తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharon Stone: నటుడితో శృంగారం చేయాలని బలవంతం చేసింది ఆ నిర్మాతే: పేరు వెల్లడించిన హాలీవుడ్ స్టార్

Sharon Stone: నటుడితో శృంగారం చేయాలని బలవంతం చేసింది ఆ నిర్మాతే: పేరు వెల్లడించిన హాలీవుడ్ స్టార్

13 March 2024, 15:19 IST

google News
    • Sharon Stone: తన సహచర నటుడితో సెక్స్ చేయాలని తనను ఏ నిర్మాత బలవంతం పెట్టారో ఆయన పేరు వెల్లడించారు హాలీవుడ్ అలనాటి హీరోయిన్ షారోన్ స్టోన్. అప్పుడు జరిగిన పరిస్థితులను తాజాగా ఓ పోడ్‍కాస్ట్‌లో తెలిపారు.
షారోన్ స్టోన్
షారోన్ స్టోన్

షారోన్ స్టోన్

Sharon Stone: హాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ షారోన్ స్టోన్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. 1993లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సిల్వర్ మూవీ నాటి విషయాలను ఆమె తాజాగా ఓ పోస్ట్ కాస్ట్‌లో చెప్పారు. ఆ చిత్రంలో హీరో బిల్లీ బాల్డ్‌విన్‍కు జోడీగా షారోన్ స్టోన్ నటించారు. అయితే, సిల్వర్ మూవీని ప్రొడ్యూజ్ చేసిన నిర్మాత రాబర్ట్ ఇవాన్స్‌పై ఇప్పుడు షాకింగ్ విషయాలు చెప్పారు స్టోన్. ఆన్ స్క్రీన్‍లో కెమెస్ట్రీ బాగా పండాలంటే.. బాల్డ్‌విన్‍తో సెక్స్ చేయాలని తనను ఇవాన్స్‌ బలవంతం చేశారని షారోన్ స్టోన్ ఆరోపించారు.

లూయిస్ థెరోక్స్ పోడ్‍కాస్ట్‌లో ఈ విషయాన్ని 66ఏళ్ల షారోన్ స్టోన్ వెల్లడించారు. బాడ్విన్‍తో ఆఫ్ స్క్రీన్‍లో శృంగారం చేయాలని, అలా అయితే సినిమా ఇంకా బాగా వస్తుందని నిర్మాత రాబర్ట్ ఇవాన్స్‌ తనపై ఒత్తిడి చేశారని ఆమె చెప్పారు.

పర్ఫార్మెన్స్ కోసం..

ముందుగానే శృంగారం చేస్తే బాల్డ్‌విన్ మరింత బాగా పర్ఫార్మ్ చేయగలరని తనతో ఇవాన్స్‌ చెప్పారని షారోన్ స్టోన్ వెల్లడించారు. “నన్ను ఆయన (ఇవాన్స్‌) ఆఫీస్‍కు పిలిచారు. సన్‍గ్లాసెస్ పెట్టుకొని ఆఫీస్‍లో తిరుగుతూ ఆయన నాకు వివరించారు. తాను ఇవా గార్డెనర్‌తో పడుకున్నానని.. అలాగే నేను బిల్లీ బాల్డ్‌విన్‍తో గడపాలని నాకు చెప్పారు. నేను బిల్లీ బాల్డ్‌విన్‍తో శృంగారం చేస్తే అతడి పర్ఫార్మెన్స్ మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. బిల్లీ ఈ మూవీలో ఇంకా బాగా చేయాలని.. ప్రస్తుతం అదే సమస్యగా ఉందని అన్నారు” అని షారోన్ స్టోన్ వెల్లడించారు.

ఈ కారణంగానే తాను సిల్వర్ సినిమాలో చాలా బిగుసుకుపోయినట్టు కనిపించానని షారోన్ స్టోన్ చెప్పారు. బేసిక్ ఇన్‍స్టిక్ట్ చిత్రంలో చాలా ఇంటిమేట్ సీన్లు ఉన్నా.. మైకేల్ డోగ్లాస్‍తో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురవలేదని ఆమె వెల్లడించారు.

బేసిస్ ఇన్‍స్టిక్ట్ ఫ్రాంచైజీతో పాటు ది స్పెషలిస్ట్ (1994), కాసినో (1995), టోటల్ రికాల్ (1990) చిత్రాలతోనూ షారోన్ స్టోన్ బాగా పాపులర్ అయ్యారు.

ఇప్పుడెందుకు మాట్లాడడం..

షారోన్ స్టోన్ ఆరోపణలతో సిల్వర్ మూవీ హీరో బిల్లీ బాల్డ్‌విన్ స్పందించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాలను షారోన్ ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన ట్వీట్ చేశారు.

“ఇన్ని సంవత్సరాల తర్వాత షారోన్ స్టోన్ ఇంకా దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు? నాపై ఇంకా ఆమెకు క్రష్ ఉందా లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఆ బాధ ఉందా?” అని బిల్లీ బాల్డ్‌విన్ ట్వీట్ చేశారు. తాను తలుచుకుంటే షారోన్ స్టోన్‍పై బురద జల్లేందుకు చాలా విషయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను ఓ పుస్తకం రాసి షారోన్ స్టోన్ గురించి ఎన్నో అసహ్యకరమైన, కలత చెందే విషయాలు, ఆమె అన్ ప్రొఫెషనల్ తీరు గురించి చెప్పాలా? అది సరదాగా కూడా ఉండొచ్చు” అని బాల్డ్‌విన్ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.

హాలీవుడ్‍లో చాలా బడా సినిమాలను నిర్మించిన రాబర్ట్ ఇవాన్స్ 2019లో మృతి చెందారు. ఇప్పుడు, ఆయనపై షాకింగ్ విషయాలను వెల్లడించారు షారోన్ స్టోన్.

తదుపరి వ్యాసం