Nenu Student Sir Teaser: ఐఫోన్ దొంగిలించారని పోలీస్‌పైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకంటే?
08 January 2024, 22:13 IST
- Nenu Student Sir Teaser: బెల్లంకొండ గణేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నేను స్టూడెంట్ సర్. అవంతిక దస్సానీ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
నేను స్టూడెంట్ సర్ టీజర్
Nenu Student Sir Teaser: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ ఇటీవల స్వాతిముత్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా విడుదలైన ఆ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా గణేశ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. సహజమైన నటనతో ఆకట్టుకున్న గణేష్.. తన రెండో చిత్రంతో రెడీ అయిపోయాడు. అతడు నటించిన సరికొత్త చిత్రం నేను స్టూడెంట్ సర్. అవంతిక దస్సాని హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వీవీ వినయాక్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా టీజర్ గమనిస్తే.. హీరో తాను ఎంతో కష్టపడి రూ.89,999లు పెట్టి కొనుక్కున్న ఐఫోన్ పోతుంది. అందుకు పోలీసులే కారణమంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తాడు. దీంతో ఖాకీలు కూడా ఆశ్చర్యోపోతారు. ఇంతకీ ఆ ఐఫోన్ ఎలా పోయింది? అందులో పోలీసుల పాత్ర ఏంటి లాంటి విషాయలను తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
వీర్యదానం అనే కథాంశంలో తొలి చిత్రంతోనే వైవిధ్యమైన కథను ఎంచుకున్న బెల్లంకొండ గణేష్.. తన రెండో చిత్రం కూడా విభిన్నంగా ఉండేలా ఎంచుకున్నాడు. తన అమాయకత్వపు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. టీజర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
గణేశ్‌కు జోడీగా ఈ సినిమాలో అవంతకి దస్సానీ హీరోయిన్‌గా చేస్తుంది. సముద్రఖని కీలక పాత్రలో నటించారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు. నాంది ఫేమ్ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా రాఖి ఉప్పలపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షుల ముందుకు రానుంది.
టాపిక్