పారు. “నీకు నువ్వుగా ఉంటున్నావ్. చాలా మాట్లాడేసుకుంటూ టెన్షన్ పడుతున్నావు. కాన్ఫిడెన్స్ రావాలి. అందరితో కలవాలి” అని మణికంఠతో బేబక్క చెప్పారు. నాగార్జున కూడా ఇది కరెక్ట్ అని అన్నారు. ఆ తర్వాత స్టేజ్ వదిలి బయటికి వెళ్లారు బేబక్క. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‍గా హౌస్ నుంచి ఔట్ అయ్యారు.