తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023 Tickets : బుక్ మై షోలో వరల్డ్ కప్ టికెట్స్.. ఎప్పుడు? ఎక్కడ కొనాలి?

world Cup 2023 Tickets : బుక్ మై షోలో వరల్డ్ కప్ టికెట్స్.. ఎప్పుడు? ఎక్కడ కొనాలి?

Anand Sai HT Telugu

24 August 2023, 5:47 IST

google News
    • world Cup 2023 Tickets : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2023 ICC వన్డే క్రికెట్ ప్రపంచ కప్ దగ్గరపడుతుంది. ఈ టోర్నమెంట్‌కు టిక్కెట్ ప్లాట్‌ఫారమ్‌గా BookMyShowని ఎంపిక చేసింది బీసీసీఐ.
వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టికెట్స్
వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టికెట్స్ (AFP)

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టికెట్స్

సెప్టెంబర్ 29న సన్నాహక మ్యాచ్‌లతో వరల్డ్ కప్ టోర్నమెంట్‌ ప్రారంభమవుతుంది. క్రికెట్ కోలాహలం నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను స్టేడియం స్టాండ్‌ల నుండి చూసే అవకాశం ఉంటుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 10 వార్మప్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 58 మ్యాచ్‌లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 12 ప్రధాన వేదికల్లో ఆడుతారు.

అభిమానులకు ఇబ్బందులు కలగకుండా.., టికెట్ అమ్మకాల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించడానికి పలు స్టెప్స్ ప్రవేశపెట్టారు. టికెట్స్ బుక్ చేసుకునేందుకు.. ప్రారంభ దశలో ICC వాణిజ్య భాగస్వామి మాస్టర్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 24 గంటల విండో కూడా ఉంటుంది. ప్రపంచ కప్ టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. టోర్నమెంట్ అధికారికంగా అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. అభిమానులు తమకు ఇష్టమైన మ్యాచ్‌ల కోసం టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయవచ్చో ఇక్కడ చూడండి.

క్రికెట్ అభిమానులకు అన్నీ కలిసిన టికెటింగ్ అనుభవాన్ని అందించడానికి, టికెటింగ్ ప్రక్రియను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన దశలుగా విభజించారు. ICC వాణిజ్య భాగస్వామి మాస్టర్ కార్డ్ కోసం ప్రత్యేకంగా 24 గంటల విండో రిజర్వ్ చేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక పత్రికా ప్రకటన ద్వారా టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించింది. టిక్కెట్ విక్రయాలు క్రింది దశల ప్రకారం వేరు చేశారు.

ప్రీ-సేల్ షెడ్యూల్ ఇలా..

ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుండి : మాస్టర్ కార్డ్ ప్రీ-సేల్; వార్మప్ గేమ్‌లు మినహా అన్ని నాన్-ఇండియన్ టోర్నమెంట్ మ్యాచ్‌లు

ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల నుండి : మాస్టర్ కార్డ్ ప్రీ-సేల్: వార్మప్ గేమ్‌లు మినహా టీమ్ ఇండియా మ్యాచ్‌లు

సెప్టెంబర్ 14 సాయంత్రం 6 గంటల నుండి : మాస్టర్ కార్డ్ ప్రీ-సేల్: సెమీ-ఫైనల్స్, ఫైనల్

ఇతరులకు టిక్కెట్ సేల్ ఇలా

ఆగస్ట్ 25 రాత్రి 8 గంటల నుండి : నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా టోర్నమెంట్ మ్యాచ్‌లు

ఆగస్టు 30 రాత్రి 8 గంటల నుంచి : గౌహతి, తిరువనంతపురంలో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు

ఆగస్టు 31 రాత్రి 8 గంటల నుంచి : చెన్నై, ఢిల్లీ, పుణెలలో టీమ్ ఇండియా టోర్నీ మ్యాచ్‌లు

సెప్టెంబర్ 1 రాత్రి 8 గంటల నుండి : ధర్మశాల, లక్నో, ముంబైలలో టీమ్ ఇండియా మ్యాచ్‌లు

సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి 8 గంటల నుంచి : బెంగళూరు, కోల్‌కతాలో టీమిండియా మ్యాచ్‌లు

సెప్టెంబరు 3 రాత్రి 8 గంటల నుంచి : అహ్మదాబాద్‌లో భారత్‌తో టీం ఇండియా తలపడుతుంది

సెప్టెంబర్ 15 రాత్రి 8 గంటల నుండి: సెమీ-ఫైనల్ మరియు ఫైనల్స్

తదుపరి వ్యాసం